RSS

Daily Archives: August 8, 2014

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటుDate: 08/08/2014


తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటుDate: 08/08/2014
హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటైంది. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆగ‌స్టు 8న ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్‌ తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. గవ‌ర్నర్ న‌ర‌సింహ‌న్ తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ ఏర్పాటుకు సంబంధించిన ద‌స్త్రంపై ఆగ‌స్టు 7న సంత‌కం పెట్టిన సంగ‌తి తెలిసిందే. క‌మిష‌న్ ఏర్పాటు నేప‌థ్యంలో ప్రభుత్వ శాఖ‌ల్లో ఖాళీల భ‌ర్తీకి మార్గం సుగ‌మ‌మైంది.

 
Comments Off on తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటుDate: 08/08/2014

Posted by on August 8, 2014 in Uncategorized

 

టీపీఎస్సీకి గవర్నర్‌ ఆమోదం


టీపీఎస్సీకి గవర్నర్‌ ఆమోదం

* ఒకటి, రెండు రోజుల్లో ఏర్పాటుకు ఉత్తర్వులు
* వెంటనే ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు సన్నాహాలు!
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీపీఎస్సీ) ఏర్పాటుకు ఒకట్రెండు రోజుల్లోనే ఉత్తర్వులు జారీ కానున్నాయి. టీపీఎస్సీ దస్త్రానికి రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ఆగ‌స్టు 7న‌ ఆమోదం తెలిపారు. రాష్ట్ర విభజన దృష్ట్యా ప్రత్యేక పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ఏర్పాటు చేసి, పెద్దఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసి నియమనిబంధనలను రూపొందించింది. జులై 16న జరిగిన మంత్రిమండలి సమావేశంలో దీన్ని ఆమోదించి దస్త్రాన్ని గవర్నర్‌కు పంపించారు. గవర్నర్‌ దస్త్రాన్ని పరిశీలించి ఆమోదం తెలిపారు. ఛైర్మన్‌, సభ్యులు కమిషన్‌కు కీలకమైనందున.. సచ్చీలురైన విశ్రాంత ఉన్నతాధికారులు, నిపుణులు, అనుభవజ్ఞులను ఎంపిక చేయాలని ఆయన సూచించినట్లు సమాచారం. గవర్నర్‌ ఆమోదంతో దస్త్రం ప్రభుత్వానికి చేరింది. ఆగ‌స్టు 8న‌ ఈ దస్త్రాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పరిశీలించనున్నారు. ఆయన అనుమతి పొందిన వెంటనే కమిషన్‌ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ కానున్నాయి. తొలుత ఒక ఐఏఎస్‌ అధికారిని కార్యదర్శిగా నియమించి కమిషన్‌ను ప్రారంభించనున్నారు. ఛైర్మన్‌, సభ్యుల నియామకాలకు కొంత సమయం పడుతుందంటున్నారు.
చురుగ్గా ఏర్పాట్లు
తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ కార్యాలయంగా ప్రస్తుత ఏపీ కమిషన్‌ కార్యాలయంలోని నాలుగు, అయిదో అంతస్థులను ఎంపిక చేశారు. ఉద్యోగుల విభజన కూడా పూర్తయింది. ఏర్పాటు ఉత్తర్వులతో పాటు ఉద్యోగుల నియామకాలు, కార్యాలయ విభజనకు ఆదేశాలు జారీ కానున్నాయి. కమిషన్‌ ఏర్పడిన వెంటనే పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే శాఖలవారీగా ఖాళీల వివరాలు సేకరించాలని ఆదేశించింది. ఉద్యోగుల విభజనకు సంబంధం లేని కొత్త నియామకాలను చేపట్టాలని భావిస్తోంది.

 
Comments Off on టీపీఎస్సీకి గవర్నర్‌ ఆమోదం

Posted by on August 8, 2014 in Uncategorized