RSS

Daily Archives: October 8, 2013

Guidelines for sanction of Pre-Matric Scholarships to SC Students studying from Class V to VIII from the year 2013-14


2013SW_MS57

Advertisements
 
Comments Off on Guidelines for sanction of Pre-Matric Scholarships to SC Students studying from Class V to VIII from the year 2013-14

Posted by on October 8, 2013 in Uncategorized

 

ఉన్నతవిద్యకు బ్రహ్మరథం


2014లోనూ కొనసాగించాలని నిర్ణయం
* ఏప్రిల్ 6న పరీక్ష
* రూ.98 వేల కోట్లతో కేంద్రం బృహత్‌ ప్రణాళిక
* రాష్ట్రాల పరిధిలోని విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలకు నిధుల వెల్లువ
న్యూఢిల్లీ: దేశంలో ఉన్నతవిద్యారంగాన్ని సమూలంగా మార్చివేయటానికి కేంద్రప్రభుత్వం రూ.98,000 కోట్ల భారీవ్యయంతో ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ‘రాష్ట్రీయ ఉచ్చతర్‌ శిక్ష అభియాన్‌’ (ఆర్‌యూఎస్‌ఏ) అనే ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం అక్టోబరు 3న ఆమోదముద్ర వేసింది. రాష్ట్రాల్లో ఏర్పాటయ్యే ఉన్నత విద్యా మండళ్ల ద్వారా ఈ పథకాన్ని కేంద్రం అమలు చేయనుంది. కేంద్రం, రాష్ట్రం వాటా 65:35 నిష్పత్తితో ఇది అమలవుతుంది. ఈశాన్యరాష్ట్రాలు, జమ్మూకాశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో మాత్రం ఈ నిష్పత్తి 90:10 నిష్పత్తితో ఉంటుంది. 12, 13వ పంచవర్ష ప్రణాళికల కాలంలో ఆర్‌యూఎస్‌ఏ అమలు కానుంది. ఈ వివరాల్ని కేంద్ర మానవవనరులశాఖ సహాయమంత్రి శశిథరూర్‌ అక్టోబరు 4న వెల్లడించారు. ఉన్నతవిద్యారంగానికి కేంద్రం ఇచ్చే నిధులకు సంబంధించి ఈ పథకం ఒక వ్యూహాత్మక మార్పును తీసుకొస్తుందని థరూర్‌ చెప్పారు. ఇప్పటివరకూ కేంద్రం నిధులు ఎక్కువగా కేంద్ర విద్యాసంస్థలకే మంజూరు అవుతున్నాయని.. ఇక మీదట రాష్ట్రాల పరిధిలోని విద్యాసంస్థలకు అధికమొత్తంలో నిధులను మంజూరు చేయటం జరుగుతుందని తెలిపారు. దేశంలో ఉన్నతవిద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో దాదాపు 95 శాతం మంది రాష్ట్రాల పరిధిలోని విద్యాసంస్థల్లోనే చదువుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఐఐటీల వంటి అత్యల్పసంఖ్యలో ఉన్న కేంద్రవిద్యాసంస్థలకు ఏటా కేంద్రం నుంచి రూ.6,000 కోట్ల గ్రాంటు అందుతుండగా.. దేశవ్యాప్తంగా ఉన్న 350 విశ్వవిద్యాలయాలకు, 900 కళాశాలలకు లభిస్తున్న గ్రాంటు రూ.1,000 కోట్లేనని శశిథరూర్‌ వెల్లడించారు. ఆర్‌యూఎస్‌ఏ అమలుతో ఈ పరిస్థితి మారుతుందని.. రాష్ట్రాల పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో ఉన్నతప్రమాణాలతో కూడిన విద్యాబోధన, పరిశోధన జరగటానికి, మెరుగైన సౌకర్యాల ఏర్పాటుకు అవకాశం లభిస్తుందన్నారు. రాష్ట్రాల్లో ఏర్పాటయ్యే స్వయంప్రతిపత్తిసంస్థ ‘రాష్ట్ర ఉన్నత విద్యా మండలి’ ద్వారా ఆర్‌యూఎస్‌ఏ అమలవుతుందని.. ఈ మండలి పనిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం ఉండబోదని స్పష్టం చేశారు. ప్రస్తుతం కేవలం ఆరు రాష్ట్రాల్లోనే ఈ మండలి ఏర్పాటైందని చెప్పారు. ఆర్‌యూఎస్‌ఏ పథకం అమలులో సమన్వయం కోసం కేంద్రం, రాష్ట్రాల స్థాయిలో ‘సాంకేతిక సహకార గ్రూపు’ అనే వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్‌యూఎస్‌ఏ కింద చేపట్టనున్న ఇతర కార్యక్రమాల గురించి మంత్రి వివరించారు. ఆ వివరాలు..
* అటానమస్‌ కాలేజీలను లేదా ఒకే సమూహంగా ఉన్న కొన్ని కాలేజీలను కలిపి కొత్తగా 80 విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయటం.
* వృత్తి, సాంకేతిక తదితర కోర్సులతో కూడిన 100 కొత్త కళాశాలల ఏర్పాటు. ఇప్పటికే ఉన్న 54 కాలేజీలను ఆదర్శ డిగ్రీ కాలేజీలుగా తీర్చిదిద్దటం.
* 150 విశ్వవిద్యాలయాలకు మౌలికసదుపాయాల గ్రాంట్లను మంజూరు చేయటం.
* 3,500 కాలేజీల్లో గ్రంథాలయాలను, ప్రయోగశాలలను మెరుగుపరచటం.
* 5000 అధ్యాపక సిబ్బందికి వేతనాలు.
* ఉన్నతవిద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదుశాతాన్ని ఇప్పుడున్న 18 నుంచి 2022 నాటికి 30 శాతానికి పెంచటం.
* ఉన్నత విద్యాసంస్థలను నగరాలకే పరిమితం చేయకుండా.. గ్రామాలు, చిన్నస్థాయి పట్టణాల్లో కూడా నెలకొల్పటం.

 
1 Comment

Posted by on October 8, 2013 in Uncategorized

 

కణా’పాఠీలకు వైద్య నోబెల్‌


స్టాక్‌హోం: నోబెల్‌ బహుమతుల సందడి మొదలైంది. ఎప్పటిలాగే వైద్య శాస్త్రంతోనే విజేతల ప్రకటన ప్రారంభమైంది. ఈసారి ఈ విభాగంలో అమెరికాకు చెందిన జేమ్స్‌ రాథ్‌మన్‌, ర్యాండీ షెక్‌మన్‌ జర్మనీకి చెందిన థామస్‌ సుడాఫ్‌లను సంయుక్తంగా బహుమతిని గెల్చుకున్నారు. కణాల లోపల, వెలుపల హార్మోన్లు, ఎంజైమ్‌లు రవాణా అవుతున్న తీరుపై వీరు జరిపిన పరిశోధనకు గాను వీరికి ఈ గౌరవం దక్కింది. వీరి పరిశోధన.. మధుమేహం, అల్జీమర్స్‌ వంటి వ్యాధులపై మరింత అవగాహనకు తోడ్పడిందని నోబెల్‌ కమిటీ కొనియాడింది. అవార్డు కింద 12 లక్షల డాలర్లు దక్కుతాయి. దీన్ని ముగ్గురికీ సమానంగా పంచుతారు. డిసెంబర్‌ 10న స్టాక్‌హోంలో జరిగే వేడుకలో విజేతలకు బహుమతులు అందిస్తారు.

విజేతలు ముగ్గురూ అమెరికా విశ్వవిద్యాలయాల్లోనే ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. రాథ్‌మన్‌ యేల్‌ వర్సిటీలో, షెక్‌మన్‌ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో, సుడాఫ్‌.. స్టాన్‌ఫర్డ్‌ వర్సిటీలో పనిచేస్తున్నారు. వీరు కణాల్లోని రవాణా వ్యవస్థపై కీలక పరిశోధనలు సాగించారు. శరీరంలో ప్రతి కణమూ ఒక కర్మాగారమే. అది పరమాణువులను తయారుచేసి, ఎగుమతి చేస్తుంది. రాథ్‌మన్‌, షెక్‌మన్‌, సుడాఫ్‌లు వెసికిల్స్‌ అనే బుల్లి బుడగల ద్వారా ఇన్సులిన్‌ వంటి రసాయనాలను చేరవేసే కీలక నెట్‌వర్క్‌లను గుర్తించారు.

ఇది ఎంత కీలకమంటే.. ఈ యంత్రాంగంలో లోపాల వల్ల మరణం సంభవించే ప్రమాదం ఉంది. ”అద్భుతమైన కచ్చితత్వంతో కూడిన ఈ వ్యవస్థ లేకుంటే కణాలు గందరగోళ పరిస్థితుల్లోకి చేరిపోతాయి. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు తమ ఆవిష్కరణల ద్వారా కణ సరకు రవాణా, బట్వాడాకు సంబంధించిన అత్యంత కచ్చితమైన నియంత్రణ వ్యవస్థను వెలుగులోకి తెచ్చారు” అని వైద్య నోబెల్‌ను ప్రకటించే కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌ పేర్కొంది. రోగనిరోధక శక్తిలో లోపం, ఆటిజం వంటి మెదడు సంబంధ రుగ్మతలపై మెరుగైన అవగాహనకు ఈ పరిశోధన వీలు కల్పిస్తుందని నోబెల్‌ కమిటీ వివరించింది.

 

 
Comments Off on కణా’పాఠీలకు వైద్య నోబెల్‌

Posted by on October 8, 2013 in Uncategorized

 

దైవకణం పరిశోధన శాస్త్రవేత్తలకు నోబెల్‌


స్టాక్‌హోం: ‘దైవకణం’పై పరిశోధన చేసిన శాస్త్రజ్ఞులను భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి వరించింది. పీటర్‌ హిగ్స్‌(బ్రిటన్‌), ఫ్రాంకోయిస్‌ ఎంగ్లర్ట్‌(బెల్జియం)లకు భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి ప్రకటించారు.

 
Comments Off on దైవకణం పరిశోధన శాస్త్రవేత్తలకు నోబెల్‌

Posted by on October 8, 2013 in Uncategorized

 

కొలువుల జాతర


  • 3,048 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చ జెండా
  • * మున్సిపాల్టీల్లో ఉపాధ్యాయ ఖాళీలు 1276
  • * రవాణా శాఖలో అదనంగా 392
  • * విశ్వవిద్యాలయాల్లో 821
  • * ఆర్థిక శాఖ అనుమతి

ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. 3,048 ఉద్యోగాల నియామకానికి ఆర్థిక శాఖ పచ్చ జెండా వూపింది. మున్సిపాల్టీల్లోని ఉపాధ్యాయ ఉద్యోగాల ఖాళీలు 1276 ఉన్నట్లు గుర్తించారు. వాటిని డీఎస్సీల ద్వారా భర్తీ చేస్తారు. పలు విశ్వవిద్యాలయాల్లో 821 ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. రవాణాశాఖకు అదనంగా 392 ఉద్యోగాలను మంజూరు చేశారు. వీటితోపాటు వివిధ విభాగాల్లోని 287 ఉద్యోగాల నియామకాన్ని ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్‌కి అప్పగించారు. ఆర్టీసీలో 604 పోస్టులు భర్తీ చేసుకొనేందుకు అనుమతించారు. జూన్ నెలలో ఆర్థిక శాఖ 57,304 ఖాళీల భర్తీకి అనుమతిని ఇచ్చింది. వివిధ శాఖల నుంచి మరిన్ని ప్రతిపాదనలు రావడంతో తాజాగా మరిన్ని ఉద్యోగాల భర్తీకి అనుమతిని మంజూరు చేసింది.
జిల్లా, జోన్లవారీగా ఖాళీల వివరాలు, రోస్టర్ పాయింట్లు, అర్హతల వివరాలన్నింటినీ రప్పించుకొని నియామక ప్రక్రియను చేపడతారు. గ్రంథాలయాలు, గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుల కార్యాలయాల్లోని జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం పేరుని జూనియర్ అసిస్టెంట్ కమ్ డాటా ప్రాసెసింగ్ అసిస్టెంట్‌గా మార్చారు.

 

 
Comments Off on కొలువుల జాతర

Posted by on October 8, 2013 in Uncategorized

 

పాలిటెక్నిక్ అధ్యాపకులుగా ఎంపికైన వారికి… ఎట్టకేలకు నియామకపత్రాలు


* 15న కౌన్సెలింగ్
ఈనాడు, హైదరాబాద్: పాలిటెక్నిక్ అధ్యాపక పోస్టులకు ఎంపికైన వారి నిరీక్షణ ఫలించింది. ఏపీపీఎస్సీ ద్వారా ఎంపికైన 887 (14 సబ్జెక్టులు) మంది అభ్యర్థుల నియామకపత్రాలను సాంకేతిక విద్యాశాఖ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. అధికారులు వీరికి వ్యక్తిగతంగానూ సమాచారం పంపుతున్నారు. పోస్టింగ్ ప్రదేశాలను 15న మాసబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక విద్యాభవన్‌లో కౌన్సెలింగ్ ద్వారా కేటాయిస్తారు. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ అజయ్ జైన్ సెప్టెంబరు 5న (శనివారం) ప్రకటన జారీచేశారు. కొత్తవారి రాక కారణంగా ఒప్పంద అధ్యాపకులు ఇదే సంఖ్యలో బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తాయి. అయితే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలనీ, ఇందుకు వీరిలో 400 మంది సేవలను ఉపయోగించుకోవాలని సాంకేతిక విద్యాశాఖ నిర్ణయించింది. రోజు మొత్తం మీద వీరికి రెండు మూడు గంటలు మాత్రమే బోధించే అవకాశం కల్పిస్తారు. ఈ కారణంగా ఇన్నాళ్లూ నెలకు రూ.19 వేల చొప్పున వేతనం తీసుకుంటూ వచ్చిన ఒప్పంద అధ్యాపకులకు ఇకపై రూ.8 వేల చొప్పున మాత్రమే గౌరవ వేతనం దక్కనుంది. మిగిలిన 487 మంది బయటకు వెళ్లక తప్పదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

 
Comments Off on పాలిటెక్నిక్ అధ్యాపకులుగా ఎంపికైన వారికి… ఎట్టకేలకు నియామకపత్రాలు

Posted by on October 8, 2013 in Uncategorized

 
 
%d bloggers like this: