RSS

Daily Archives: October 12, 2013

ఏపీపీఎస్సీపై మండిపడ్డ గ్రూపు – 1 అభ్యర్థులు


హైదరాబాద్, న్యూస్‌టుడే:
ఏపీపీఎస్సీ నిర్లక్ష్యం కారణంగా తాము నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపిస్తూ గ్రూపు – 1 (2011) అభ్యర్థులు 11న (శుక్రవారం) నాంపల్లిలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఇంటర్వ్యూలు పూర్తయిన వారిలో ప్రతిభ ప్రకారం ఎంపికైనవారికి పోస్టింగ్స్ ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. ఇంటర్వ్యూలు జరిగి ఆరు నెలలు గడిచినా ఫలితాలు విడుదల చేయడం లేదని ఆరోపించారు. ఏపీపీఎస్సీ న్యాయవాదులు న్యాయస్థానానికి తగిన రీతిలో వివరణ ఇవ్వనందువల్లే సుప్రీంకోర్టు ఆరు ప్రశ్నలను తప్పుపడుతూ మరోసారి మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని తీర్పు వెలువరించిందని పేర్కొన్నారు. ఒకసారి పరీక్ష రాసి ఫెయిలైన వారికి, పరీక్షకు హాజరు కాని వారికి మళ్లీ పరీక్ష ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. అధికారులు చేసిన తప్పుల కారణంగా తమను తిరిగి పరీక్షకు, ఇంటర్వ్యూకు హాజరు కావాలనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఏపీపీఎస్సీ తగిన రీతిలో సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలుచేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఓ సందర్భంగా వారంతా కార్యాలయంలోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. చివరకు కొందరు బృందంగా ఏర్పడి సంస్థ కార్యదర్శి చారుసిన్హాను కలుసుకున్నారు. తమ డిమాండ్ల పట్ల ఆమె సానుకూలంగానే స్పందించారని అనంతరం వారు విలేకరులకు తెలిపారు. ఇంటర్వ్యూలకు హాజరైనవారికి తిరిగి పరీక్ష రాసే అవసరం రాకపోవచ్చునని చెప్పారన్నారు. ప్రిలిమ్స్‌లో 144 మార్కుల ప్రామాణికంగా ఎవరైనా మెయిన్స్‌కు అర్హత సాధించి ఉంటే వారికే మెయిన్స్, ఇంటర్వ్యూలు జరిపేలా న్యాయస్థానాన్ని అభ్యర్థిస్తామని కార్యదర్శి హామీ ఇచ్చారని వివరించారు.

Advertisements
 
Comments Off on ఏపీపీఎస్సీపై మండిపడ్డ గ్రూపు – 1 అభ్యర్థులు

Posted by on October 12, 2013 in Uncategorized

 

డీఎస్సీ-2012 బాధితులకు న్యాయం చేస్తాం


* మంత్రి పార్థసారథి
డీఎస్సీ-2012 తొలి జాబితాలో ఉద్యోగాలు వచ్చి రెండో జాబితాలో కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి తెలిపారు. రెండో జాబితాలో 987 మంది ఉద్యోగాలు కోల్పోయారని, వారిలో 460 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ట్రైబ్యునల్ ఆదేశించిందని తెలిపారు. మిగతా వారి గురించి ముఖ్యమంత్రిని కలిసి వివరించగా… మిగిలిన వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం ఆదేశించారని తెలిపారు.

 
Comments Off on డీఎస్సీ-2012 బాధితులకు న్యాయం చేస్తాం

Posted by on October 12, 2013 in Uncategorized

 

అటవీ శాఖలో 3,820 పోస్టులు


అటవీ శాఖలో 3,820 పోస్టులు

* మూడు దశల్లో భర్తీ
ఈనాడు, హైదరాబాద్: అటవీ శాఖలో 3,820 ఖాళీలను మూడు దశల్లో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను అక్టోబరు 11న (శుక్రవారం) జారీ చేసింది. ఈ ఖాళీలన్నీ ఒకేసారి భర్తీ చేస్తే… ఆర్థిక భారం తలెత్తుతుందని.. దశలవారీగా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1274 పోస్టులు, 2014-15లో 1273, 2015-16లో 1273 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతించింది. వీటిలో అటవీ రేంజి ఆఫీసర్ పోస్టులు 120, సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 600, బీట్ ఆఫీసర్లు 1,600, సహాయ బీట్ ఆఫీసర్ పోస్టులు 1,500 ఉన్నాయి. ఒకే దఫా ఇన్ని పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతించినందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అటవీ శాఖా మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కృతజ్ఞతలు తెలిపారు. సహాయ బీట్ ఆఫీసర్లలో 1184 పోస్టులు తెలంగాణలోనే భర్తీ చేయనున్నారు.

 
Comments Off on అటవీ శాఖలో 3,820 పోస్టులు

Posted by on October 12, 2013 in Uncategorized

 
 
%d bloggers like this: