RSS

మార్చి 12 నుంచి ఇంటర్‌ పరీక్షలు!

13 Oct

* ఫిబ్రవరి 12 నుంచి ప్రాక్టికల్స్‌
ఈనాడు – హైదరాబాద్‌, గుంటూరు: సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు వారంరోజులపాటు ఆలస్యంగా జరగబోతున్నాయి. ఈ మేరకు మాధ్యమిక విద్యాశాఖ సంకేతాలు ఇచ్చింది. ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో చర్చించిన మేరకు ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలను వచ్చే ఏడాది మార్చి 12వతేదీ నుంచి జరపాలని ప్రాథమికంగా నిర్ణయించారు. సాధారణ పరిస్థితుల్లోనైతే మార్చి మొదటి వారంలోనే ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు మొదలయ్యేవి. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా ఇంటర్‌ కళాశాలలు సీమాంధ్రలో సక్రమంగా పనిచేయలేదు. ఈ నేపథ్యంలో, కోల్పోయిన బోధన సమయాన్ని సర్దుబాటు చేసేందుకు ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలను కొద్దిరోజులపాటైనా వాయిదావేయటంపై ఇంటర్‌ విద్యాశాఖలో తర్జనభర్జనలు సాగుతున్నాయి. అయితే జేఈఈ మెయిన్స్‌ (ఏప్రిల్‌-6), అడ్వాన్డ్సు (మే 25), ఎంసెట్‌ తదితర పరీక్షలు కూడా ఉన్నందున.. మార్చిలోనే ఇంటర్‌ పరీక్షలు జరపడం అనివార్యమని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు మార్చి 12 నుంచి పరీక్షలు ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రాక్టికల్స్‌ను (ప్రయోగ పరీక్షలను) ఫిబ్రవరి 12వ తేదీనుంచి జరపనున్నారు. పబ్లిక్‌ పరీక్షల కంటే నెలరోజుల ముందు ప్రయోగపరీక్షలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు నుంచి మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారధికి దస్త్రం త్వరలో వెళ్లనుంది.

 
Comments Off on మార్చి 12 నుంచి ఇంటర్‌ పరీక్షలు!

Posted by on October 13, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: