RSS

ఈసారీ జంబ్లింగ్‌ లేనట్టేనా..?

20 Oct

ఇంటర్‌ ప్రయోగ పరీక్షల్లో అమలు కాని విధానం
* నాలుగేళ్లుగా ఏదో ఒక వంకతో వాయిదా
ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ ప్రయోగ పరీక్షల్లో(ప్రాక్టికల్స్‌) జంబ్లింగ్‌ విధానం అమలును ఈ ఏడాదీ పక్కనబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల ఒత్తిళ్లతో జంబ్లింగ్‌ పద్ధతిలో ప్రయోగ పరీక్షలు నిర్వహించడం కలగా మారుతోంది. దీంతో పెద్దమొత్తంలో మామూళ్లు సమర్పించుకున్న కళాశాలల విద్యార్థులకు అధిక మార్కులు.. సమర్పించుకోలేని కళాశాలలు, ప్రభుత్వ కళాశాలల నుంచి పరీక్షలు రాయనున్న వారికి అరకొర మార్కులు తప్పేలా లేవు. ఇలాంటి అక్రమాలను అరికట్టేందుకు జంబ్లింగ్‌ విధానాన్ని అమలుచేయాలని గత నాలుగేళ్లుగా మాధ్యమిక విద్యాశాఖ ప్రయత్నిస్తూనే ఉన్నా.. కొన్ని జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు వివిధ అంశాలను తెరపైకి తెచ్చి మోకాలడ్డుతున్నాయి. ఈసారి ఫిబ్రవరి 12 నుంచి నుంచి ప్రాక్టికల్స్‌ జరపాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించినా ఇంతవరకు జంబ్లింగ్‌పై అధికారిక నిర్ణయం వెలువడలేదు. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి తమ కార్యాచరణ ఉంటుందని బోర్డు వర్గాలు పేర్కొంటున్నాయి. ఫిబ్రవరిలో నిర్వహించాల్సిన ప్రాక్టికల్స్‌ గురించి ఇప్పటికే జిల్లా అధికారులను అప్రమత్తం చేయాల్సిన ఇంటర్‌ బోర్డులో ఎలాంటి హడావుడీ లేదు.
అద్యంతం అక్రమాలమయం: ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం బైపీసీ, ఎంపీసీ గ్రూపులో నాలుగున్నర లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఎంసెట్‌, జేఈఈ మెయిన్స్‌, ఇతర పోటీ పరీక్షల్లో ఇంటర్‌ మార్కులకు అధిక ప్రాధాన్యం ఉంది. ప్రయోగ పరీక్షల్లో సాధించే మార్కులు మొత్తం మార్కులను ప్రభావితం చేస్తాయి. అయినప్పటికీ ప్రయోగపరీక్షల నిర్వహణ విషయంలో కఠిన చర్యలే ఉండడం లేదు. థియరీ పరీక్షల నుంచి ప్రయోగ పరీక్షలను విడదీయలేని పరిస్థితులు నెలకొన్నందున వీటినీ థియరీ మాదిరిగానే జంబ్లింగ్‌లోనే నిర్వహించాలన్న వాదన తెరపైకొచ్చింది. ఇంటర్మీడియట్‌ విద్యపై అధ్యయనం చేసిన పలు కమిటీలు సైతం ఇదే విషయాన్ని స్పష్టంచేశాయి. దీంతో నాలుగేళ్ల కిందట జంబ్లింగ్‌ విధానంలోనే ప్రయోగ పరీక్షలూ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని ఇంటర్‌ బోర్డు సమావేశంలో తీర్మానించినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.

 
1 Comment

Posted by on October 20, 2013 in Uncategorized

 

One response to “ఈసారీ జంబ్లింగ్‌ లేనట్టేనా..?

  1. SmiLy Bangaaru.....

    October 20, 2013 at 5:53 PM

    Sir mana mdl schl valaki IR raadhu anta ga ivala town lo vella wrk unte
    akada two govt schl teachrs discuss cheskuntunaru so ma annani adiga may b
    raadhu miki anaru yendhuku ani adiga miku applicable kadhu antunaru ani
    cheptunaru yela sir?

     
 
%d bloggers like this: