RSS

‘ఆదర్శ’ నియామకాలను పట్టించుకోండి

21 Oct

ఈనాడు, హైదరాబాద్‌: ఆదర్శ పాఠశాలల అధ్యాపకుల నియామకాలపై స్పష్టత ఇవ్వాలని అభ్యర్థులు విద్యా శాఖ అధికారులను వేడుకుంటున్నారు. ఈ విషయంలో మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ పాఠశాలల్లో పీజీటీ (పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌), ట్రైనింగ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ) పోస్టుల భర్తీ తొలినుంచీ ప్రహసనంగా కొనసాగుతోంది. ఇప్పటిదాకా పీజీటీ పోస్టుల్లో కొన్నింటిని మాత్రమే భర్తీచేశారు. ఈ నేపథ్యంలో తెలుగు మాధ్యమ అభ్యర్థులను నియామకాల్లో పరిగణనలోనికి తీసుకోకపోవడాన్ని కొందరు సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఇటీల తెలుగు, ఆంగ్ల మాధ్యమ అభ్యర్థులు రాతపరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్‌ లిస్టును తయారుచేయాలని వెల్లడించింది. ఈ దిశగా చర్యలు తీసుకుంటే తమ నియామకాలకు మార్గం సుగమమవుతుందని ఆశిస్తుండగా..విద్యా శాఖలో ఎటువంటి కదలిక కనిపించడంలేదని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. 4600 పీజీటీ పోస్టులకుగాను 2400 మాత్రమే భర్తీచేశారు. మిగిలిన నియామకాలను చేపట్టాల్సి ఉంది

 
Comments Off on ‘ఆదర్శ’ నియామకాలను పట్టించుకోండి

Posted by on October 21, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: