RSS

నవంబర్‌ 9, 10న ఆర్‌సెట్‌ ప్రవేశ పరిక్ష

21 Oct

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిశోధన ప్రవేశాల కోసం నిర్వహించే ఆర్‌సెట్‌ ప్రవేశ పరీక్ష నవంబరు 9, 10 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏయూ అడ్మిషన్ల డైరెక్టర్‌ ఆచార్య అనిల్‌కుమార్‌ అక్టోబ‌రు 20న‌ ప్రకటన విడుదల చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం నేపధ్యంలో కొంత కాలంగా ఈ పరీక్ష వాయిదా పడింది. పీహెచ్‌డీ, ఎంఫిల్‌ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుందని ఆచార్య అనిల్‌కుమార్‌ తెలిపారు. ఎల్‌బీ కళాశాల పీజీ బ్లాక్‌, ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల న్యూ లెక్చర్‌ కాంప్లెక్స్‌, ఏయూ మహిళా ఇంజినీరింగ్‌ కళాశాల, ఏయూ సైన్స్‌ కళాశాలల్లో పరీక్ష నిర్వహిస్తామన్నారు. మెరిట్‌ ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు హల్‌టికెట్లను ఏయూ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని, ఇతర వివరాలు కూడా పొందవచ్చని తెలిపారు.

 
Comments Off on నవంబర్‌ 9, 10న ఆర్‌సెట్‌ ప్రవేశ పరిక్ష

Posted by on October 21, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: