RSS

Daily Archives: October 22, 2013

మలాలాకు ఎడిన్‌బరో వర్సిటీ గౌరవ డిగ్రీ &అమెరికాలో పాఠ్యాంశంగా మలాలా సాహస గాథ


లండన్: బాలికలకు విద్యావకాశాల కోసం తాలిబన్లనే ఎదిరించిన సాహస బాలిక మలాలాకు బ్రిటన్‌కు చెందిన ప్రసిద్ధ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బరో గౌరవ డిగ్రీని ప్రదానం చేసింది. ఇటీవల విశ్వవిద్యాలయంలో ప్రత్యేకంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని మలాలా అందుకున్నారు. బ్రిటన్ ప్రధాన మంత్రి గోర్డాన్ బ్రౌన్ అధ్యక్షతన జరిగిన గ్లోబల్ సిటిజన్‌షిప్ కమిషన్ ప్రారంభ సమావేశంలో మలాలా ప్రసంగానికి గాను ఈ డిగ్రీని ప్రకటించారు.

*జార్జివాషింగ్టన్విశ్వవిద్యాలయంప్రకటన

వాషింగ్టన్: బాలికల విద్య ప్రచారోద్యమంలో తాలిబన్ల తుపాకి గుళ్లకు సైతం ఎదురొడ్డి నిలిచిన పాకిస్థాన్‌కు చెందిన సాహస బాలిక మలాలా… అమెరికా విద్యార్థులకూ ప్రేరణగా నిలవనున్నారు. ఇటీవల మలాలా ఆవిష్కరించిన పుస్తకం ‘నేను మలాలా ఆధారంగా ఉన్నత పాఠశాల, కళాశాల విద్యార్థులకు పాఠ్యాంశాలను రూపొందిస్తున్నట్లు జార్జి వాషింగ్టన్ విశ్వవిద్యాలయం అక్టోబరు 21 ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచి మల్టీమీడియా ఉపకరణలతో రూపొందించిన మలాలా పాఠ్యాంశాన్ని విద్యార్థులకు ఉచితంగా బోధించనున్నట్లు తెలిపింది. తమ అధ్యాపక బృందం ఆ పనిలో నిమగ్నమై ఉందని విశ్వవిద్యాలయానికి చెందిన ‘గ్లోబల్ విమెన్స్ ఇనిస్టిట్యూట్’ డైరెక్టర్ మేరీ ఎల్స్‌బర్గ్ వెల్లడించారు.

Advertisements
 
Comments Off on మలాలాకు ఎడిన్‌బరో వర్సిటీ గౌరవ డిగ్రీ &అమెరికాలో పాఠ్యాంశంగా మలాలా సాహస గాథ

Posted by on October 22, 2013 in Uncategorized

 

152 కళాశాలల నిర్మాణాల కోసం నిధులు


ఈనాడు-హైదరాబాద్:
రాష్ట్రంలోని 152 ప్రభుత్వ జూనియర్ కళాశాలల నిర్మాణాల కోసం నాబార్డు 8398.00 లక్షల రూపాయల మేర ఆర్థిక సాయం అందనుంది. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 1482.00 లక్షల రూపాయలను మంజూరు చేయనుంది. ఈ మేరకు మాధ్యమిక విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌తివారీ అక్టోబరు 21న ఉత్తర్వులు జారీచేశారు.

 
Comments Off on 152 కళాశాలల నిర్మాణాల కోసం నిధులు

Posted by on October 22, 2013 in Uncategorized

 

UGC – RESULT


Result_june2013

 
Comments Off on UGC – RESULT

Posted by on October 22, 2013 in Uncategorized

 

యూజీసీ నెట్ ఫలితాలు విడుదల


హైదరాబాద్, న్యూస్‌టుడే: నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) జూన్-2013 ఫలితాలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అధికారులు అక్టోబరు 21న విడుదల చేశారు. ఈ పరీక్షకు 7,38,955 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 5,74,448 మంది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. 27,402 మంది లెక్చరర్‌షిప్‌కు అర్హత సాధించారని తెలిపారు. వీరిలో 3,684 మంది జూనియర్ రీసర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్)కు ఎంపికయ్యారన్నారు. 78 విభాగాల్లో నెట్ నిర్వహించినట్లు చెప్పారు. పరీక్ష ఫలితాలను యూజీసీ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపారు.

 
Comments Off on యూజీసీ నెట్ ఫలితాలు విడుదల

Posted by on October 22, 2013 in Uncategorized

 

పాఠశాల విద్యార్థుల ప్రవేశాలకు ఇంటర్వ్యూలొద్దు


 

*హెచ్చరించినహైకోర్టు

 

ముంబయి, న్యూస్‌టుడే: ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులకు పాఠశాలలో ప్రవేశం కల్పించేందుకు ఎలాంటి ఇంటర్వ్యూలు నిర్వహించకూడదని బాంబే హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఇంటర్వ్యూల నిర్వహణ చట్టవిరుద్ధమని, అది ‘విద్యాహక్కు’ చట్టానికి వ్యతిరేకంగా ఉందని తేల్చి చెప్పింది. న్యాయమూర్తులు అభయ్ ఓకే, రేవతి ధొరేతో కూడిన ధర్మాసనం అక్టోబరు 21న (సోమవారం) ఈ తీర్పు ఇచ్చింది. ఇంటర్వ్యూల ద్వారా ప్రవేశం కల్పించే ప్రక్రియను రద్దు చేసే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పుణేలోని ఓ పాఠశాల హైకోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్‌ను కొట్టేసింది. అంతేగాక విద్యార్థి తల్లిదండ్రులనూ ఇంటర్వ్యూ చేయరాదని తీర్పులో స్పష్టంగా పేర్కొంది. పాఠశాల నియమావళి ప్రకారం.. 2012-13 విద్యా సంవత్సరం కోసం విద్యార్థికి ప్రవేశం కల్పిస్తూ రెండుసార్లు ఇంటర్వ్యూలు తీసుకుంది. అంగన్‌వాడీ నుంచి మొదటి తరగతి వరకు ప్రవేశం కోసం ఇంటర్వ్యూలు తీసుకోరాదని నిబంధనలో ఉందని, ఆ తర్వాతి తరగతులకు నియమావళి వర్తించదని పాఠశాల తరఫు న్యాయవాది వాదించారు. అయితే న్యాయస్థానం ఆ వాదనలను తోసిపుచ్చింది. విద్యాహక్కు చట్టం ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని ఆదేశించే అధికారం తమకు ఉందని న్యాయస్థానం వెల్లడించింది.

 
Comments Off on పాఠశాల విద్యార్థుల ప్రవేశాలకు ఇంటర్వ్యూలొద్దు

Posted by on October 22, 2013 in Uncategorized

 

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సూచన


షిల్లాంగ్: దేశంలో ఉన్నత విద్యను సాధారణ ఫ్యాషన్‌లా కొనసాగించరాదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ఉన్నత విద్యావ్యవస్థలో కొత్త మార్పులను చేర్చడంపై పాలనాధికారులు, విద్యావేత్తలు దృష్టి సారించాలన్నారు. మన దేశంలోని విశ్వవిద్యాలయాల్లో అమలవుతున్న విద్యా పాఠ్యప్రణాళిక ప్రపంచ స్థాయి వర్సిటీలు గుర్తించిన ప్రమాణాలకు తగ్గట్టుగా లేవని ప్రణబ్ అన్నారు. ప్రమాణాలు అందుకోవడానికి మనం గట్టిగా కృషి చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో మనం మరింత శ్రద్ధ వహించాలన్నారు. ఇక్కడ నార్త్ ఈస్ట్రన్ హిల్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలో 200 ఉన్నతస్థాయి యూనివర్సిటీల్లో దేశం నుంచి ఒక్క యూనివర్సిటీ కూడా స్థానం సంపాదించలేకపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాల్లోని వివిధ విభాగాల మధ్య చక్కని సహకారంతో ఉన్నతస్థాయిని చేరుకోవచ్చన్నారు. తద్వారా ప్రపంచంలో ఉత్తమ విశ్వవిద్యాలయాల సరసన చేరవచ్చన్నారు. విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడి కార్యక్రమాల కోసం అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో భారత విశ్వవిద్యాలయాలు విస్తృతమైన సంబంధాలు కలిగి ఉండాలని రాష్ట్రపతి ఉద్బోధించారు.

 
Comments Off on రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సూచన

Posted by on October 22, 2013 in Uncategorized

 
 
%d bloggers like this: