RSS

నవంబరు 24న ఏపీ సెట్‌

23 Oct

హైదరాబాద్‌: నవంబరు 24న ఏపీ సెట్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు ఉస్మానియా యూనివర్శిటీ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 60 వేల మంది ఈ పరీక్షకు హాజరుకానున్నట్లు అంచనా. సీమాంధ్రలో ఉద్యమాల కారణంగా నెలరోజుల కిందట వాయిదా పడిన ఈ పరీక్షను నవంబరు 24న నిర్వహించాలని ఓయూ నిర్ణయించింది

నవంబర్ 24న ఏపీసెట్

హైదరాబాద్, న్యూస్‌టుడే: రాష్ట్ర అర్హత పరీక్ష (ఏపీ సెట్) తేదీని అధికారులు ఖరారు చేశారు. నవంబర్ 24న ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీసెట్ సభ్య కార్యదర్శి ప్రొ.బి.రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. సీమాంధ్రలో ఉద్యమం కారణంగా సెప్టెంబర్ 22న నిర్వహించాల్సిన పరీక్షను వాయిదా వేశారు. ఓయూలో అక్టోబరు 23న రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశం జరిగింది. ఇందులో ఏపీసెట్ అర్హత పరీక్ష తేదీని ఖరారు చేశారు. ఈ పరీక్షకు 1,26,790 మంది దరఖాస్తు చేసుకున్నారని రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 12 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
 
Comments Off on నవంబరు 24న ఏపీ సెట్‌

Posted by on October 23, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: