RSS

ఇక విద్యా శిక్షకులు!

29 Oct

* విద్యా వలంటీర్లకు కొత్తపేరు
అనంత‌పురం, న్యూస్‌టుడే: విద్యా వలంటీర్ల స్థానంలో విద్యా శిక్షకులు (అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లు) రాబోతున్నారు. ఈ మేరకు రాజీవ్‌ విద్యా మిషన్‌ జిల్లా అధికారులకు ఆదేశాలు పంపింది. విద్యా హక్కు చట్టం అమల్లో భాగంగా ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి విద్యా వలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో పాఠశాలల్లో విద్యా బోధనపై తలెత్తిన ఇబ్బందులపై ప్రభుత్వానికి నివేదికలు వెళ్లాయి. ఆ నేపథ్యంలో అవసరమైన చోట విద్యాశిక్షకులను నియమించుకోవాలని ఆర్‌వీఎం మార్గదర్శకాలను జారీచేసింది.
   
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో వీరిని నియమించనున్నారు. ఏకోపాధ్యాయ, ఉపాధ్యాయులు తక్కువగా ఉన్న పాఠశాలల్లో వీరి సేవలను వినియోగించుకుంటారు. జిల్లాలోని 28 మండలాల్లో 350 మంది బోధకులు అవసరమని అధికారులు గుర్తించారు. బీఈడీ, డీఈడీ చేసిన వారు అర్హులు. నియామకాలు చేపట్టేందుకు దస్త్రాన్ని జిల్లా కలెక్టర్‌ అనుమతికి పంపినట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. సవ్యంగా నియామకాలు జరిగితే వీరు ఈ ఏడాది ఆరు నెలలు విద్యా బోధకులుగా పనిచేస్తారు. నాటి విద్యావలంటీర్ల వ్యవస్థకే విద్యాబోధకులుగా పేరు మార్చారు. గతంలో నెలకు రూ.3 వేలు ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.5 వేలకు పెంచారు.

Advertisements
 
Comments Off on ఇక విద్యా శిక్షకులు!

Posted by on October 29, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: