RSS

ట్రిపుల్‌ఐటీలకు 90 అధ్యాపక పోస్టులు

29 Oct

నూజివీడు, న్యూస్‌టుడే : ప్రతిష్ఠాత్మక నూజివీడు, బాసర, ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలకు ఇంజినీరింగ్‌ విభాగంలో మొత్తం 144 పోస్టులు మంజూరు కాగా ఇటీవల రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం శాశ్వత పోస్టులకై నిర్వహించిన ఇంటర్వ్యూలలో మొదటి విడతగా 90 పోస్టులు భర్తీ అయినట్లు నూజివీడు ట్రిపుల్‌ఐటీ సంచాలకుడు ఆచార్య ఇబ్రహీంఖాన్‌ తెలిపారు. దీనిలో భాగంగా నూజివీడుకు 29 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ఒక అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు అభ్యర్థులు ఎంపికైనట్లు తెలిపారు. ప్రొఫెసర్‌ పోస్టులకు ఎవరూ ఎంపిక కాలేదన్నారు. ఎంపికైన వారిలో గతంలో కాంట్రాక్టు పద్ధతిపై నియమితులైన అధ్యాపకుల్లో సుమారు 80 శాతం మంది ఎంపిక కాగా 20 శాతం ఇతరులు ఉన్నారన్నారు. భౌతిక, రసాయన శాస్త్ర, గణిత, ఇతర పాఠ్యాంశాలకు సంబంధించి పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉందన్నారు. నూజివీడులో 71 మంది ఇంజినీరింగ్‌, 70 మంది ఇతర పాఠ్యాంశాల అధ్యాపకుల అవసరం ఉందన్నారు.

Advertisements
 
Comments Off on ట్రిపుల్‌ఐటీలకు 90 అధ్యాపక పోస్టులు

Posted by on October 29, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: