RSS

Daily Archives: November 1, 2013

Image

Proceedings of the RJD SE


1453416_348801575263310_1040591069_n

Advertisements
 
Comments Off on Proceedings of the RJD SE

Posted by on November 1, 2013 in Uncategorized

 

శాసనసభ సచివాలయానికి పోస్టుల మంజూరు


ఈనాడు, హైదరాబాద్: శాసనసభ సచివాలయానికి 49 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేష్ నవంబరు 1న ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో డిప్యూటి డైరెక్టర్ (లైబ్రరీ)-1, సహాయ సెక్షన్ అధికారి(12), ఆఫీసు సబార్డినేట్(24), కమిటీ ఛైర్మన్ల పీఏ(12) పోస్టులు ఉన్నాయి.

 
Comments Off on శాసనసభ సచివాలయానికి పోస్టుల మంజూరు

Posted by on November 1, 2013 in Uncategorized

 

టీచర్ల సమస్యలపై జాక్టో సమావేశం


ఈనాడు-హైదరాబాద్: ఉపాధ్యాయ సంఘాల సంయుక్త మండలి (జాక్టో) స్టీరింగ్ కమిటీ సమావేశం నవంబరు 1న సాయంత్రం నగరంలోని పీఆర్టీయూ కార్యాలయంలో జరిగింది. రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు

 
Comments Off on టీచర్ల సమస్యలపై జాక్టో సమావేశం

Posted by on November 1, 2013 in Uncategorized

 

నెట్ అనర్హులపై మారిన యూజీసీ వైఖరి


న్యూఢిల్లీ: నెట్ పరీక్షలో సమాధాన పత్రాలను చేత్తో దిద్దారనే కారణంగా 21 వేలమందికిపైగా విద్యార్థులపై వేసిన అనర్హత వేటును యూజీసీ నవంబరు 1న వెనక్కి తీసుకుంది. గత జూన్‌లో జరిగిన పరీక్షలో విద్యార్థులు జవాబు పత్రాల్లో కొన్ని సమాధానాలను చెరిపివేయడమో లేదా వైట్నర్ ద్వారానో దిద్దారంటూ యూజీసీ 21వేలమంది విద్యార్థులను అనర్హులుగా ప్రకటించింది. అయితే దీనిపై విద్యార్థుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవటంతో నిర్ణయాన్ని మార్చుకోకతప్పలేదు.

 
Comments Off on నెట్ అనర్హులపై మారిన యూజీసీ వైఖరి

Posted by on November 1, 2013 in Uncategorized

 

టెట్, డీఎస్సీపై అనిశ్చితి తొలగించండి


*అభ్యర్థులవినతి

ఈనాడు, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహణ, డీఎస్సీ-2013 ప్రకటన జారీపై అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ రెండింటినీ నిర్వహించే విషయమై విద్యాశాఖ సందిగ్ధంలో పడింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో సాధించిన మార్కులకు డీఎస్సీలో 20 శాతం ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉపాధ్యాయ నియామకాలకు ప్రభుత్వపరంగా విధాన నిర్ణయం అవసరమని భావించినా టెట్ నిర్వహణకు అభ్యంతరం ఏమిటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ పరీక్ష రాసేందుకు 4.5 లక్షల మంది దరఖాస్తు చేశారు. వీరి నుంచి విద్యా శాఖకు రూ.పది కోట్ల ఆదాయం వచ్చింది. పరీక్ష నిర్వహణకు సంబంధించి ఇప్పటికే కొంత ఖర్చు చేశారు. సెప్టెంబరు 1న నిర్వహించాల్సిన టెట్‌ను సీమాంధ్ర ఉద్యమం కారణంగా వాయిదావేసిన విషయం తెలిసింది. ప్రస్తుతం ఉద్యమం తగ్గి అన్ని రకాల పరీక్షలు జరుగుతున్నా టెట్ విషయంలో మాత్రం ఎలాంటి సమాచారం రావడంలేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి చొరవచూపి సందిగ్ధతను తొలగించాలని అభ్యర్థులు కోరుతున్నారు.

 
Comments Off on టెట్, డీఎస్సీపై అనిశ్చితి తొలగించండి

Posted by on November 1, 2013 in Uncategorized

 

ఆర్జీయూకేటీ నియామకాలపై విచారణ


ఈనాడు-హైదరాబాద్: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఇటీవల చేపట్టిన బోధన నియామకాలు వివాదాస్పదమయ్యాయి. లెక్చరర్, అసిస్టెంట్ పోస్టులను వేర్వేరుగా భర్తీ చేయాల్సి ఉండగా వాటిని కలిపి భర్తీచేస్తున్నారు. అలాగే రిజర్వేషన్ విధానం అమలుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ నియామక ప్రక్రియలో తదుపరి చర్యలను నిలిపేయాలని నవంబరు 1న ఆదేశించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించి 15 రోజుల్లోగా నివేదికను అందించాలని ఉన్నత విద్యా శాఖకు ఆదేశాలు వెళ్లాయి. ఈ మేరకు ఉన్నత విద్యా శాఖ నుంచి ఉన్నత విద్యా మండలికి సమాచారం వెళ్లింది. 438 బోధన నియామకాలకు ఆర్జీయూకేటీ అధికారులు చేపట్టిన సంగతి తెలిసిందే.
కొత్త కార్యదర్శి బాధ్యతల స్వీకరణ: ఉన్నత విద్యా మండలి నూతన కార్యదర్శిగా సతీష్‌రెడ్డి శుక్రవారం అధికార బాధ్యతలను స్వీకరించారు. ఈయన డాక్టర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఎకనామిక్ ప్రొఫెసర్‌గా వ్యవహరించారు.

 
1 Comment

Posted by on November 1, 2013 in Uncategorized

 

గ్రూప్-1పై ఆదేశాలు సవరించండి


ఈనాడు, హైదరాబాద్: గ్రూపు-1 ప్రధాన పరీక్షను మళ్లీ నిర్వహించాలని సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వులను సవరించాలని కోరుతూ నవంబరు 1న అదే కోర్టులో ఏపీపీఎస్సీ పిటిషన్ (మాడిఫికేషన్)ను దాఖలు చేసింది. వివాదాస్పద ఆరు ప్రశ్నలను తొలగించిన అనంతరం ప్రాథమిక పరీక్ష జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి, అర్హతపొందిన అందరికీ మళ్లీ ప్రధాన పరీక్షను నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల ప్రకారం ఆరు ప్రశ్నలను తొలగించి మూల్యాంకనం చేసినట్లయితే, కొత్తగా 209 మంది మాత్రమే ప్రధాన పరీక్షకు అర్హత సాధిస్తారని, వారికి మాత్రమే మళ్లీ ప్రధాన పరీక్ష నిర్హహిస్తే సరిపోతుందని ఏపీపీఎస్సీ ఆ పిటిషన్‌లో పేర్కొంది. గత అక్టోబరు 7వ తేదీన జారీచేసిన ఆదేశాలను ఈ మేరకు సవరించాలని కోర్టును కోరింది. రాష్ట్ర విభజన అంశాన్ని పరిగణనలోకి తీసుకొని గ్రూపు-1 నియామకాలను వేగవంతం చేశామని తెలిపింది. తమ అభ్యర్థనను పరిశీలించాలని అభ్యర్థించింది. దీనిపై వచ్చేవారం విచారణ జరగనుంది.

 
Comments Off on గ్రూప్-1పై ఆదేశాలు సవరించండి

Posted by on November 1, 2013 in Uncategorized

 
 
%d bloggers like this: