RSS

టెట్, డీఎస్సీపై అనిశ్చితి తొలగించండి

01 Nov

*అభ్యర్థులవినతి

ఈనాడు, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహణ, డీఎస్సీ-2013 ప్రకటన జారీపై అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ రెండింటినీ నిర్వహించే విషయమై విద్యాశాఖ సందిగ్ధంలో పడింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో సాధించిన మార్కులకు డీఎస్సీలో 20 శాతం ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉపాధ్యాయ నియామకాలకు ప్రభుత్వపరంగా విధాన నిర్ణయం అవసరమని భావించినా టెట్ నిర్వహణకు అభ్యంతరం ఏమిటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ పరీక్ష రాసేందుకు 4.5 లక్షల మంది దరఖాస్తు చేశారు. వీరి నుంచి విద్యా శాఖకు రూ.పది కోట్ల ఆదాయం వచ్చింది. పరీక్ష నిర్వహణకు సంబంధించి ఇప్పటికే కొంత ఖర్చు చేశారు. సెప్టెంబరు 1న నిర్వహించాల్సిన టెట్‌ను సీమాంధ్ర ఉద్యమం కారణంగా వాయిదావేసిన విషయం తెలిసింది. ప్రస్తుతం ఉద్యమం తగ్గి అన్ని రకాల పరీక్షలు జరుగుతున్నా టెట్ విషయంలో మాత్రం ఎలాంటి సమాచారం రావడంలేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి చొరవచూపి సందిగ్ధతను తొలగించాలని అభ్యర్థులు కోరుతున్నారు.

Advertisements
 
Comments Off on టెట్, డీఎస్సీపై అనిశ్చితి తొలగించండి

Posted by on November 1, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: