RSS

సివిల్‌ సర్వీస్‌ పరీక్షలకు ఉచిత శిక్షణ

01 Nov

నెల్లూరు, న్యూస్‌టుడే : సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ రిక్రూట్‌మెంట్‌ ఎగ్జామినేషన్‌ 2013కు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమాధికారి సంజీవరావు అక్టోబ‌రు 31న‌ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. న‌వంబ‌రు 5లోగా దరఖాస్తు చేసుకున్నవారికి 10న నెల్లూరు బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఎంట్రన్స్‌ పరీక్ష నిర్వహించి శిక్షణకు అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణత సర్టిఫికెట్లు, దరఖాస్తుదారుని ఫొటోలను ఆన్‌లైన్‌లో http://apbcwelfare.cgg.gov.in స్కాన్‌చేసి పొందుపరచాలన్నారు. పూర్తి వివరాలకు 0861-2338300ను సంప్రదించాలని కోరారు.

Advertisements
 
Comments Off on సివిల్‌ సర్వీస్‌ పరీక్షలకు ఉచిత శిక్షణ

Posted by on November 1, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: