RSS

ఆర్జీయూకేటీ నియామకాలపై విచారణ

01 Nov

ఈనాడు-హైదరాబాద్: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఇటీవల చేపట్టిన బోధన నియామకాలు వివాదాస్పదమయ్యాయి. లెక్చరర్, అసిస్టెంట్ పోస్టులను వేర్వేరుగా భర్తీ చేయాల్సి ఉండగా వాటిని కలిపి భర్తీచేస్తున్నారు. అలాగే రిజర్వేషన్ విధానం అమలుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ నియామక ప్రక్రియలో తదుపరి చర్యలను నిలిపేయాలని నవంబరు 1న ఆదేశించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించి 15 రోజుల్లోగా నివేదికను అందించాలని ఉన్నత విద్యా శాఖకు ఆదేశాలు వెళ్లాయి. ఈ మేరకు ఉన్నత విద్యా శాఖ నుంచి ఉన్నత విద్యా మండలికి సమాచారం వెళ్లింది. 438 బోధన నియామకాలకు ఆర్జీయూకేటీ అధికారులు చేపట్టిన సంగతి తెలిసిందే.
కొత్త కార్యదర్శి బాధ్యతల స్వీకరణ: ఉన్నత విద్యా మండలి నూతన కార్యదర్శిగా సతీష్‌రెడ్డి శుక్రవారం అధికార బాధ్యతలను స్వీకరించారు. ఈయన డాక్టర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఎకనామిక్ ప్రొఫెసర్‌గా వ్యవహరించారు.

 
1 Comment

Posted by on November 1, 2013 in Uncategorized

 

One response to “ఆర్జీయూకేటీ నియామకాలపై విచారణ

  1. rajasekhar

    November 1, 2013 at 11:43 PM

    very very good news,let all the IIIT’ans party.

     
 
%d bloggers like this: