RSS

గ్రూప్-1పై ఆదేశాలు సవరించండి

01 Nov

ఈనాడు, హైదరాబాద్: గ్రూపు-1 ప్రధాన పరీక్షను మళ్లీ నిర్వహించాలని సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వులను సవరించాలని కోరుతూ నవంబరు 1న అదే కోర్టులో ఏపీపీఎస్సీ పిటిషన్ (మాడిఫికేషన్)ను దాఖలు చేసింది. వివాదాస్పద ఆరు ప్రశ్నలను తొలగించిన అనంతరం ప్రాథమిక పరీక్ష జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి, అర్హతపొందిన అందరికీ మళ్లీ ప్రధాన పరీక్షను నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల ప్రకారం ఆరు ప్రశ్నలను తొలగించి మూల్యాంకనం చేసినట్లయితే, కొత్తగా 209 మంది మాత్రమే ప్రధాన పరీక్షకు అర్హత సాధిస్తారని, వారికి మాత్రమే మళ్లీ ప్రధాన పరీక్ష నిర్హహిస్తే సరిపోతుందని ఏపీపీఎస్సీ ఆ పిటిషన్‌లో పేర్కొంది. గత అక్టోబరు 7వ తేదీన జారీచేసిన ఆదేశాలను ఈ మేరకు సవరించాలని కోర్టును కోరింది. రాష్ట్ర విభజన అంశాన్ని పరిగణనలోకి తీసుకొని గ్రూపు-1 నియామకాలను వేగవంతం చేశామని తెలిపింది. తమ అభ్యర్థనను పరిశీలించాలని అభ్యర్థించింది. దీనిపై వచ్చేవారం విచారణ జరగనుంది.

 
Comments Off on గ్రూప్-1పై ఆదేశాలు సవరించండి

Posted by on November 1, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: