*ప్రపంచవ్యవసాయసదస్సులోసీఎంపిలుపు
ఈనాడు, హైదరాబాద్: విద్యావంతులైన యువత వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. గ్రామాలకు తరలివెళ్లేందుకు యువతను సన్నద్ధం చేసేందుకు కృషి జరగాలని అన్నారు. నవంబరు 5న హైదరాబాద్‌లో ప్రపంచ వ్యవసాయ సదస్సు ప్రారంభమైంది. దీనికి సీఎం ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. వ్యవసాయరంగం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందని, వాటిని పరిష్కారాలు కనుగొని, రైతులకు లాభసాటిగా మార్చాలని, ఇందుకోసం విస్తృత పరిశోధనలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. వ్యవసాయాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని సీఎం సూచించారు.
Advertisements