RSS

మ‌హిళా వ‌ర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

05 Nov

తిరుప‌తి (మహిళా విశ్వవిద్యాలయం) : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పలు విభాగాల్లో ఎం.ఫిల్‌, పీహెచ్‌డీ చేయడానికి ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ విషయాన్ని వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య విజయలక్ష్మి తెలిపారు. 2013-14 విద్యాసంవత్సరానికి గాను ఎం.ఫిల్‌, పీహెచ్‌డీల్లో ప్రవేశానికి నిర్వహించే పరిశోధన ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదల చేశామన్నారు. అప్లైడ్‌ మ్యాథమేటిక్స్‌, అప్లైడ్‌ మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌, ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌, సెరికల్చర్‌, బోటనీ, జువాలజీ, కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం, ఎడ్యుకేషన్‌, ఇంగ్లిష్‌, లా, మ్యూజిక్‌, సోషల్‌ వర్క్‌, తెలుగు స్టడీస్‌, ఉమెన్స్‌ స్టడీస్‌ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ, ఎం.ఫిల్‌ చేసుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు. 55 శాతం మార్కులతో సంబంధిత విభాగాల్లో పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రవేశ పరీక్ష రాయడానికి అర్హులని పేర్కొన్నారు. పార్ట్‌టైం కోర్సులకు అకడమిక్‌ / రీసెర్చ్‌ / ప్రొఫెషనల్‌ / టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూషన్‌లో స్టాఫ్‌ మెంబరుగా ఉండాలని, కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలని సూచించారు. 2014, జనవరి 6వ తేదీ ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న మహిళా అభ్యర్థులు న‌వంబ‌రు 30లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. యూజీసీ / సీఎస్‌ఐఆర్‌ / ఏదైనా రాష్ట్ర లేదా జాతీయ స్థాయి పరీక్షలో ఉత్తీర్ణులైన, ఎఫ్‌డీపీ (యూజీసీ) అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపారు.

 
Comments Off on మ‌హిళా వ‌ర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Posted by on November 5, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: