RSS

Daily Archives: November 8, 2013

Faculty Positions in UOH


UOH-FACU

Advertisements
 
Comments Off on Faculty Positions in UOH

Posted by on November 8, 2013 in Uncategorized

 

త్వరలో టీజీటీ పోస్టుల భర్తీ!


ఈనాడు, హైదరాబాద్: ఆదర్శ పాఠశాలల టీజీటీ పోస్టుల భర్తీపై కొద్ది నెలలుగా నెలకొన్న ప్రతిష్టంభన తొలగింది. త్వరలోనే ఈ పోస్టుల భర్తీ చేపట్టాలని ప్రభుత్వం నవంబరు 8న నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం జులై నెలాఖరులోనే ఈ నియామకాలు జరగాల్సి ఉంది. మరోవైపు పీజీటీ పోస్టుల భర్తీకి సంబంధించి సుప్రీంకోర్టును మళ్లీ ఆశ్రయించాలని విద్యాశాఖ నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవల తెలుగు, ఆంగ్ల మాధ్యమ అభ్యర్థులతో పీజీటీ పోస్టుల భర్తీకి సంబంధించి ఉమ్మడి జాబితా తయారుచేయాలని సుప్రీంకోర్టు విద్యాశాఖను ఆదేశించిన విషయం తెలిసిందే.

 
Comments Off on త్వరలో టీజీటీ పోస్టుల భర్తీ!

Posted by on November 8, 2013 in Uncategorized

 

త్వరలో టీజీటీ పోస్టుల భర్తీ!


ఈనాడు, హైదరాబాద్: ఆదర్శ పాఠశాలల టీజీటీ పోస్టుల భర్తీపై కొద్ది నెలలుగా నెలకొన్న ప్రతిష్టంభన తొలగింది. త్వరలోనే ఈ పోస్టుల భర్తీ చేపట్టాలని ప్రభుత్వం నవంబరు 8న నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం జులై నెలాఖరులోనే ఈ నియామకాలు జరగాల్సి ఉంది. మరోవైపు పీజీటీ పోస్టుల భర్తీకి సంబంధించి సుప్రీంకోర్టును మళ్లీ ఆశ్రయించాలని విద్యాశాఖ నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవల తెలుగు, ఆంగ్ల మాధ్యమ అభ్యర్థులతో పీజీటీ పోస్టుల భర్తీకి సంబంధించి ఉమ్మడి జాబితా తయారుచేయాలని సుప్రీంకోర్టు విద్యాశాఖను ఆదేశించిన విషయం తెలిసిందే.

 
2 Comments

Posted by on November 8, 2013 in Uncategorized

 

Model degree colleges to come up in 56 districts


New Delhi, November 7:In the first meeting of the project approval board (PAB) for the Rashtriya Uchchatar Shiksha Abhiyan — the ambitious higher education programme to reinvigorate state universities — 56 new model degree colleges were approved in as many districts with a total outlay of Rs. 672 crore. Uttar Pradesh has got 29 model colleges, followed by eight each in Karnataka and Odisha, Andhra Pradesh (7) and Kerala (4).

The meeting also sanctioned second installment of funds for 31 existing model degree colleges spread across Assam, Karnataka, Maharashtra and Punjab.

Ministry officials said, “We have got enthusiastic response from states. Already, 15 states and four union territories have responded to the ministry.” The meeting considered the proposals of states and UTs and approved 12 states and four UTs eligible for support under RUSA. Gujarat’s proposal came late so the PAB agreed to give the state preparatory fund. J&K submitted the proposal but since it did not give any undertaking, PAB did not consider their request. Tamil Nadu also failed to give undertaking.

Proposals of Andaman & Nicobar, Arunachal Pradesh, Assam, Bihar, Chandigarh, Dadra & Nagar Haveli, Daman & Diu, Himachal Pradesh, Karnataka, Kerala, Maharashtra, Manipur, Nagaland, Odisha, Punjab & UP were approved. RUSA makes it incumbent upon the states to fulfill certain conditions. One, lift the ban on recruitment of teachers; two, carry out comprehensive academic and administrative reforms. State universities are expected to move towards semester system, credit transfer and similar other reforms. The HRD ministry has also decided to set up a RUSA Resource Centre in association with the Tata Institute of Social Sciences (TISS) at an estimated cost of Rs. 45 lakh.

Source:The Times of India

 
Comments Off on Model degree colleges to come up in 56 districts

Posted by on November 8, 2013 in Uncategorized

 

డిగ్రీలో కొత్త ‘పాఠ్యాంశం’


* మానవతా విలువలు, వృత్తి నైతికత
అనంత‌పురం (ఎస్‌.కె.యూనివర్సిటీ) : డిగ్రీలో సరికొత్త పాఠ్యాంశం ప్రవేశపెట్టారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు చేయాల్సి ఉంటుంది. ఉద్యమం కారణంగా ఆలస్యమైంది. ఇప్పటికే మాస్టర్‌ ట్రైనర్‌ ద్వారా జిల్లాలోని 130 మంది అధ్యాపకులకు పాఠ్యాంశంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. డిగ్రీ ప్రథమ సంవత్సరంలోని అన్ని కోర్సుల విద్యార్థులకు ‘మానవతా విలువలు- వృత్తి నైతికత’ అనే అంశంపై పాఠ్యాంశాన్ని బోధిస్తారు.

 
Comments Off on డిగ్రీలో కొత్త ‘పాఠ్యాంశం’

Posted by on November 8, 2013 in Uncategorized

 

కాస్త దృష్టిపెడితే క్యాంపస్‌ కొలువు మీదే


విశాఖ‌ప‌ట్నం : టీసీఎస్‌లో ఒక పోస్టు మర్చిపోండి. ఎందుకంటే అది నాది. మిగతావాటికి పోటీపడండి. ఇదీ నేటి యువత విశ్వాసం. క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఎంపికనేది ప్రతి విద్యార్థికి సుందర స్వప్నం. ఇంజినీరింగ్‌ విద్యకు మరీను. పెరుగుతున్న పోటీ నేపథ్యంలో బహుముఖ ప్రజ్ఞావంతులు మాత్రమే అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. ప్రాంగణ ఎంపికలు నిర్వహించే ఏ సంస్థ అయినా ప్రస్తుత పోటీని తట్టుకుని తమ సంస్థను ప్రథమ స్థానంలో నిలపగల సమర్థులకోసమే అన్వేషిస్తుంది. అన్ని రంగాలలో సమర్థతతో పాటు సమగ్రంగా సమస్యలను ఎదుర్కోగల మెరికలను ఎంచుకోనేందుకు ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తాయి. మన నగరంలో పెద్దసంఖ్యలో ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. ప్రతిఏటా వేలసంఖ్యలో విద్యార్థులు బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాంగణ ఎంపికల్లో రాణించాలంటే వీరంతా ఎలాంటి నైపుణ్యాలను పెంచుకోవాలి? ఏ సంస్థ ఎంపిక తీరు ఎలా ఉంది? విజేతలు ఏమంటున్నారో ఒక్కసారి పరిశీలిస్తే
* సంస్థలు నిర్వహించే ప్రాంగణ ఎంపికలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించాలి. విద్యార్థులు ఆంగ్ల పరీక్షను కష్టంగా భావించడం మానుకొవాలి. వ్యాకరణంతో పాటు సరైన కృషిచేస్తే ఆ భాషలో రాణించడం అతిసులభం. ఇంజినీరింగ్‌ విద్యార్థులను ఎంపిక చేసుకొనేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌), విప్రో, గూగుల్‌ తదితర సంస్థలు నగరానికి వస్తున్నాయి. ఇటీవలే ఈ సంస్థలు పలు ప్రాంగణ ఎంపికలను నిర్వహించాయి. ఈసారి గతం కన్నా ఎంపిక విధానాన్ని పటిష్ఠం చేశాయి. పరీక్షలు క్లిష్టంగా ఉన్నా, పలువురు విద్యార్థులు తమ ప్రతిభను చాటి ఉద్యోగాలు సాధించారు. ఏ సంస్థ ఎలా ఎంపిక నిర్వహిస్తుందంటే
* విప్రోలో ఇలా…
బృంద చర్చలో విద్యార్థి భాషాపటిమ, నాయకత్వ లక్షణాలు పరిశీలిస్తారు. ఆన్‌లైన్‌ పరీక్షలో సంబంధింత సబ్జెక్టు అంశాలపై ప్రశ్నలు ఇచ్చి సమాధానాలు రాబడతారు. కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. టెక్నికల్‌ రౌండ్‌ కూడా ఉంటుంది. చివరగా హెచ్‌ఆర్‌ రౌండ్‌తో ఎంపిక ముగుస్తుంది.
* గూగుల్‌ తీరు ఇలా ఉంటుంది
ఆంగ్లభాష, ఆటిట్యూడ్‌, రీజనింగ్‌, అర్థమెటిక్‌ అంశాలపై రాత పరీక్ష నిర్వహించి ప్రాథమిక ఎంపిక చేపట్టారు. రెండో దశలో బృంద చర్చ ఉంటుంది. మూడో దశలో మౌఖిక పరీక్షతో చివరి ఎంపిక పూర్తవుతుంది.
* అయిదు దశల్లో టీసీఎస్‌ ఎంపిక
కళాశాల పరిధిలో జరిగిన పలు ప్రాంగణ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు. ఆంగ్లభాష పరిజ్ఞానంపై అంచనా వేసేందుకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడాది నుంచి ఆంగ్లభాషా నైపుణ్యం తప్పనిసరి చేశారు. క్వాంటిటేటివ్‌ అనాలసిస్‌, రీజనింగ్‌, క్రిటికల్‌ రీజనింగ్‌ తదితర అంశాలపై ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైనవారిని మౌఖిక పరీక్షకు పంపిస్తారు. మౌఖిక పరీక్షలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. విద్యార్థి దశలో చేసిన ప్రాజెక్టుపై, పాఠ్యాంశాలలో వివిధ అంశాలపై ప్రధానంగాప్రశ్నలు వేస్తారు. ఎక్కువగా సీ లాంగ్వేజ్‌పై ప్రశ్నలు వుంటాయి. మేనేజ్‌మెంట్‌ రౌండ్‌లో మానసిక స్థితిని, నిర్వహణ, సమస్యల పరిష్కార సామర్థ్యాన్ని, సామాజిక విషయ పరిజ్ఞానాన్ని పరిశీలిస్తారు. హెచ్‌ఆర్‌ రౌండ్‌లో సమర్థత స్థాయి, ఆంగ్లభాష ఉచ్ఛరణ తీరు, వస్త్రధారణ, హుందాతనం, వ్యక్తిత్వం తదితర అంశాలను పరిశీలిస్తారు.
* విజేతలు కావాలంటే…
ప్రాంగణ ఎంపికలకు హాజరయ్యే సంస్థ ఎంపిక విధివిధానాలు మొదటగా అవగాహన చేసుకొవాలి. ఆయా పోటీలలో సాధారణ పరిజ్ఞానంతో పాటు సమాధానంలో మీ ప్రత్యేకతను స్పష్టపరచాలి. ఇందుకు తమ పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా మిగిలినవారికన్నా మిన్నగా వ్యక్తం చేయగలగాలి. పరిజ్ఞానంతో పాటు భాషా పటిమ, భావవ్యక్తీకరణలో స్పష్టత, సూక్ష్మత అవసరం. విషయ వివరణలో స్పష్టతతో పాటు ధారాళంగా వివరించే సమర్థత అవసరం. సమస్యను వినడంలో ఓపిక, వివరించడంలో సహనం అవసరం. ఒప్పించగల సమర్థత వుండాలి. క్వాంటిటేటివ్‌ అనాలసిస్‌లో విజేతలుగా నిలవాలంటే అప్టిట్యూడ్‌పై పట్టుసాధించాలి. రీజనింగ్‌, లాజికల్‌ థింకింగ్‌, క్రిటికల్‌ రీజనింగ్‌కు సంబంధించిన పుస్తకాలను చదవాలి. సమయం తక్కువ ఉంటుంది కనుక షార్ట్‌కట్‌ పద్ధతులను సాధన చేయాలి. ఇందుకు పాత మోడల్‌ పేపర్లను అభ్యాసం చేయాలి. టెక్నికల్‌ రౌండ్‌ విద్యార్థుల సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షిస్తుంది. ఈ రౌండ్‌లో విజేతలుగా నిలవాలంటే సీ లాంగ్వేజ్‌, సీ++, జావా వంటి పరిభాషలపై పట్టుసాధించాలి. వీటిలో ప్రోగ్రాంలు చేయటం సాధన చేయాలి. హుందాతనం, సానుకూల దృక్పథం వంటివి అలవాట్లుగా మారితే హెచ్‌ఆర్‌ రౌండ్‌లో విజయం మీదే. స్కిల్స్‌ పెంచుకోవడానికి కళాశాలలోని ప్లేస్‌మెంట్‌ సెల్‌ను ఉపయోగించుకోవాలి. ఒత్తిడిని అధిగమించే ప్రక్రియలను సాధన చేయాలి. వస్త్రధారణ పద్ధతులను కూడా ముందునుండే అలవరుచుకోవాలి. మేనేజ్‌మెంట్‌ రౌండ్‌లో విజయం సాధించాలంటే కళాశాలలో జరిగే కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనాలి. ముఖ్యంగా బృందంలో కలవటం, బృంద చర్చల్లో పాల్గొనటం, ఇతరులకు అభిప్రాయాలను తెలియచేయటం, ఇతరుల అభిప్రాయాలను గౌరవించటం వంటివి అలవరుచుకోవాలి. వీటివల్ల ఓపిక, సహనం అలవడతాయి.
* శిక్షణ కలిసివచ్చింది : ఎస్‌.లక్ష్మీరమ్య, మెకానికల్‌ ఆఖరిసంవత్సరం
టీసీఎస్‌ ఈసారి ఎంపిక విధానాన్ని క్లిష్టతరం చేసింది. ముందుగా కళాశాలలో నిర్వహించిన క్యాంపస్‌ కనెక్టు కాంటెస్టులలో పాల్గొనటం కలిసివచ్చింది. పాజిటివ్‌ ఆప్టిట్యూడ్‌, సీ-లాంగ్వేజ్‌, మాక్‌ ఇంటర్వ్యూ వంటి వాటిపై ముందే శిక్షణ ఇవ్వడం వల్ల సబ్జెక్టులపై పూర్తిస్థాయిలో పట్టుసాధించ గలిగా. టీసీఎస్‌ సంస్థకు ఎంపికయ్యాను.
* తప్పులు సరిదిద్దుకుని : వై.వందన, ఇంజినీరింగ్‌ విద్యార్థిని
ప్రాంగణ ఎంపికలలో ఉద్యోగం పొందేందుకు ఎంతో కష్టపడ్డాను. మొదట టీసీఎస్‌ సంస్థ నిర్వహించిన ఎంపికలో పాల్గొన్నా విజయం వరించలేదు. దీంతో మనస్థాపం చెందాను. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లి విప్రో నిర్వహించిన ప్రాంగణ ఎంపికలో విజయం సాధించాను. దీనికి కారణం… టీసీఎస్‌ ఎంపికలో చేసిన తప్పులను సరిదిద్దుకుని పరీక్ష తీరు ముందుగా అవగాహన చేసుకుని, ప్రణాళికతో అభ్యాసం చేయడమే. దీంతో భయంపోయి విజయం సొంతమైంది.
* మార్కులు ఎన్ని వచ్చినా… ఉద్యోగమే ఆనందం… : ఎస్‌.కృష్ణసందీప్‌రెడ్డి, మెకానికల్‌ ఆఖరిసంవత్సరం
విద్యార్థికి మార్కులు ఎన్ని వచ్చినా.. ఉద్యోగం పొందడంలోనే ఆనందం. దీనికి కళాశాల అధ్యాపకులు ఇచ్చిన శిక్షణ చక్కగా ఉపయోగపడింది. సబ్జెక్టులలో పట్టు ఉండడంతో పాటు వెర్బల్‌ ప్రాక్టీసు చేయడం ఆంగ్ల పరీక్షకు దోహదపడింది. దీంతో విప్రో నిర్వహించిన ఇంటర్వ్యూలను అధిగమించి విజయం సాధించాను.
* పరిభాషలపై పట్టుతో ఎంపిక : ఎస్‌.పవన్‌తేజ, సివిల్‌ ఇంజినీర్‌ విద్యార్థి
కోర్‌ సబ్జక్టులైన సీ లాంగ్వేజ్‌, సీ++, జావా తదితర వంటి వాటిపై సమగ్రంగా తెలుసుకున్నాను. షార్ట్‌కట్‌ పద్దతులను సాధన చేశాను. దీంతో టెక్నికల్‌ రౌండ్‌ అధిగమించాను. గత మోడల్‌ పేపర్లును అభ్యాసించడంతో హెచ్‌ఆర్‌ రౌండ్‌లో విజయం సాధించాను. మౌఖిక పరీక్షలకు సంబంధించి కళాశాలలో ఇచ్చిన తర్ఫీదు బాగా ఉపయోగపడింది. సునాయసంగా టీసీఎస్‌కి ఎంపికయ్యాను.
* నైపుణ్యాలు మెరుగుపరుచుకున్నా : ధర్మకౌశిక్‌, మెకానికల్‌ విద్యార్థి
ముందునుంచే ప్రణాళికబద్ధంగా నైపుణ్యాలు మెరుగుపరుచుకున్నాను. నాలుగేళ్లు చదివిన చదువుని ఎంపికలో నిరూపించుకోవాలంటే మనోధైర్యం, ఆత్మవిశ్వాసం కావాలి. ఆ దిశగా అడుగులు వేసి సానుకూల దృక్పథంతో సమాధానాలు చెప్పి టీసీఎస్‌కి ఎంపికయ్యాను.
* నాయకత్వ లక్షణాలే విజేతగా నిలిపాయి : కె.సత్యచరణ్‌తేజ్‌, మెకానికల్‌ విద్యార్థి
క్రమశిక్షణ, వినయంతో కూడిన విద్య, నిబద్ధత కూడిన ప్రణాళిక, నాయకత్వ లక్షణాలు విజేతగా నిలిపాయి. కళాశాలలో ఫేస్‌ సంస్థ ద్వారా నేర్పిన పరిజ్ఞానంతో క్వాంటిటేటివ్‌, వెర్బల్‌ పరీక్షలను సులువుగా అధిగమించాను. బాడీలాంగ్వేజ్‌ను మెరుగుపరుచుకోవడంతో పాటు చిన్నప్పట్నుంచి చురుగ్గా ఉండడంతో నాయకత్వ లక్షణాల పరీక్షల్లో నెగ్గాను. దీంతో విజయం సాధించడంతో నా శ్రమకు తగ్గ ఫలితం వరించింది.

 
Comments Off on కాస్త దృష్టిపెడితే క్యాంపస్‌ కొలువు మీదే

Posted by on November 8, 2013 in Uncategorized

 

విద్యలో తలమానికం కావాలి


* రాష్ట్రపతి
న్యూఢిల్లీ: ఉన్నత విద్యారంగంలో అభివృద్ధి సంఖ్యాపరంగానేగాక నాణ్యతపరంగా కూడా ఉండాలని.. ఆ రెండింటినీ సమానంగా మేళవించాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పిలుపునిచ్చారు. ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ (నిట్‌)ల డైరక్టర్ల సమావేశాన్ని నవంబరు 7న రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రణబ్‌ముఖర్జీ మాట్లాడుతూ.. ఉన్నతవిద్యారంగానికి ప్రభుత్వం భారీఎత్తున వనరులను కేటాయిస్తోందని.. వీటిని వినియోగించుకొని ప్రపంచంలోని అత్యుత్తమ విద్యాసంస్థలుగా మన విద్యాసంస్థలను తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. శాస్త్రసాంకేతిక రంగాలకు సంబంధించి మనదేశంలో ఉన్నతవిద్య ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ పేర్కొన్నారు.

 
Comments Off on విద్యలో తలమానికం కావాలి

Posted by on November 8, 2013 in Uncategorized

 
 
%d bloggers like this: