RSS

ఇంటర్‌ బైపీసీలో డిసెక్షన్‌ రద్దు

09 Nov

ఈనాడు, మహబూబ్‌నగర్‌: ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం బైపీసీ విద్యార్థులకు మార్చిలో జరిగే ప్రయోగ పరీక్షల్లో డిసెక్షన్‌ను రద్దు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్‌ఐవోలకు ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్‌ రెండో సంవత్సరం జంతుశాస్త్రం విద్యార్థులకు 30 మార్కులకు డిసెక్షన్‌ ఉంటుంది. బైపీసీ తర్వాత వైద్యవిద్యలో చేరే విద్యార్థులకు జీవుల శరీర నిర్మాణం, అవయవాల అమరికపై ముందే అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఇంటర్‌లో చిరుప్రాణుల డిసెక్షన్‌ను (కోత పరీక్ష) పెట్టారు. ఈ ప్రయోగాలకు కప్ప, తొండలాంటి ప్రాణులు వినియోగించడం వల్ల అవి అంతరించిపోతున్నాయని, భవిష్యత్తులో వాటి మనుగడకు ముప్పు వాటిల్లనుందని జంతు ప్రేమికులు ఆందోళనలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ప్రయోగ పరీక్షల్లో డిసెక్షను లేకున్నా ఇతర అంశాలు స్వల్ప మార్పులతో యథావిధిగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ప్రయోగ పరీక్షల్లో ఇప్పటివరకూ జీవుల డిసెక్షనుకు అయిదు మార్కులు, వాటికి సంబంధించి బొమ్మ గీసి, భాగాలు గుర్తిస్తే అయిదు మార్కులు ఉండేవి. డిసెక్షను లేని కారణంగా మార్కులు ఇచ్చే విధానంలో మార్పులు చేశారు. బొమ్మ భాగాలకు ఆరు మార్కులు, స్త్లెడులను గుర్తించేందుకు 14 మార్కులు (2 × 7) విధించారు. రికార్డుకు అయిదు మార్కులు, ప్రయోగానికి అయిదు మార్కులు చొప్పున.. మొత్తం 30 మార్కులకు పరీక్ష ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

Advertisements
 
Comments Off on ఇంటర్‌ బైపీసీలో డిసెక్షన్‌ రద్దు

Posted by on November 9, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: