RSS

Daily Archives: November 13, 2013

The details of expenditure to be incurred out of Rs. 43290/- allotted last week


The expenditure of the funds should be as follows (tentatively):

16988/- School functions, sports, excursions etc
4727/- examinations (approx. 200/- per student)
7056/- medical & first aid (1500/- medical kit and 1000/- per month doctor fee)
15000/- miscellaneous expenditure, water, electricity etc
Advertisements
 
Comments Off on The details of expenditure to be incurred out of Rs. 43290/- allotted last week

Posted by on November 13, 2013 in Uncategorized

 

అమెరికాను మించిపోతున్నాం


 

* దేశంలోభారీగాపెరుగుతున్ననెటిజన్లు

 

న్యూఢిల్లీ: అంతర్జాల వినియోగంలో భారత్ వచ్చే ఏడాది అమెరికాను మించిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాల వినియోగదారుల సంఖ్య చైనాలో అత్యధికంగా ఉంది. రెండో స్థానంలో అమెరికా, మూడో స్థానంలో భారత్ ఉన్నాయి. అయితే వచ్చే ఏడాది జూన్‌కి భారత్ అమెరికాను మించిపోయే అవకాశం ఉన్నట్లు ఇంటర్నెట్ మొబైల్ అసోసియేషన్ ఆప్ ఇండియా (ఐఏఎంఏఐ) ఐ క్యూబ్ 2013 నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం భారత్‌లో అంతర్జాల వినియోగదారులు
* వచ్చే 8 నెలల్లో 18.53 శాతం పెరుగుతారు
.
* అప్పుడు మొత్తం సంఖ్య 24.3 కోట్లు అవుతుంది
.
* ప్రస్తుతం చైనాలో వినియోగదారుల సంఖ్య 30 కోట్లు
.
* అమెరికాలో 20.7 కోట్లు
.
* భారత్‌లో 20.5 కోట్లు
.
కారణం: భారీగా అంతర్జాలం కలిగిన ఫోన్ల వినియోగం.

 
Comments Off on అమెరికాను మించిపోతున్నాం

Posted by on November 13, 2013 in Uncategorized

 

2030 నాటికి ప్రపంచ విద్యలో భారత్ అగ్రగామి


 

* ఫిక్కీనివేదిక

 

న్యూఢిల్లీ: ”ప్రతిభావంతులైన విద్యార్థులను అందించడంలో 2030 నాటికి ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో నిలవనుంది. ప్రపంచంలో ప్రతి నలుగురు పట్టభద్రుల్లో ఒకరు భారత్‌లోని ఉన్నత విద్యావ్యవస్థ అందించిన వారే అయి ఉంటారు. పరిశోధనా ఫలితాల్లోనూ తొలి అయిదు దేశాల్లో భారత్ ఉంటుంది. ప్రపంచంలోని 200 అగ్రగామి విశ్వవిద్యాలయాల్లో భారత్ విశ్వవిద్యాలయాలు 20 ఉంటాయి”. భారత్‌లో ఉన్నత విద్య: విజన్ 2030 అనే అంశంపై ఫిక్కీ రూపొందించిన నివేదికలో ఈ విధంగా అంచనా వేశారు. మానవవనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రి శశిథరూర్ ఈ నివేదికను నవంబరు 13న (బుధవారం) విడుదల చేశారు.
21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనేలా మానవవనరులను సిద్ధం చేయడానికి వీలుగా ఉన్నత విద్య, వృత్తి విద్యకు నిధులిచ్చేందుకు పారిశ్రామికరంగం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. 2030 నాటికి అనుకున్న లక్ష్యాలను సాధించడానికి పరిశ్రమలకు అనుగుణమైన విద్య, నైపుణ్య ఆధారిత కోర్సులు పరిచయం చేయాలని నివేదికలో సూచించారు. ప్రతిభావంతులైన అధ్యాపకుల అవసరంపైనా సూచనలు చేసింది. అధ్యాపకుల భర్తీ నిబంధనలను సరళతరం చేయాలని, నాణ్యమైన అధ్యాపకులు వీడి వెళ్లకుండా చూసేందుకు పురస్కార ఆధారిత వ్యవస్థ ఉండాలని, బోధనను ఆకర్షణీయ వృత్తిగా ప్రాచుర్యం కల్పించాలని పేర్కొంది. పారిశ్రామిక రంగం-విద్యారంగం అనుసంధానాన్ని పెంచాలంది. ఉన్నత విద్యలో అత్యంత నాణ్యమైన ప్రైవేటు, విదేశీ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని సూచించింది.

 
Comments Off on 2030 నాటికి ప్రపంచ విద్యలో భారత్ అగ్రగామి

Posted by on November 13, 2013 in Uncategorized

 

ఉన్నత విద్య బలోపేతానికి రాష్ట్రాల నిబద్ధత కరవు


* యూజీసీ ఛైర్మన్‌ వేద్‌ ప్రకాశ్‌ వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఉన్నత విద్యా రంగం బలోపేతానికి రాష్ట్రాల నిబద్ధత కరవైందని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) ఛైర్మన్‌ వేద్‌ ప్రకాశ్‌ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. ఉన్నత విద్యా రంగంలో ప్రైవేటురంగ సహేతుకమైన చొరవకు యూజీసీ మద్దతునిస్తుందని నవంబరు 12న చెప్పారు. ఉన్నత విద్య రంగానికి ఆర్థిక, పరిపాలన, అకడమిక్‌ పరంగా సరైన మద్దతును ఇవ్వాలని చెప్పారు. ఈ రంగ బలోపేతానికి కేంద్రం అపార నిధులు ఇస్తున్నప్పటికీ, ఆ తరహా నిబద్ధత, చొరవ రాష్ట్రాలు చూపడం లేదని అన్నారు. ఉన్నత విద్యలో ప్రస్తుతం రెండు కోట్ల మంది రెగ్యులర్‌గా ప్రవేశాలు పొందగా, 40 లక్షల మంది దూర విద్య, ఇతర మార్గాల ద్వారా ప్రవేశాలు పొందినట్లు తెలిపారు.

 
Comments Off on ఉన్నత విద్య బలోపేతానికి రాష్ట్రాల నిబద్ధత కరవు

Posted by on November 13, 2013 in Uncategorized

 

All the Principals are informed that the Examination fee payment due date extended up to 18-11-2013.


All the Principals are informed that the Examination fee payment due date extended up to 18-11-2013.

 
Comments Off on All the Principals are informed that the Examination fee payment due date extended up to 18-11-2013.

Posted by on November 13, 2013 in Uncategorized

 

కేంద్ర పాఠశాలలకూ తెలుగు పుస్తకాలు


ఈనాడు, హైదరాబాద్:
వచ్చే విద్యాసంవత్సరం (2014) నుంచి కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆరో తరగతి నుంచి తృతీయ భాషగా తెలుగును బోధించేందుకు వీలుగా పాఠ్య పుస్తకాలు రానున్నాయి. ఈ తెలుగు పుస్తకాలను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రూపొందిస్తోంది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే నవోదయ పాఠశాలల్లో ఆరు నుంచి 10వ తరగతి వరకు తృతీయ భాష సబ్జెక్టుగా ఒక దాన్ని ఎంచుకోవాలి. తెలుగు ఎంచుకొనేందుకు అవకాశం ఉన్నా పాఠ్య పుస్తకాలు లేవు. ప్రైవేట్ ముద్రణదారులు రూపొందిస్తున్న పుస్తకాలను ఎవరికి ఇష్టమొచ్చింది వారు వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో ఏకరూప పాఠ్య పుస్తకాలను రూపొందించుకోవాలని నిర్ణయించిన నవోదయ అధికారులు తెలుగు విశ్వవిద్యాలయాన్ని సంప్రదించారు. దీంతో విశ్వవిద్యాలయంలోని మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం పుస్తకాల తయారీ బాధ్యతను చేపట్టింది.

 
Comments Off on కేంద్ర పాఠశాలలకూ తెలుగు పుస్తకాలు

Posted by on November 13, 2013 in Uncategorized

 

ప్రకటనలిస్తాం…రాతపరీక్షలు జరుపుతాం


ప్రకటనలిస్తాం…రాతపరీక్షలు జరుపుతాం

* ప్రభుత్వానికి ఏపీపీఎస్సీ తాజా ప్రతిపాదన
ఈనాడు-హైదరాబాద్: ఉద్యోగ నియామకాల ప్రకటన (నోటిఫికేషన్లు) జారీపై ఏపీపీఎస్సీ ప్రభుత్వానికి కొత్త ప్రతిపాదన చేసింది. రాష్ట్ర విభజన జరిగితే అందుకు అనుగుణంగానే అభ్యర్థులను ఎంపికచేస్తామని, అప్పట్లోగా ప్రకటనలు జారీచేసి, రాత పరీక్షలు జరిపేందుకు ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలపాలని కోరుతూ నవంబరు 12న తాజాగా లేఖ రాసింది. దీనివల్ల విలువైన సమయం ఆదా కావడంతోపాటు లక్షలాది మంది ఉద్యోగార్థులకు ఊరట లభిస్తుందని ఏపీపీఎస్సీ వర్గాలు ఆశిస్తున్నాయి. గత జులై 30వ తేదీన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన ప్రకటన చేసిన అనంతరం ఉద్యోగ నియామకాల ప్రక్రియపై ప్రతిష్ఠంభన నెలకొంది. ఉద్యోగ నియామకాల ప్రకటనలు జారీచేస్తే..స్థానిక, స్థానికేతర సమస్యలు తెరపైకొచ్చి..సమస్యలు జటిలమవుతాయన్న ఆందోళనతో ఏపీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరుతూ ఆగస్టు మొదటి వారంలో లేఖ రాసింది. అయితే..ఇప్పటివరకు ఏపీపీఎస్సీకి సచివాలయం నుంచి తిరుగు జవాబు రాలేదు.
* రాత పరీక్షల వరకు జరుపుతాం: బిశ్వాల్, ఏపీపీఎస్సీ అధ్యక్షుడు
ఉద్యోగాల ప్రకటనల జారీకి ఆమోదం తెలిపితే..వాటిని జారీచేసి…రాతపరీక్షలు జరిపేందుకు వీలు లభిస్తే..ఉద్యోగార్థులకు ఉపయుక్తంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షుడు, విశ్రాంత ఐ.ఎ.ఎస్. చిత్తరంజన్‌బిశ్వాల్ ‘ఈనాడు ప్రతినిధితో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు.
* పరిశీలనలో ఉంది: సాధారణ పరిపాలన శాఖ
దీనిపై సాధారణ పరిపాలన శాఖ వర్గాలు స్పందిస్తూ..ఏపీపీఎస్సీ నుంచి వచ్చిన ప్రతిపాదనపై న్యాయశాఖ, ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి స్థాయిలో చర్చించిన అనంతరమే నిర్ణయాన్ని తీసుకుంటామని పేర్కొన్నాయి.

 
2 Comments

Posted by on November 13, 2013 in Uncategorized

 
 
%d bloggers like this: