RSS

ఉన్నత విద్య బలోపేతానికి రాష్ట్రాల నిబద్ధత కరవు

13 Nov

* యూజీసీ ఛైర్మన్‌ వేద్‌ ప్రకాశ్‌ వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఉన్నత విద్యా రంగం బలోపేతానికి రాష్ట్రాల నిబద్ధత కరవైందని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) ఛైర్మన్‌ వేద్‌ ప్రకాశ్‌ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. ఉన్నత విద్యా రంగంలో ప్రైవేటురంగ సహేతుకమైన చొరవకు యూజీసీ మద్దతునిస్తుందని నవంబరు 12న చెప్పారు. ఉన్నత విద్య రంగానికి ఆర్థిక, పరిపాలన, అకడమిక్‌ పరంగా సరైన మద్దతును ఇవ్వాలని చెప్పారు. ఈ రంగ బలోపేతానికి కేంద్రం అపార నిధులు ఇస్తున్నప్పటికీ, ఆ తరహా నిబద్ధత, చొరవ రాష్ట్రాలు చూపడం లేదని అన్నారు. ఉన్నత విద్యలో ప్రస్తుతం రెండు కోట్ల మంది రెగ్యులర్‌గా ప్రవేశాలు పొందగా, 40 లక్షల మంది దూర విద్య, ఇతర మార్గాల ద్వారా ప్రవేశాలు పొందినట్లు తెలిపారు.

Advertisements
 
Comments Off on ఉన్నత విద్య బలోపేతానికి రాష్ట్రాల నిబద్ధత కరవు

Posted by on November 13, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: