RSS

కేంద్ర పాఠశాలలకూ తెలుగు పుస్తకాలు

13 Nov

ఈనాడు, హైదరాబాద్:
వచ్చే విద్యాసంవత్సరం (2014) నుంచి కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆరో తరగతి నుంచి తృతీయ భాషగా తెలుగును బోధించేందుకు వీలుగా పాఠ్య పుస్తకాలు రానున్నాయి. ఈ తెలుగు పుస్తకాలను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రూపొందిస్తోంది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే నవోదయ పాఠశాలల్లో ఆరు నుంచి 10వ తరగతి వరకు తృతీయ భాష సబ్జెక్టుగా ఒక దాన్ని ఎంచుకోవాలి. తెలుగు ఎంచుకొనేందుకు అవకాశం ఉన్నా పాఠ్య పుస్తకాలు లేవు. ప్రైవేట్ ముద్రణదారులు రూపొందిస్తున్న పుస్తకాలను ఎవరికి ఇష్టమొచ్చింది వారు వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో ఏకరూప పాఠ్య పుస్తకాలను రూపొందించుకోవాలని నిర్ణయించిన నవోదయ అధికారులు తెలుగు విశ్వవిద్యాలయాన్ని సంప్రదించారు. దీంతో విశ్వవిద్యాలయంలోని మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం పుస్తకాల తయారీ బాధ్యతను చేపట్టింది.

 
Comments Off on కేంద్ర పాఠశాలలకూ తెలుగు పుస్తకాలు

Posted by on November 13, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: