RSS

Daily Archives: November 18, 2013

మహారాష్ట్ర విద్యార్థులకు ‘సచిన్’ పాఠం


ఈనాడు, ముంబయి: సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని మహారాష్ట్ర విద్యా శాఖ నవంబరు 18న నిర్ణయించింది. సచిన్ మహోన్నత వ్యక్తి అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజేంద్ర దర్డా అభివర్ణించారు. భవిష్యత్తు తరాలు ఆయన గురించి తెలుసుకోవాల్సి ఉందన్నారు. విద్యాశాఖ అధికారులతో సమావేశాలు నిర్వహించి రాష్ట్ర బోర్డు పాఠ్య ప్రణాళికలో సచిన్ జీవిత చరిత్రను ఒక అధ్యాయంగా చేర్చనున్నట్లు వివరించారు. ఏ తరగతిలో చేర్చాలన్న విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. దీనిపై అధికారులతో సంప్రదించి నిర్ణయిస్తామని తెలిపారు. సచిన్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని కోరుతూ గత వారం మహారాష్ట్ర నవ నిర్మాణ విద్యార్థి సేన విద్యా శాఖకు లేఖ రాసింది.

 
Comments Off on మహారాష్ట్ర విద్యార్థులకు ‘సచిన్’ పాఠం

Posted by on November 18, 2013 in Uncategorized

 

టీచర్ల సర్దుబాటుకు చర్యలు


ఈనాడు-హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తక్కువగా ఉండి.. సబ్జెక్టు ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న వారిని అవసరం ఉన్న పాఠశాలలకు పంపించే ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా నవంబరు 18 నుంచి మొదలైంది. విద్యాశాఖ జారీచేసిన ఆదేశాలు అనుసరించి జిల్లా విద్యా శాఖ అధికారులు ఉపాధ్యాయ సర్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు. మరో వారంలో ఈ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నారు.

 
Comments Off on టీచర్ల సర్దుబాటుకు చర్యలు

Posted by on November 18, 2013 in Uncategorized

 

October salary will be credited tomorrow


October Salary_2013
Evng hours October Salary bill cheque Signed by Commissioner…we will get Salary tmrw …Principal A/C…Inform to all our frnds MSTA
 
2 Comments

Posted by on November 18, 2013 in Uncategorized

 
 
%d bloggers like this: