RSS

మహారాష్ట్ర విద్యార్థులకు ‘సచిన్’ పాఠం

18 Nov

ఈనాడు, ముంబయి: సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని మహారాష్ట్ర విద్యా శాఖ నవంబరు 18న నిర్ణయించింది. సచిన్ మహోన్నత వ్యక్తి అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజేంద్ర దర్డా అభివర్ణించారు. భవిష్యత్తు తరాలు ఆయన గురించి తెలుసుకోవాల్సి ఉందన్నారు. విద్యాశాఖ అధికారులతో సమావేశాలు నిర్వహించి రాష్ట్ర బోర్డు పాఠ్య ప్రణాళికలో సచిన్ జీవిత చరిత్రను ఒక అధ్యాయంగా చేర్చనున్నట్లు వివరించారు. ఏ తరగతిలో చేర్చాలన్న విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. దీనిపై అధికారులతో సంప్రదించి నిర్ణయిస్తామని తెలిపారు. సచిన్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని కోరుతూ గత వారం మహారాష్ట్ర నవ నిర్మాణ విద్యార్థి సేన విద్యా శాఖకు లేఖ రాసింది.

Advertisements
 
Comments Off on మహారాష్ట్ర విద్యార్థులకు ‘సచిన్’ పాఠం

Posted by on November 18, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: