RSS

Daily Archives: November 20, 2013

Image

IR


1454798_10200428037697330_329287000_n

Advertisements
 
1 Comment

Posted by on November 20, 2013 in Uncategorized

 

నేర్పరితనముంటే ఉద్యోగం మీదే!


* భాషా పరిజ్ఞానమూ అవసరమేనంటున్న ర్యాండ్‌స్టాడ్‌ అధ్యయనం
* మీరు చక్కగా మాట్లాడగలరా..
* మీకు తెలిసిన విషయాన్ని ఇతరులకు సులువుగా అర్ధమయ్యే రీతిలో చెప్పగలరా.. ఎటువంటి పరిస్థితుల్లో అయినా నేర్పుగా నెగ్గుకురాగల సత్తా ఉందా..
* రెండు మూడు భాషలు మాట్లాడగలరా…?
* అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ రంగాల్లోని సంస్థలు తమ ఉద్యోగికి ఉండాలని కోరుకునే లక్షణాలు మీకున్నట్లే!
వీటికి అదనంగా కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉంటే ఇంకా మంచిది. వాస్తవానికి మీకున్న విద్యార్హత, ఒక రంగంలో ఉన్న పరిజ్ఞానం- అనుభవం కన్నా కూడా కొన్ని సందర్భాల్లో ఇటువంటి నూతన తరం నైపుణ్యాలే ఉద్యోగం రావడానికి, ఉద్యోగంలో నెగ్గుకురావడానికి తావిస్తున్నాయి. మానవ వనరుల సేవలు అందించే ప్రముఖ సంస్థ అయిన రాండ్‌స్టాడ్‌ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు స్పష్టమయ్యాయి.
ఉద్యోగాల మార్కెట్‌లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి అభ్యర్థులు కావాలని సంస్థలు కోరుకుంటున్నాయి.. అనే వివిధ అంశాలపై ఈ సంస్థ పరిశీలన చేసింది. దీని ప్రకారం ఒక అభ్యర్థికి సాంఘిక నైపుణ్యం (సోషల్‌ స్కిల్స్‌) ఎలా ఉన్నాయి, కంప్యూటర్‌ పరిజ్ఞానం (డిజిటల్‌ స్కిల్స్‌) ఏపాటి, విద్యార్హతలు, అనుభవం- ఈ నాలుగు అంశాలూ ముఖ్యమని తేలింది. అయిదేళ్ల క్రితం ఈ పరిస్థితి లేదని, ముఖ్యంగా సాంఘిక నైపుణ్యం, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఇప్పుడు ముందు వరుసలోకి వచ్చినట్లు వెల్లడైంది. ఇంతటితోనే కాకుండా వచ్చే అయిదేళ్లలో ఈ అర్హత ప్రాధాన్యం ఇంకా పెరుగుతుందని రాండ్‌స్టాడ్‌ అభిప్రాయపడింది.
రాండ్‌స్టాడ్‌ భారత్‌లో నిర్వహించిన అధ్యయనంలో పాల్గొన్న ఉద్యోగుల్లో 91 శాతం మంది, తమ సంస్థల యాజమాన్యాలు తమ నుంచి అధిక సత్తాను, పనిని ఆశిస్తున్నాయని చెప్పారు. ఇది ప్రపంచ సగటు అయి 86 శాతం కంటే ఎక్కువ కావడం గమనార్హం. అదే విధంగా సంస్థలు కూడా ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశాయి. ఉద్యోగులకు సాంఘిక నైపుణ్యం, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఎంతో అవసరమని పేర్కొన్నాయి. ఇది తమకు ఇబ్బందికరంగా ఉన్నట్లు, తాము ఈ కొత్త అర్హతలను సాధించలేని పరిస్థితి ఎదురవుతుందని ఈ అధ్యయనంలో పాల్గొన్న 52 శాతం మంది అభిప్రాయపడ్డారు. 94 శాతం మంది మాత్రం ఉద్యోగం కోసం తాము ఏమైనా చేయాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఇక ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా తగిన నైపుణ్యాన్ని ఉద్యోగుల్లో పెంపొందించడంతో తమ పాత్ర అధికంగా ఉంటుందని కొన్ని సంస్థల యాజమాన్యాలు అభిప్రాయపడగా, ఉద్యోగులు మాత్రం అవసరమైన విధంగా నైపుణ్యాన్ని సంపాదించుకోవలసిన బాధ్యత తమదేనని పేర్కొన్నారు. ఇక ఉద్యోగులు వారు చేస్తున్న ఉద్యోగాలలో నుంచి వేరే ఉద్యోగాలలోకి మారిపోవడమనేది భారత్‌లోనే అధికంగా ఉన్నట్లు రాండ్‌స్టాడ్‌ స్పష్టం చేసింది. దాదాపు మూడేళ్లుగా ఈ విషయంలో ఇండియా అగ్రస్థానంలో ఉన్నట్లు, భారత్‌ తరువాతి స్థానాల్లో మలేషియా, బ్రెజిల్‌లు ఉన్నట్లు వివరించింది. ఈ విషయంలో లగ్జెమ్‌బర్గ్‌ చివరిస్థానంలో ఉంది. నెదర్లాండ్స్‌, జర్మనీలలో కూడా ఉద్యోగులు తమ ఉద్యోగాలు మారడం తక్కువే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో భారతీయ కంపెనీలు భాగం పంచుకుంటున్న కొద్దీ అవి వివిధ దేశాలు, వివిధ ప్రాంతాలకు చెందిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవలసి వస్తుందని, రాండ్‌స్టాడ్‌ ఇండియా సీఈఓ మూర్తి కె.ఉప్పలూరి పేర్కొన్నారు.

 
Comments Off on నేర్పరితనముంటే ఉద్యోగం మీదే!

Posted by on November 20, 2013 in Uncategorized

 
 
%d bloggers like this: