RSS

ఏపీసెట్‌కు ఏర్పాట్లు

21 Nov

హైదరాబాద్, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష (ఏపీసెట్)కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీసెట్ సభ్యకార్యదర్శి ప్రొ.రాజేశ్వర్‌రెడ్డి నవంబరు 20న తెలిపారు. నవంబర్ 24న నిర్వహించనున్న పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 8 జోన్లలో 208 కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. హైదరాబాద్‌లోని 52 పరీక్ష కేంద్రాలలో 35,316 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. మొత్తం 27 సబ్జెక్టులకు లక్షా ఇరవై ఆరువేల ఏడువందల ఎనభై ఐదు మంది దరఖాస్తులు చేసుకున్నారని చెప్పారు. ఇందులో 24,814 మంది జనరల్ కేటగిరీ, 61,899 మంది బీసీలు, 31,358 మంది ఎస్సీలు, 8,714 మంది ఎస్టీలు ఉన్నారన్నారు

 
Comments Off on ఏపీసెట్‌కు ఏర్పాట్లు

Posted by on November 21, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: