RSS

23న ఆదర్శ టీజీటీల నియామకం

21 Nov

అనంతపురం : అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఆదర్శ పాఠశాలల టీజీటీ ఉపాధ్యాయుల నియామకానికి నవంబ‌రు 23న ధ్రువీకరణ పత్రాలు పరిశీలించనున్నామని ఆర్జేడీ రమణకుమార్‌ తెలిపారు. విద్యార్హతలు, కుల ధ్రువీకరణ, అంగవైకల్య ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తామన్నారు. అభ్యర్థులు ఒరిజినల్‌ ధ్రువపత్రాలు, మూడు అదనపు జిరాక్స్‌ కాపీలు ఇవ్వాలి.
* ఉపకారవేతనాలకు దరఖాస్తు
ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ మంజూరు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ ఉపసంచాలకులు రమణమూర్తి తెలిపారు. రాజీవ్‌ విద్యా దీవెన పథకం ద్వారా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లో 5నుంచి 10వ తరగతి వరకు డే స్కాలర్స్‌గా చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అర్హులు. పూర్తి వివరాలతో నవంబ‌రు 30లోగా దరఖాస్తు చేసుకోవాలి.

 
Comments Off on 23న ఆదర్శ టీజీటీల నియామకం

Posted by on November 21, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: