గచ్చిబౌలి: విలువలతో కూడిన విద్యను అందించడంలో జవహర్నవోదయ విద్యాలయాలు ముందంజలో ఉన్నాయని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి పళ్లంరాజు అన్నారు. ప్రతిభ ఉన్న గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన జవహర్నవోదయ విద్యాలయ వ్యవస్థ విజయవంతంగా సాగుతుందన్నారు. నవంబరు 22న గచ్చిబౌలిలోని హెచ్‌సీయూలో జవహర్నవోదయ విద్యాలయ సమితి జాతీయ సమైక్యత సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి పళ్లంరాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక నవోదయ పాఠశాల ఉందని, ఏటా ఈ పాఠశాల్లో మంచి ఫలితాలు రావటం హర్షనీయమన్నారు. జేఎన్వీలను మరింత పటిష్టం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.విద్యార్థుల్లో మంచి విలువలను పెంపొందించే భాద్యత ఉపాధ్యాయులపై ఉంటుందన్నారు. హైదారాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ రామకృష్ణరామస్వామి మాట్లాడుతూ జేఎన్వీ జాతీయ సమ్మేళనం భారతీయతకు అద్దంపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జేఎన్‌వీఎస్ కమిషనర్ జి.ఎస్.బోత్యిల్, జాయింట్ కమిషనర్ ఎం.ఎస్.ఖన్నా, హైదరాబాద్ రీజియన్ డిప్యూటీ కమిషనర్ డి.వి.ఎస్.ఆర్.మూర్తి తదితరులున్నారు.
Daily Archives: November 22, 2013
ఉద్యోగుల ఉన్నతవిద్యకు మరిన్ని ప్రోత్సాహకాలు!
* కేంద్ర ప్రభుత్వ యోచన
న్యూఢిల్లీ: సర్వీసులో ఉంటూ ఉన్నత విద్యార్హతలు పొందే ఉద్యోగులకు మరిన్ని ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది. దీనిపై సూచనలివ్వాలని సిబ్బంది వ్యవహారాల శాఖ.. కేంద్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలను నవంబరు 22న కోరింది. ప్రస్తుతమున్న పథకం ప్రకారం.. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా పశువైద్య శాస్త్రంలో పీజీ డిగ్రీ, పీహెచ్డీ పొందే ఉద్యోగులకు గరిష్ఠంగా రూ.10వేల వరకూ దక్కుతాయి. దీనికితోడు ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్లో డిగ్రీ పొందే ఉద్యోగికి రూ.8వేలు ఇస్తారు. ఉద్యోగంలో చేరాక పొందే ఉన్నత డిగ్రీలకే ఈ ప్రోత్సాహకాలు దక్కుతాయి. ప్రస్తుత విధానంపై సూచనలు ఇవ్వాలని సిబ్బంది వ్యవహారాల శాఖ పలుమార్లు కేంద్ర ప్రభుత్వ విభాగాలకు లేఖలు రాసింది. రెవెన్యూ విభాగం, ఆర్థిక మంత్రిత్వశాఖ మినహా మిగతావాటి నుంచి స్పందన రాలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీంతో తాజాగా మరోసారి లేఖలను పంపామని వివరించాయి.
ఇతరుల మెప్పు కోసం కాదు… మనస్సాక్షి కోసం కష్టపడాలి
విద్యార్థులకు ముఖ్యమంత్రి ఉద్బోధ
ఈనాడు, హైదరాబాద్: జీవితంలో, కుటుంబంలో, సమాజంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులుంటాయని, వాటిని ఆత్మ విశ్వాసంతో అధిగమించాలని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇతరుల మెప్పు కోసం కాకుండా మనస్సాక్షికి సమాధానం చెప్పుకొనేందుకు కష్టపడాలన్నారు. నవంబరు 22న సచివాలయంలో ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు కలిశారు. 20 మంది విద్యార్థులను ఏప్రిల్, మే నెలల్లో ఎవరెస్టు అధిరోహణకు పంపించబోతున్నారు. వారితో ముఖ్యమంత్రి ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో ప్రతి ఆటకు ఒక ప్రత్యేకత ఉంటుందని చెప్పారు. ఒక వేళ విజయం సాధించలేకపోయినా నిరాశపడకూడదని ఉద్బోధించారు. మళ్లీ అడుగు ముందుకు వేయడానికే కృషి చేయాలన్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన 9, 11 తరగతులకు చెందిన 108 విద్యార్థులు భువనగిరిలోని పర్వతారోహణ కోర్సుకు ఎంపికయ్యారు.
Trained Graduate Teacher Post
Finally TGT’s Struggle and Waiting has come to an end with lots of happiness.
we welcome all the TGT’s to the APMS Family.