RSS

ఇతరుల మెప్పు కోసం కాదు… మనస్సాక్షి కోసం కష్టపడాలి

22 Nov

విద్యార్థులకు ముఖ్యమంత్రి ఉద్బోధ

ఈనాడు, హైదరాబాద్: జీవితంలో, కుటుంబంలో, సమాజంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులుంటాయని, వాటిని ఆత్మ విశ్వాసంతో అధిగమించాలని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇతరుల మెప్పు కోసం కాకుండా మనస్సాక్షికి సమాధానం చెప్పుకొనేందుకు కష్టపడాలన్నారు. నవంబరు 22న సచివాలయంలో ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు కలిశారు. 20 మంది విద్యార్థులను ఏప్రిల్, మే నెలల్లో ఎవరెస్టు అధిరోహణకు పంపించబోతున్నారు. వారితో ముఖ్యమంత్రి ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో ప్రతి ఆటకు ఒక ప్రత్యేకత ఉంటుందని చెప్పారు. ఒక వేళ విజయం సాధించలేకపోయినా నిరాశపడకూడదని ఉద్బోధించారు. మళ్లీ అడుగు ముందుకు వేయడానికే కృషి చేయాలన్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన 9, 11 తరగతులకు చెందిన 108 విద్యార్థులు భువనగిరిలోని పర్వతారోహణ కోర్సుకు ఎంపికయ్యారు.

 

 
Comments Off on ఇతరుల మెప్పు కోసం కాదు… మనస్సాక్షి కోసం కష్టపడాలి

Posted by on November 22, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: