RSS

Daily Archives: November 25, 2013

పాఠ్యప్రణాళిక యానిమేషన్ సీడీల విడుదల


ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర పాఠ్యప్రణాళికకు అనుగుణంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కంప్రింట్ సంస్థ రూపొందించిన వివిధ సబ్జెక్టుల త్రీడీ యానిమేషన్ సీడీలను ఐటీశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విడుదల చేశారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో రూపొందించిన ఈ సీడీల వల్ల విద్యార్థులు సులభంగా పాఠాలను అర్థం చేసుకోగలుగుతారని చెప్పారు. కార్యక్రమంలో సంస్థ సీఈవో జి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

 
Comments Off on పాఠ్యప్రణాళిక యానిమేషన్ సీడీల విడుదల

Posted by on November 25, 2013 in Uncategorized

 

దేశంలో 278 కొత్త విశ్వవిద్యాలయాలు


దేశంలో 278 కొత్త విశ్వవిద్యాలయాలు

* రూ.22,500 కోట్లు కేటాయిస్తాం
* కేంద్ర హెచ్ఆర్‌డీ శాఖ మంత్రి పళ్లంరాజు
బెంగళూరు: దేశంలో 278 కొత్త విశ్వవిద్యాలయాలు, 388 కళాశాలలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికోసం రూ.22,500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి పళ్లంరాజు తెలిపారు. రాష్ట్రాల స్థాయిలో ఉన్నత విద్య అభివృద్ధికి ఈ నిధులు వెచ్చిస్తారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్ష అభియాన్ (ఆర్‌యూఎస్ఏ)పై నవంబరు 25న ఇక్కడ ఉన్నత విద్యాశాఖ మంత్రులతో అఖిల భారత సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పళ్లంరాజు, మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలోని ఉన్నత విద్య కార్యదర్శి అశోక్ ఠాకూర్ మాట్లాడారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు సరైన గుర్తింపు విధానం, విద్యా ట్రైబ్యునళ్ల ద్వారా వివాదాల పరిష్కారం, అవకతవకల నిరోధం, ఉన్నత విద్య, అధ్యయనంపై జాతీయ కమిషన్ ఏర్పాటు లాంటి పలు సంస్కరణలకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి పళ్లంరాజు తెలిపారు. 306 విశ్వవిద్యాలయాలు, 8,500 కళాశాలలు ఆర్‌యూఎస్ఏ ప్రయోజనాలు పొందుతున్నట్లు ఆయన చెప్పారు. ఏమాత్రం విద్యారంగ నేపథ్యం లేనివారు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు స్థాపించేలా రాష్ట్రాలు ప్రోత్సహించొద్దని అశోక్ ఠాకూర్ హెచ్చరించారు. దానికి బదులు మంచి పనితీరు కనబరిచే స్వయంప్రతిపత్తి కళశాలలు, సంస్థలను విశ్వవిద్యాలయాలుగా రూపుదాల్చే దిశగా ప్రోత్సహించాలన్నారు. ప్రస్తుతం ఒక్కో విశ్వవిద్యాలయం పరిధిలో సుమారు 300 కళాశాలలు ఉంటుండటంతో పాలన వ్యవహారాల పర్యవేక్షణకే సమయం సరిపోతుందని… పరిశోధనలు, నాణ్యమైన విద్య అందించలేకపోతున్నారన్నారు. విశ్వవిద్యాలయం పరిధిలో వందకు మించి కళాశాలలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

 
Comments Off on దేశంలో 278 కొత్త విశ్వవిద్యాలయాలు

Posted by on November 25, 2013 in Uncategorized

 

The Principal is requested to do online fee confirmation once again


  The Principal is requested to do online fee confirmation once again for the period from 19-11-2013 to 23-11-2013, Since there was a technical problem in the Server. This should be completed by 27-11-2013, Since tatkal Scheme fee confirmation in online will commence from 28-11-2013. The Principal is requested to check all the fee paid candidates details in your College Login and Re-confirm any missing candidates fee Confirmations immediately..

 
Comments Off on The Principal is requested to do online fee confirmation once again

Posted by on November 25, 2013 in Uncategorized

 

త్రివిధ దళాల్లో కెరీర్కు.. కోరుకొండ, కలికిరి సైనిక్ స్కూళ్లు


తొలిరోజునుంచేమిలటరీఓరియెంటెడ్గావిద్యాబోధనసాగేసైనికపాఠశాల్లోప్రవేశించడంభవిష్యత్తులోత్రివిధదళాల్లోకెరీర్కుతొలిమెట్టువంటిదే. ఒక్కసారిప్రవేశించినవిద్యార్థులుసీబీఎస్ +2 పూర్తయ్యేవరకుఇక్కడేచదివేఅవకాశం.. నేషనల్డిఫెన్స్అకాడెమీలోఅడుగుపెట్టేవీలుసైనిక్స్కూల్స్ప్రత్యేకత. అందుకేవీటిలోప్రవేశానికినిర్వహించేపరీక్షకుప్రతిఏటాపోటీపెరుగుతోంది.

చిన్నతనంనుంచేక్రమశిక్షణ.. క్రమబద్ధమైనజీవితం.. ధైర్యసాహసాలు.. శారీరకధ్రుడత్వం.. ఇవన్నీకావాలంటేసరైనవేదికలుసైనిక్స్కూల్స్’. మనరాష్ట్రంలోనివిజయనగరంజిల్లాకోరుకొండతోపాటు.. నూతనంగాఏర్పాటుచేసినచిత్తూరుజిల్లాకలికిరిలోనిసైనికపాఠశాలలో (ఆరోతరగతిలోమాత్రమే).. 2014-15 విద్యాసంవత్సరానికిఆరు, తొమ్మిదోతరగతుల్లోప్రవేశానికినోటిఫికేషన్విడుదలైంది. నేపథ్యంలోప్రవేశవిధానం, సంబంధితవివరాలు..

సీట్లు:
కోరుకొండ:ఆరోతరగతి-175, తొమ్మిదోతరగతి-120
కలికిరి:ఆరోతరగతి-100.

ప్రవేశవిధానం:
ప్రవేశవిధానంలోరెండుదశలుఉంటాయి. అవి..ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూ. ప్రవేశపరీక్షలోసాధించినమెరిట్ఆధారంగాఇంటర్వ్యూదశకుఅర్హతకల్పిస్తారు. రెండుదశల్లోచూపినప్రతిభఆధారంగాఅడ్మిషన్నుఖరారుచేస్తారు.

పరీక్షతీరు:
రాతపరీక్షనుఆల్ఇండియాసైనిక్స్కూల్స్ఎంట్రన్స్ఎగ్జామినేషన్పేరుతోనిర్వహిస్తారు. ప్రశ్నపత్రంఇంగ్లిష్, హిందీతోపాటుగుర్తింపుపొందినఆధికారికభాషల్లోఉంటుంది. ఆరు, తొమ్మిదోతరగతులకోసంవేర్వేరుగాపరీక్షజరుగుతుంది. ఆరోతరగతిప్రశ్నపత్రాన్నిఇంగ్లిష్తోపాటుగుర్తింపుపొందినఆధికారికభాషల్లోరూపొందిస్తారు. తొమ్మిదోతరగతిప్రవేశపరీక్షపత్రంఇంగ్లిష్భాషలోనేఉంటుంది.

ఆరోతరగతిలోప్రవేశానికినిర్వహించేపరీక్షరెండువిభాగాలుగాఉంటుంది. అవి..

విభాగం

మార్కులు

మ్యాథమెటిక్స్అండ్లాంగ్వేజ్

200

ఇంటెలిజెన్స్టెస్ట్

100

మొత్తం

300

తొమ్మిదోతరగతిలోప్రవేశానికినిర్వహించేపరీక్షకూడారెండువిభాగాలుగాఉంటుంది. అవి..

విభాగం

మార్కులు

మ్యాథమెటిక్స్అండ్సైన్స్

275

ఇంగ్లిష్అండ్సోషల్సెన్సై

175

మొత్తం

450

ఇందులోమార్కులవిభజన..మ్యాథమెటిక్స్-200 మార్కులు), సైన్స్-75 మార్కులు.
ఇంగ్లిష్-100 మార్కులు, సోషల్స్టడీస్-75 మార్కులు.

ప్రిపరేషన్:
రెండుపరీక్షల్లోఅడిగేప్రశ్నలస్థాయివిద్యార్థులుప్రస్తుతంవారుచదువుతున్నతరగతులసిలబస్ప్రమాణాలమేరకేఉంటుంది. లాంగ్వేజ్ఎలిజిబిలిటీటెస్ట్లోఇంగ్లిష్భాషపైఉన్నప్రాథమికపరిజ్ఞానాన్నిపరీక్షించేవిధంగాప్రశ్నలుఅడుగుతారు. ఇంటెలిజెన్స్టెస్్్లోజనరల్నాలెడ్జ్కిసంబంధించినప్రశ్నలేఉంటాయి.

ఆరోతరగతి:పేపర్లోఇంగ్లిష్లోఎస్సేరైటింగ్, కాంప్రెహెన్షన్, వొకాబ్యులరీ, జెండర్, యాంటినామ్స్, సినానిమ్స్, సెంటెన్సెస్, రీఆరేజింగ్, వెర్బ్ఫామ్స్, నౌన్స్, యాడ్వెర్బ్స్, గ్రామెటికల్స్ట్రక్చర్స్వంటిఅంశాలనుంచిప్రశ్నలువస్తాయి.
మ్యాథమెటిక్స్:ఇందులోనంబర్సిస్టమ్, ఫ్రాక్షన్, డెసిమల్స్, కమర్షియల్మ్యాథమెటిక్స్, మెన్సురేషన్, జామెట్రీ (ప్రాథమికభావనలు) వంటిఅంశాలనుంచిప్రశ్నలువస్తాయి.

తొమ్మిదోతరగతి:పేపర్కోసంఎనిమిదోతరగతివరకుఉన్నసోషల్స్టడీస్ (జాగ్రఫి, సివిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్), సైన్స్ (బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ)లలోఅన్నిఅంశాలనుచదవాలి. మ్యాథమెటిక్స్లోస్క్వేర్స్, క్యూబ్స్, కంపౌండ్ఇంట్రెస్ట్, పాలినామిల్స్, సర్కిల్స్, ట్రాయాంగిల్స్, సర్కిల్స్, స్టాటిస్టిక్స్వంటిఅంశాలపైఎక్కువగాదృష్టిసారించాలి. ఇంగ్లిష్లోఎస్సేరైటింగ్, కాంప్రెహెన్షన్, వొకాబ్యులరీ, జెండర్, యాంటినామ్స్, సినానిమ్స్, సెంటెన్సెస్, రీఆరేజింగ్, వెర్బ్ఫామ్స్, నౌన్స్, యాడ్వెర్బ్స్, గ్రామెటికల్స్ట్రక్చర్స్వంటిఅంశాలనుంచిప్రశ్నలువస్తాయి.

చదవాల్సినపుస్తకాలు:
ప్రశ్నలనుసీబీఎస్సిలబస్ఆధారంగారూపొందిస్తారు. నేపథ్యంలోఆరుతరగతివిద్యార్థులు..సీబీఎస్ఐదోతరగతిపుస్తకాలను, తొమ్మిదోతరగతివిద్యార్థులుసీబీఎస్ఎనిమిదోతరగతిపుస్తకాలనుచదవడంప్రయోజనకరం.

రాతపరీక్షతర్వాత:
రాతపరీక్షలోప్రతిభచూపించినవిద్యార్థులకుఇంటర్వ్యూ, మెడికల్టెస్ట్నిర్వహిస్తారు. ఇంటర్వ్యూదశకు 50 మార్కులుకేటాయించారు. ఇందుకోసం 1:3 నిష్పత్తిలోవిద్యార్థులకుఅవకాశంకల్పిస్తారు. రాతపరీక్షకుసాధించినమార్కులకుఇంటర్వ్యూమార్కులనుకలుపుతారు. నిర్దేశించినప్రమాణాలనుపరిశీలించడానికిమెడికల్టెస్ట్నిర్వహిస్తారు. ఇందులోమెడికల్లీఫిట్అనేధ్రువీకరణపొందితేనేప్రవేశంఖరారవుతుంది.

స్కాలర్షిప్సదుపాయాలు:
విద్యార్థులనుప్రోత్సహించేఉద్దేశంతోమెరిట్స్కాలర్షిప్స్, ఇన్కమ్బేస్డ్స్కాలర్షిప్స్, ఢిఫెన్స్స్కాలర్షిప్స్సదుపాయాలుఅందుబాటులోఉన్నాయి. కుటుంబఆదాయంసంవత్సరానికిరూ. 18 వేలకంటేతక్కువఉన్నఎస్సీ/ఎస్టీవిద్యార్థులకుసాంఘిక, గిరిజనసంక్షేమశాఖనుంచిస్కాలర్షిప్లులభిస్తాయి. కుటుంబవార్షికఆదాయంరూ. రెండువేలలోపుఉంటేఉచితబోధనసదుపాయం, తదితరాలకుమెరిట్కమ్మీన్స్స్కాలషిప్స్సదుపాయంకల్పిస్తారు. ప్రవేశపరీక్షలోప్రతిభఆధారంగారాష్ట్రవిద్యార్థుల్లో 50 శాతంమందికిరాష్ట్రప్రభుత్వస్కాలర్షిప్లభిస్తుంది. అంతేకాకుండానెలవారీగాఇన్కమ్బేస్డ్స్కాలర్షిప్స్నుఅందిస్తుంది. +2 తర్వాతఎన్డీఏలోప్రవేశంఖరారుచేసుకున్నవారికి.. +1, +2లలోచెల్లించినఫీజుమొత్తాన్నిరీయింబర్స్మెంట్చేయడంమరోప్రత్యేకసదుపాయంఅందుబాటులోఉంది.

రాష్ట్రానికిప్రాధాన్యం:
సైనిక్స్కూల్లోప్రవేశాలకుఅఖిలభారతస్థాయిలోపరీక్షనిర్వహించినా.. సీట్లకేటాయింపులోఆయారాష్ట్రాలవిద్యార్థులకుఎక్కువప్రాధాన్యంఇస్తారు. అంటేనిర్దేశితసైనిక్స్కూల్ఉన్నరాష్ట్రానికిచెందినవిద్యార్థులకు 67 శాతంసీట్లు; దేశంలోనిమిగతారాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతవిద్యార్థులకు 33 శాతంసీట్లులభిస్తాయి.

అడుగుపెడితే:
సైనిక్స్కూల్స్లోప్రవేశంఖరారుచేసుకున్నవిద్యార్థులుఉజ్వలభవిష్యత్తుదిశగాపయనిస్తారనేదినిస్సందేహం. పదోతరగతివరకుఆల్ఇండియాసెకండరీస్కూల్ఎగ్జామినేషన్, తర్వాత 12తరగతివరకుఆల్ఇండియాసీనియర్స్కూల్సర్టిఫికెట్ఎగ్జామినేషన్కోసంసిద్ధంచేస్తారు. అంతేకాకుండా 12తరగతితర్వాతపుణేలోనినేషనల్డిఫెన్స్అకాడమీలోచేరేవిధంగాశిక్షణనిస్తారు. ప్రతివిద్యార్థిఎన్సీసీలోచేరడంతప్పనిసరి.

అర్హతలివే:
ఆరోతగరతిలోప్రవేశానికి: విద్యార్థులుపదేళ్లుపూర్తిచేసుకునిపదకొండేళ్లలోపుఉండాలి. ప్రస్తుతప్రవేశాలకుదరఖాస్తుచేసుకునేవిద్యార్థులుజూలై 2, 2003 – జూలై 1, 2004 మధ్యజన్మించిఉండాలి.
తొమ్మిదోతరగతిలోప్రవేశానికి: పదమూడేళ్లునిండి 14ఏళ్లలోపుఉన్నవారుదరఖాస్తుచేసుకోవచ్చు. తాజాఔత్సాహికులుజూలై 2, 2000- జూలై 1, 2001 మధ్యలోజన్మించిఉండాలి. అంతేకాకతొమ్మిదోతరగతిలోప్రవేశసమయానికిగుర్తింపుపొందినస్కూల్లోఎనిమిదోతరగతిపూర్తిచేసుకోవడంతప్పనిసరి.
అకడమిక్, వయోఅర్హతలతోపాటుమంచిఆరోగ్యంకూడావిద్యార్థులకుఉండాల్సిందే. నోటిఫికేషన్లోపేర్కొన్నప్రమాణాలుఉంటేనేదరఖాస్తుచేసుకోవాలి.

దరఖాస్తుఇలా:
ప్రిన్సిపాల్, సైనిక్స్కూల్, కోరుకొండపేరిటిఎస్బీఐబ్రాంచ్లోచెల్లేలారూ. 475 డీడీ (ఎస్సీ, ఎస్టీలకురూ. 325) తోపాటుసొంతచిరునామాగలకవరునిస్కూల్చిరునామాకుపంపిదరఖాస్తుపొందొచ్చు. నిర్దేశించినరుసుంచెల్లించినమూనాప్రశ్నపత్రాలను, గతేడాదిపరీక్షపత్రాలనుకూడాపొందొచ్చు.
రాతపరీక్షతేదీ:జనవరి 5, 2014.
దరఖాస్తులలభ్యతకుచివరితేదీ:నవంబర్ 30, 2013.
దరఖాస్తులస్వీకరణకుచివరితేదీ:డిసెంబర్ 7, 2013.

వెబ్సైట్: www.sainikschoolkorukonda.org

 
Comments Off on త్రివిధ దళాల్లో కెరీర్కు.. కోరుకొండ, కలికిరి సైనిక్ స్కూళ్లు

Posted by on November 25, 2013 in Uncategorized

 

సేవా సోపాన కొలువు!


* యువతను ఆకర్షిస్తున్న పీఎంఆర్‌డీఎఫ్‌
* రెండో నెల నుంచే రూ.75 వేల జీతం
ఈనాడు – హైదరాబాద్‌: సామాజిక స్పృహ, సేవా భావం, నిమ్న వర్గాల అభ్యున్నతిపై ఆకాంక్ష కలిగినవారికి ఆత్మ సంతృప్తినిచ్చే కొలువొకటి యువతను విశేషంగా ఆకర్షిస్తోంది. నిరుపేదల సమస్యలను పరిష్కరించే విధులే ప్రధానంగా కల ఈ ఉద్యోగంలో వేతనం కూడా ఐదంకెల స్థాయిలో ఉండటం విశేషం. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఈ ఉద్యోగంలో భాగంగా మూడేళ్లపాటు అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ‘ప్రధానమంత్రి గ్రామీణాభివృద్ధి ఫెలో’ (పీఎంఆర్‌డీఎఫ్‌)గా వ్యవహరించే ఇది దేశంలో అత్యున్నతమైన ఫెలో.
34 మంది యువతులూ ఉన్నారు: కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ, కపార్ట్‌, రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌లు కలసి ఈ ఫెలోని నిర్వహిస్తున్నాయి. గత ఏడాది 8,560 మంది యువతీ, యువకులు దరఖాస్తు చేసుకోగా 156 మందిని ఎంపికయ్యారు. ప్రస్తుతం 34 మంది యువతులు సహా 138 మంది 84 జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో గిరిజనులు, పేదల జీవనగతిని మార్చేందుకు పని చేస్తున్నారు.
ఈ ఏడాది 140 మందికి అవకాశం: పీఎంఆర్‌డీఎఫ్‌ కింద తాజాగా మరోసారి 140 మంది నియామకానికి అవకాశం వచ్చింది. దరఖాస్తు చేసుకోవడానికి నవంబరు 30 ఆఖరు తేదీ. 50 శాతం మార్కులతో నాలుగేళ్లు డిగ్రీ చేసినవారు లేదా పీజీ చేసినవారు దీనికి అర్హులు. జనరల్‌ అభ్యర్థులకు వయోపరిమితి 22-27 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు అదనం. దేశంలో 40 కేంద్రాల్లో జరిగే ఆల్‌ ఇండియా కాంపిటెన్సీ అసెస్‌మెంట్‌ పరీక్ష డిసెంబరు 15న జరుగుతుంది. జనవరి 5న జరిగే రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇతర వివరాలకు పీఎంఆర్‌డీఎఫ్‌ వెబ్‌సైట్‌ను పరిశీలించొచ్చు.
పీఎంఆర్‌డీఎఫ్‌ నిర్వర్తించాల్సిన విధులు: పేదలు, పేదల కోసం పనిచేసే సంస్థల సామర్థ్యం పెంపు, వారి హక్కులు పొందేందుకు సాయపడటం.
* స్వయం సహాయక సంఘాలు, పంచాయతీల సాధికారత, సామర్థ్యం పెంపునకు తోడ్పడటం.
* క్షేత్రస్ధాయి ప్రణాళిక రూపకల్పనకు దోహదపడటం.
* ప్రభుత్వం అమలు చేస్తున్న పేదరిక నిర్మూలన కార్యక్రమాల అమలుకు సాయం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సహా అనేక కార్యక్రమాల అమలుకు తోడ్పాటు.
* పేదలను చేరుకోవడం, వారి హక్కులు, వారి కోసం ఉద్దేశించిన పథకాలు అందుకునేందుకు దోహదపడటం, ప్రజాసమస్యల పరిష్కారానికి దోహదపడటం.
ఆకర్షణీయంగా వేతనం: ఓరియంటేషన్‌ సమయం(నాలుగు వారాలు)లో రూ.50 వేలు వేతనంగా చెల్లిస్తారు. అనంతరం మొదటి సంవత్సరం నెలకు రూ.75 వేలు చొప్పున ఇస్తారు. రెండో యేడాది మరో పది శాతం జోడించి వేతనమిస్తారు. మూడో ఏడాది రెండో యేడాది ఇస్తున్నదానికి మరో పది శాతం జత కలిపి ఇస్తారు. ఇంకా ఉచిత రవాణా, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. ఫెలోగా మూడేళ్లు పూర్తి చేసిన అనంతరం గ్రామీణాభివృద్ధి శాఖలో మంచి అవకాశాలు లభిస్తాయని అంచనా. భవిష్యత్తులో పీఎంఆర్‌డీఎఫ్‌ను ఎంఫిల్‌ లేదా ఎంఎస్సీ డిగ్రీగా గుర్తించే అవకాశం ఉంది.
విధులెక్కడ నిర్వహించాలి: ఫెలోగా ఎంపికైనవాళ్లు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 84 జిల్లాల్లో విధులు నిర్వహించాలి. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు జిల్లాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ఛత్తీస్‌గఢ్‌ అడవులు, మల్కన్‌గిరి, గడ్చిరోలి, కుంటి, మయూర్‌భంజ్‌, ముంగేర్‌, సుందర్‌గఢ్‌, సూర్జాపూర్‌, గయ, సోన్‌భద్ర, బాలాఘాట్‌ గర్వాలతోపాటు మన రాష్ట్రంలోని కరీంనగర్‌, ఖమ్మం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, వరంగల్‌ జిల్లాల్లో ఫెలోలు పని చేస్తున్నారు.
ప్రముఖ సంస్థల కొలువులు కాదనుకుని గిరిజన సేవకు: హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ పూర్తి చేశా. విప్రో లాంటి ప్రముఖ సంస్థల్లో అవకాశాలు వచ్చినా కాదనుకున్నా. పీఎంఆర్‌డీఎఫ్‌గా ఎంపికయ్యా.

ప్రస్తుతం ఖమ్మం జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో సంతృప్తిగా విధులు నిర్వహిస్తున్నా. పీసా సహా చట్టాలపై గిరిజనులకు అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నాం. అంతరించిపోతున్న కొండరెడ్లకు అటవీహక్కుల చట్టం ద్వారా కలిగే ప్రయోజనాలను కల్పిస్తున్నాం. మన రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో 12 మంది పీఎంఆర్‌డీఎఫ్‌లు ఉన్నారు.
– జి.సురేష్‌బాబు

 
Comments Off on సేవా సోపాన కొలువు!

Posted by on November 25, 2013 in Uncategorized

 

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికే వేచి చూడొద్దు


* ఖాళీగా ఉంటే అవకాశాలు రావడం కష్టం
* నైపుణ్యాలుంటే ఉపాధికి కొదవలేదు

ఈనాడు – హైదరాబాద్‌: ‘ఏటా దేశంలో 5.50 లక్షల మంది ఇంజినీర్లు ఉత్తీర్ణులవుతుంటే వారిలో సుమారు 1.80 లక్షల మందికి సాఫ్ట్‌వేర్‌ రంగం ఉపాధి కల్పిస్తోంది. మిగిలిన 3.70 లక్షల మంది ఈ రంగంలోనే ఉపాధి కోసం మరుసటి ఏడాది వరకు వేచి చూస్తే మరో 5.50 లక్షల మందితో పోటీ పడాల్సివస్తుంది.

ఇంజనీరింగ్‌, ఎంసీఏ వంటి కోర్సులు పూర్తి చేసి ఐటీ ఉద్యోగం కోసమే ప్రయత్నాలు సాగించేవారు ఈ అంశాన్ని గమనించాలి. ఖాళీగా ఉంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి ప్రయత్నించే బదులు అనుగుణమైన కోర్సులు చేస్తూ, కంపెనీల ప్రాజెక్టుల్లో భాగస్వాములైతే అనుభవం వస్తుంది.. నియామకాల సమయంలో ఇవి ఉపయోగపడతాయి’ అని టెక్‌ మహీంద్రా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సర్వీసెస్‌(ఐరోపా, దక్షిణాసియా) విభాగం అధ్యక్షుడు చెరుకూరి కిరణ్‌ తెలిపారు. ‘ఈనాడు’తో ముఖాముఖిలో అవకాశాలు, నైపుణ్యాలు వంటి పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఆ వివరాలివీ..
తగిన విభాగాన్ని ఎంచుకోవాలి
ఐటీ సేవలు, ఉత్పత్తుల అభివృద్ధి, బిజినెస్‌ ప్రాసెసింగ్‌ అవుట్‌సోర్సింగ్‌(బీపీఓ), టెస్టింగ్‌ సేవలు, హార్డ్‌వేర్‌-నెట్‌వర్కింగ్‌ రంగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. భావ వ్యక్తీకరణ నైపుణ్యం బాగుంటే బీపీఓలో.. ప్రోగ్రామింగ్‌, క్వాంటిటేటివ్‌ (మ్యాథమాటికల్‌) ఆప్టిట్యూడ్‌ మెరుగ్గా ఉంటే ఐటీ ఉత్పత్తుల విభాగంలో.. వ్యక్తీకరణ, ఆత్మవిశ్వాసం, సమస్యల పరిష్కారంలో నైపుణ్యం ఉంటే ఐటీ సేవల విభాగంలో ఉద్యోగానికి ప్రయత్నిస్తే మంచిది. హైదరాబాద్‌(75 కళాశాలలు), విశాఖపట్నం(30), విజయవాడ పరిసరాల్లోని 40 కళాశాలల్లో పాఠ్యాంశాలతో పాటు ఐటీ ఉద్యోగాలకు ఉపయోగపడే ఇలాంటి నైపుణ్యాలు నేర్పించేందుకు కొంత శ్రద్ధ వహిస్తున్నారు. దీంతో ఆయా కళాశాలల్లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలు, గతంలో అక్కడ చదివి ఉద్యోగాల్లో చేరిన వారి ప్రావీణ్యం ఆధారంగా ఐటీ సంస్థలు ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తున్నాయి. చిన్న నగరాలు, పట్టణాల్లోని కళాశాలలో పాఠ్యాంశాలపైనే తప్ప నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి సారించకపోవడం విద్యార్థుల భవితను దెబ్బతీస్తోంది.
ప్రత్యేక నైపుణ్యాలుంటేనే అవకాశాలు
రాష్ట్రంలో 700, తమిళనాడులో 650 వరకు ఇంజినీరింగ్‌ కళాశాలలున్నాయి. ఏటా ఇంజినీరింగ్‌, ఇతర డిగ్రీల్లో ఉత్తీర్ణులయ్యేవారు దక్షిణాది రాష్ట్రాల నుంచే ఎక్కువగా ఉంటున్నారు. ఢిల్లీ, కోల్‌కతా వంటి ప్రాంతాల్లో ఇన్ని కళాశాలలు లేకపోయినా అక్కడి ఉత్తీర్ణుల్లో ఉద్యోగ నైపుణ్యం ఎక్కువ. రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణుల్లో నైపుణ్యం 17 నుంచి 18 శాతం కాగా, తమిళనాడులో అది 12-13 శాతమే. అదే ఢిల్లీ నుంచి వస్తున్నవారిలో 35-40 శాతం ఉంటోంది. నైపుణ్యాలు ఉండవనే కారణంతోనే రాష్ట్రంలోని 250 నుంచి 300 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సంస్థలేవీ ప్రాంగణ నియామకాలకు వెళ్లడం లేదు. అభివృద్ధికి ఉపకరించే ఐటీ సేవలు, ఉత్పత్తి చేయగలిగే ప్రత్యేక నైపుణ్యం(డొమైన్‌) ఉన్నవారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతోంది. ఐఐటీల మాదిరి ఇంజినీరింగ్‌లోనూ రెండో ఏడాది నుంచే విద్యార్థులను ఆయా రంగాల్లోని సంస్థలకు పంపించాలి. కానీ కొన్ని సంస్థలే ఇలా ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పిస్తున్నాయి. కళాశాలల్లో ల్యాబ్‌లను మెరుగుపరిచి, లైవ్‌ ప్రాజెక్ట్‌ అనుభవాన్ని విద్యార్థులకు కల్పిస్తే ప్రయోజనం ఉంటుంది.
ఇతర రంగాల్లోనూ..
రాష్ట్రంలో ఐటీ రంగం 15 శాతానికి పైగా ఉద్యోగాలు కల్పిస్తోంది.. ఎఫ్‌ఎంసీజీ రంగం కూడా 15-16 శాతం వృద్ధితో సాగుతోంది.. ఆరోగ్య సంరక్షణ, లైఫ్‌ సైన్సెస్‌, చమురు-సహజవాయువు, రిటైల్‌, తయారీ రంగాల్లోనూ అవకాశాలున్నాయి. 2015 నాటికి దేశీయ రిటైల్‌ రంగం 900 బిలియన్‌ డాలర్ల(రూ.54,90,000 కోట్లు) స్థాయికి చేరుతుందని అంచనా. ఈ రంగాల్లో ఐటీ వినియోగం పెరుగుతోంది. 2020 నాటికి రిటైల్‌, ఆరోగ్య సంరక్షణ రంగాలు 1.5 ట్రిలియన్‌ డాలర్ల (సుమారు రూ.91,50,000 లక్షల కోట్లు)కు చేరుతాయనే అంచనాలున్నాయి. ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులకు ఉద్యోగం రాకపోతే, ఎంబీఏ చేసి మార్కెటింగ్‌, విక్రయాలు, మానవ వనరులు, వ్యాపారాభివృద్ధి విభాగాల్లో ఉపాధి పొందొచ్చు. ఇన్ని చేసినా 30 శాతం మందికి ఉద్యోగావకావకాశాలు లభించడం కష్టమే.
ఆఫ్‌ క్యాంపస్‌ ఇంటర్వ్యూలను ఎదుర్కొనేందుకు..
అకస్మాత్తుగా కొత్త ప్రాజెక్టులు వచ్చినప్పుడు ఐటీ సంస్థలు ఆఫ్‌ క్యాంపస్‌ నియామకాలు చేపడుతున్నాయి. ఈ ఎంపికల్లో సాంకేతిక స్థాయి, ప్రాబ్లం సాల్వింగ్‌, ఆత్మవిశ్వాసం, భావ వ్యక్తీకరణ, విషయ పరిజ్ఞానం, అభిరుచి(ఆప్టిట్యూడ్‌), ప్రెజెంటేషన్‌ వంటి అంశాలన్నీ గమనిస్తారు. చిన్న పట్టణాల్లో ఉండి వీటిలో ప్రయత్నించడం కంటే హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాలకు వచ్చి మంచి సంస్థల్లో శిక్షణ పొందాలి. సాంకేతిక అంశాల్లో శిక్షణ, అనుభవం వస్తుందనుకుంటే వేతనం లేకున్నా కొన్ని ప్రాజెక్టులకు పనిచేయడం ఉపకరిస్తుంది. లక్ష్యాన్ని ఎంచుకుని స్థిరంగా సాగితే అవకాశాలు పొందడం సులభం.

 

 
Comments Off on సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికే వేచి చూడొద్దు

Posted by on November 25, 2013 in Uncategorized

 

సీడీఎస్‌ఈకి సిద్ధం కండి!


సీడీఎస్‌ఈకి సిద్ధం కండి!

ఉత్సాహవంతులైన యువతీ యువకులకు ఉజ్వలమైన కెరియర్‌ మార్గాన్ని అందించే పరీక్ష కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీస్‌ (సీడీఎస్‌). ఈ పరీక్ష ద్వారా ఆర్మీ, నేవీ, ఏర్‌ఫోర్సుల్లో ఆఫీసర్‌ స్థాయి నియామకాలు పొందవచ్చు. డిగ్రీ పట్టా ఉన్నవారే కాకుండా సాధారణ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ ఫైనలియర్‌ చదువుతున్నవారు కూడా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి వీలుంది!
యూపీఎస్‌సీ జాతీయస్థాయిలో నిర్వహించే ఈ పరీక్షలో విజయానికి అభ్యర్థి వ్యక్తిత్వ స్వభావం, పరిజ్ఞానం, నైపుణ్యం మూడూ ప్రధానమే. ఇండియన్‌ మిలటరీ అకాడమీ/ ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీల్లో ప్రవేశానికి గుర్తింపు పొందిన డిగ్రీ అవసరం. నేవల్‌, ఏర్‌ఫోర్స్‌ అకాడమీల్లో ప్రవేశానికి బిఎస్‌సీ (ఫిజిక్స్‌- మ్యాథ్స్‌)/ బీటెక్‌ అభ్యర్థులు అర్హులు.
ఈ పరీక్ష ద్వారా భర్తీ చేసే మొత్తం పోస్టుల సంఖ్య …
ఇండియన్‌ మిలటరీ అకాడమీ: 250 పోస్టులు
ఇండియన్‌ నేవల్‌ అకాడమీ: 40 పోస్టులు
ఏర్‌ఫోర్స్‌ అకాడమీ: 32 పోస్టులు
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభమైన తేదీ: 2 నవంబర్‌, 2013
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2 డిసెంబర్‌, 2013
పరీక్ష తేదీ: 09 ఫిబ్రవరి, 2014
www.upsc.gov.in (or) www.upsconline.nic.in వెబ్‌సైట్లలో దరఖాస్తు చేసుకోవాలి.
1. రాత పరీక్ష:
మిలిటరీ, నేవల్‌, ఏర్‌ఫోర్స్‌ అభ్యర్థులకు

మొత్తం మార్కులు: 300
2. ఇంటర్వ్య్టూ:
రాత పరీక్షలో అర్హత సాధించినవారికి ఈ పరీక్ష ఉంటుంది. సీడీఎస్‌లో విజయం సాధించడానికి… సుదీర్ఘ సన్నద్ధత, ఏకాగ్రతతో కూడిన సాధన అవసరం. ఆంగ్లం, జనరల్‌ నాలెడ్జ్‌, గణిత సబ్జెక్టుల్లో అభ్యర్థి నైపుణ్యాలను ఇందులో పరీక్షిస్తారు.
ఆంగ్లం: ఈ పేపర్‌ ద్వారా ఆంగ్ల వ్యాకరణం, ఒకాబులరీ, ఇతర అంశాల్లో అభ్యర్థుల పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు.
జనరల్‌ నాలెడ్జ్‌: ఈ పేపర్‌ను సమర్థంగా ఎదుర్కొనడానికి అభ్యర్థులకు జాతీయ, అంతర్జాతీయ వర్తమాన వ్యవహారాలపై అవగాహన తప్పనిసరి. భారతదేశ చరిత్ర, భౌగోళిక సూచనల గురించీ తెలుసుకోవాలి.
ఎలిమెంటరీ మ్యాథ్స్‌: తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలు సాధించేలా సాధన చేయాలి. పదోతరగతి గణితం వరకు చూసుకోగలిగితే మంచిది.

 
Comments Off on సీడీఎస్‌ఈకి సిద్ధం కండి!

Posted by on November 25, 2013 in Uncategorized

 
 
%d bloggers like this: