RSS

ప్రశాంతంగా ఏపీసెట్ – 2013

25 Nov

ప్రశాంతంగా ఏపీసెట్ – 2013

హైదరాబాద్, న్యూస్‌టుడే: రాష్ట్ర అర్హత పరీక్ష (ఏపీసెట్) ఆదివారం (నవంబరు 24) ప్రశాంతంగా ముగిసింది. 27 సబ్జెక్టులకు 1,26,411 మంది దరఖాస్తు చేసుకోగా 98,232 మంది (78 శాతం) అభ్యర్థులు హాజరయ్యారని ఏపీసెట్ సభ్య కార్యదర్శి ప్రొ.రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 12 ప్రాంతీయ కేంద్రాల్లో 208 చోట్ల పరీక్ష జరిగిందన్నారు. 12 మంది యూజీసీ పరిశీలకులు పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించారని పేర్కొన్నారు. నల్లగొండ కేంద్రంలో అత్యధికంగా 84 శాతం అభ్యర్థులు హాజరుకాగా, గుంటూరు కేంద్రంలో అత్యల్పంగా 73 శాతం హాజరు నమోదైందని వివరించారు.

Advertisements
 
Comments Off on ప్రశాంతంగా ఏపీసెట్ – 2013

Posted by on November 25, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: