RSS

Daily Archives: December 1, 2013

ఉద్యోగ నైపుణ్యాల పెంపునకు శిక్షణ


ఉద్యోగ నైపుణ్యాల పెంపునకు శిక్షణ

* దేశవ్యాప్తంగా 50 కేంద్రాల ఏర్పాటు యోచన!
* ఐఈఎస్ ప్రతిపాదన
న్యూఢిల్లీ: రాబోయే పది సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 50 శిక్షణ కేంద్రాలను ప్రారంభించాలని ఇండియా ఎడ్యుకేషన్ సర్వీసెస్ (ఐఈఎస్) డిసెంబరు 1న ప్రతిపాదించింది. ఈ కార్యక్రమం కింద ఇప్పటికే పనిచేస్తున్న వృత్తినిపుణులకు మరింత సునిశిత శిక్షణ నిస్తారు. 3-8 ఏళ్ల ఉద్యోగానుభవం ఉన్న వారికి కార్య నిర్వహణాధికారి స్థాయి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ప్రస్తుతం గుర్‌గావ్‌లో ఐఈఎస్ కేంద్రం ఉంది. త్వరలోనే నోయిడాలో రెండో కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాబోయే పది సంవత్సరాల్లో…సుమారు లక్షమంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ నిస్తారు. ఉద్యోగానికి తగిన అర్హతలు…నైపుణ్యాలు అరుదుగా ఉంటున్నాయి. ఈ వ్యత్యాసం స్పష్టంగా తెలుస్తోంది. తాము 50 శిక్షణ కేంద్రాలను ప్రారంభించి శిక్షణనివ్వడం ద్వారా ఈ వ్యత్యాసాన్ని భర్తీ చేయాలని నిర్ణయించినట్లు ఐఈఎస్ సారథి రాజేష్‌పురి తెలిపారు. ఉద్యోగ నైపుణ్యాలను మరింతగా పెంచుకునేందుకు మేనేజ్‌మెంట్ క్యాక్రమాలను నిర్వహిస్తామని వివరించారు. మానవ వనరులు…మార్కెటింగ్, ఆర్ధిక, సాంకేతిక రంగాల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలుంటాయన్నారు. హెచ్‌టీ మీడియా…అమెరికాకు చెందిన ‘అపోలో గ్లోబల్ ఇన్‌కార్పొరేషన్‌లు సంయుక్తంగా నిర్వహిస్తున్న బ్రిడ్జ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సారథ్యంలో ఈ కేంద్రాలు ఏర్పాటవుతాయి.

Advertisements
 
Comments Off on ఉద్యోగ నైపుణ్యాల పెంపునకు శిక్షణ

Posted by on December 1, 2013 in Uncategorized

 

విద్యతోనే నైతిక సవాళ్లపై విజయం: రాష్ట్రపతి


విద్యతోనే నైతిక సవాళ్లపై విజయం: రాష్ట్రపతి

దొయ్‌ముఖ్ (అరుణాచల్ ప్రదేశ్): విద్యతోనే నైతిక సవాళ్లను సమర్థంగా ఎదుర్కోగలమని, నిజమైన అభివృద్ధినీ సాధించగలమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నొక్కి చెప్పారు. నవంబరు 30న ఇక్కడ రాజీవ్‌గాంధీ విశ్వవిద్యాలయం (గతంలో అరుణాచల్ యూనివర్సిటీ) స్నాతకోత్సవంలో ప్రసంగించారు. ఆర్థికాభివృద్ధి విషయంలో దేశం మంచి ప్రగతి కనబరుస్తున్నా… అభివృద్ధి చెందిన సమాజంగా మాత్రం ఎదగలేదన్నారు. దేశం పట్ల ప్రేమ, విధుల పట్ల నిబద్ధత, మానవత్వం, విలువలతో కూడిన వ్యక్తిత్వం, క్రమశిక్షణ, నిజాయతీ, మహిళల పట్ల గౌరవం లాంటి లక్షణాలను విద్యార్థుల్లో పెంపొందించాల్సి ఉందన్నారు. ఉత్తమ పౌరులను తయారుచేయడంలో విద్యాసంస్థల పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రపంచంలోని తొలి 200 అత్యున్నత విద్యాసంస్థల్లో ఒక్క భారతీయ విశ్వవిద్యాలయంగానీ, విద్యా సంస్థగానీ చోటు సంపాదించలేకపోవడం దిగ్భ్రాంతికి గురిచేస్తోందన్నారు. భారత్ ప్రపంచ శక్తిగా మారుతున్నా, నాణ్యత విషయంలో ఇంకా ఎంతో సాధించాల్సి ఉందన్నారు. మన విద్యార్థులు ఎందుకు విదేశాలకు వెళ్తున్నారు? అక్కడి వారు మన దగ్గరకు వచ్చేలా ఎందుకు చేసుకోలేకపోతున్నాం? ఇందుకోసం మనం విద్య, పరిశోధన రంగాలపై చిత్తశుద్ధితో దృష్టి సారించాల’న్నారు. అరుణాచల్‌ప్రదేశ్ ప్రగతికి గడప లాంటిదని విద్యుత్తు, పర్యటకం లాంటి రంగాలతో ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఎన్నో అవకాశాలు ఉన్న రాష్ట్రమన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, సహజవనరుల నిర్వహణపై రాజీవ్‌గాంధీ విశ్వవిద్యాలయం దృష్టి సారించాలని కోరారు.

 
Comments Off on విద్యతోనే నైతిక సవాళ్లపై విజయం: రాష్ట్రపతి

Posted by on December 1, 2013 in Uncategorized

 
 
%d bloggers like this: