RSS

ఉద్యోగ నైపుణ్యాల పెంపునకు శిక్షణ

01 Dec

ఉద్యోగ నైపుణ్యాల పెంపునకు శిక్షణ

* దేశవ్యాప్తంగా 50 కేంద్రాల ఏర్పాటు యోచన!
* ఐఈఎస్ ప్రతిపాదన
న్యూఢిల్లీ: రాబోయే పది సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 50 శిక్షణ కేంద్రాలను ప్రారంభించాలని ఇండియా ఎడ్యుకేషన్ సర్వీసెస్ (ఐఈఎస్) డిసెంబరు 1న ప్రతిపాదించింది. ఈ కార్యక్రమం కింద ఇప్పటికే పనిచేస్తున్న వృత్తినిపుణులకు మరింత సునిశిత శిక్షణ నిస్తారు. 3-8 ఏళ్ల ఉద్యోగానుభవం ఉన్న వారికి కార్య నిర్వహణాధికారి స్థాయి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ప్రస్తుతం గుర్‌గావ్‌లో ఐఈఎస్ కేంద్రం ఉంది. త్వరలోనే నోయిడాలో రెండో కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాబోయే పది సంవత్సరాల్లో…సుమారు లక్షమంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ నిస్తారు. ఉద్యోగానికి తగిన అర్హతలు…నైపుణ్యాలు అరుదుగా ఉంటున్నాయి. ఈ వ్యత్యాసం స్పష్టంగా తెలుస్తోంది. తాము 50 శిక్షణ కేంద్రాలను ప్రారంభించి శిక్షణనివ్వడం ద్వారా ఈ వ్యత్యాసాన్ని భర్తీ చేయాలని నిర్ణయించినట్లు ఐఈఎస్ సారథి రాజేష్‌పురి తెలిపారు. ఉద్యోగ నైపుణ్యాలను మరింతగా పెంచుకునేందుకు మేనేజ్‌మెంట్ క్యాక్రమాలను నిర్వహిస్తామని వివరించారు. మానవ వనరులు…మార్కెటింగ్, ఆర్ధిక, సాంకేతిక రంగాల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలుంటాయన్నారు. హెచ్‌టీ మీడియా…అమెరికాకు చెందిన ‘అపోలో గ్లోబల్ ఇన్‌కార్పొరేషన్‌లు సంయుక్తంగా నిర్వహిస్తున్న బ్రిడ్జ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సారథ్యంలో ఈ కేంద్రాలు ఏర్పాటవుతాయి.

Advertisements
 
Comments Off on ఉద్యోగ నైపుణ్యాల పెంపునకు శిక్షణ

Posted by on December 1, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: