RSS

Daily Archives: December 2, 2013

హెచ్‌సీయూ ప్రవేశాల్లో కటాఫ్ మార్కులు ఎత్తివేత


ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ తదితర అన్ని కోర్సుల్లో ప్రవేశానికి ఇప్పటివరకు ఉన్న కటాఫ్ మార్కుల పరిమితి విధానాన్ని ఎత్తివేశారు. ఈమేరకు ఇటీవల జరిగిన అకడమిక్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. విశ్వవిద్యాలయంలో డిసెంబరు 2న జరిగిన విలేకరుల సమావేశంలో ఉపకులపతి రామకృష్ణ రామస్వామి, రిజిస్ట్రార్ రాజశేఖర్ ఈ వివరాలు వెల్లడించారు. విశ్వవిద్యాలయంలో 2 వేలకుపైగా సీట్లు ఉన్నాయని, రాత పరీక్ష, ఇంటర్వూల్లో కలిపి కటాఫ్ మార్కుల కారణంగా 15 శాతం సీట్లు మిగిలిపోతున్నాయని చెప్పారు. దీంతో ఆ విధానాన్ని తొలగిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే బోధనా రుసుం కంటే హెచ్‌సీయూలో సుమారు 12 రకాల కోర్సులకు ఫీజు అధికంగా ఉందని, ఆ అధిక ఫీజును ఇప్పటివరకు విద్యార్థులు చెల్లించేవారని తెలిపారు. ఇక నుంచి వాటిని విద్యార్థులు చెల్లించక్కరలేదని చెప్పారు. 2014-15 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు ఈనెల 4న నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామన్నారు. నూతనంగా రెండు పీజీ డిప్లొమా కోర్సులు ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు.

Advertisements
 
Comments Off on హెచ్‌సీయూ ప్రవేశాల్లో కటాఫ్ మార్కులు ఎత్తివేత

Posted by on December 2, 2013 in Uncategorized

 

న్యాయ విద్యార్థులవైపు ‘కార్పొరేట్‌’ చూపు


న్యాయ విద్యార్థులవైపు ‘కార్పొరేట్‌’ చూపు

* జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రాంగణ నియామకాలు
* భారీ ప్యాకేజీలతో రెడ్‌ కార్పెట్‌
ఈనాడు – హైదరాబాద్‌ : ఇన్నాళ్లూ ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సులూ, కళాశాలలకే పరిమితమైన ప్రాంగణ నియామకాలు… ఇప్పుడు లా కాలేజీలకూ విస్తరిస్తున్నాయి. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలతో ఈ ఒరవడి ఇప్పటికే మొదలైంది. దేశ, విదేశీ కార్పొరేట్‌ సంస్థలు ఇక్కడి ప్రమాణాలకు ప్రాధాన్యమిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయి లా కంపెనీలు, బ్యాంకింగ్‌ సంస్థలు… వీటిల్లో కోర్సులు పూర్తిచేసిన వారికి భారీ ప్యాకేజీలిచ్చి ఎగరేసుకుపోయేందుకు క్యూ కడుతున్నాయి!
మన రాష్ట్రంలోని నల్సార్‌ యూనివర్సిటీ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లోకెల్లా అగ్రగామి. తర్వాతి స్థానంలో బెంగళూరు, కోల్‌కత వర్సిటీలున్నాయి. ఏటా ‘నల్సార్‌’ నుంచి వచ్చే 80 మందిలో కొద్దిమంది మినహా మిగతావారంతా కార్పొరేట్‌ కొలువుల్లో చేరిపోతున్నారు. ఇలా ఈ ఏడాది 55 మందికి దేశ, విదేశాలకు చెందిన కంపెనీలు ఆహ్వానం పలికాయి. బ్రిటన్‌కు చెందిన బహుళజాతి లా కంపెనీ లింక్‌ లేటర్స్‌ ఐదుగురిని ఎంపిక చేసుకుంది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, చెన్నై, పూణెలో కార్యాలయాలున్న అమర్‌చంద్‌ మంగల్‌దాస్‌ లా కంపెనీ అత్యధికంగా ఎనిమిది మందిని ఎంపిక చేసుకుంది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, పుణెల్లో కార్యాలయాలున్న ‘ఏజెడ్‌బీ అండ్‌ పార్టనర్స్‌’ ఆరుగురికి అవకాశాలిచ్చింది.
భారీ వేతనాలు
ఈ కంపెనీలన్నీ పెద్దపెద్ద సంస్థల విలీనాలు, భాగస్వామ్యుల వివాదాలు తదితర వ్యవహారాలను చూసేవే. 2014కుగాను బ్రిటన్‌కు చెందిన లింకేలేటర్స్‌, అలెన్‌ అండ్‌ ఓబరీ అనే న్యాయ సంస్థలు… రూ.14.5 లక్షల వార్షిక వేతనంతో 25 మందిని ఎంపిక చేసుకున్నాయి. బేకర్‌ అండ్‌ మెకంజె కంపెనీ అంతర్జాతీయంగా అత్యధికంగా 40 వేల పౌండ్లు చెల్లించేందుకు ముందుకొచ్చింది! నల్సార్‌ నుంచి ఎంపికైనవారి సగటు వేతనం రూ.14.5 లక్షలు. దేశీయంగా ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు, ఐటీసీ, సెబీ, విప్రో తదితర సంస్థలు కూడా ఏటా తమ వద్ద ప్రాంగణ నియామకాలు చేపడుతున్నట్లు నల్సార్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు. ఉన్నత చదువులు, సివిల్‌ సర్వీసెస్‌ వంటి వాటిపై ఆసక్తితో కొందరు ఉద్యోగాల్లో చేరడంలేదు. అయితే ఎంపికైన వారికి కంపెనీలు పలు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నాయి. వ్యాపార వృద్ధి దిశగా మార్కెటింగ్‌, నిర్వహణ విధానాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు వీరి సేవలను పొందుతున్నాయి. ఇలా జర్మనీకి చెందిన డాయిష్‌ బ్యాంకు… ఇప్పటికే నల్సార్‌ను సంప్రదించింది. బ్యాంకింగ్‌లో పెట్టుబడులు, కార్పొరేట్‌ ఫైనాన్స్‌ రంగాల్లో వీరి సేవలను వినియోగించుకునేందుకు ఆసక్తి కనబరుస్తోంది.
ఆసక్తి చూపని సంప్రదాయ కళాశాలలు
ప్రాంగణ నియామకాల పట్ల సంప్రదాయ న్యాయ కళాశాలలు అంతగా ఆసక్తి చూపడంలేదని విమర్శలున్నాయి. ఈ కళాశాలల్లో చదివే విద్యార్థులకూ చక్కటి నైపుణ్యాలున్నాయి. అయితే వీటి గురించి సరైన సమాచారం లేకపోవడంతో… ఆయా సంస్థలు అసలు వీటివైపే చూడటంలేదు. ఒక్కోసారి ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు ఒకట్రెండు ప్రైవేటు కాలేజీల్లో చదివేవారినీ సంస్థలు ఎంపిక చేసుకుంటున్నాయి. సంప్రదాయ న్యాయ కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలు లేకపోవడం, ఈ కాలేజీల్లో విద్యా ప్రమాణాలు అంతగా ఉండవన్న అపవాదు కూడా ప్రాంగణ నియామకాలకు గండికొడుతున్నాయి.
న్యాయ సేవల్లో వీరిదే పైచేయి
న్యాయవ్యవస్థకు సేవలు అందించేవారిలో ఎక్కువమంది సంప్రదాయ కళాశాలల నుంచి వచ్చినవారేనని ఓయూ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ జి.బి.రెడ్డి పేర్కొన్నారు. వీటిల్లో చదివే సగానికిపైగా మంది న్యాయవాద వృత్తిని చేపడుతున్నారు. మేజిస్ట్రేట్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఉద్యోగాలకు తలపడేవారిలోనూ వీరి సంఖ్యే ఎక్కువ. లా చదివిన వారికి అవకాశాలు మెండుగా ఉండటంతో పోటీ కూడా ఎక్కువగానే ఉందంటున్నారాయన. సంప్రదాయ న్యాయ కళాశాలలు తమ విద్యార్థుల నైపుణ్యాల గురించి ప్రచారం చేస్తే… తమ విద్యార్థులకూ కార్పొరేట్‌ సంస్థల్లో మంచి అవకాశాలు వస్తాయంటున్నారు.

 
Comments Off on న్యాయ విద్యార్థులవైపు ‘కార్పొరేట్‌’ చూపు

Posted by on December 2, 2013 in Uncategorized

 

డీఎస్సీ-2012 నియామకాలపై వెలువడని నిర్ణయం


డీఎస్సీ-2012 నియామకాలపై వెలువడని నిర్ణయం

* ఏమీ తేల్చని సీఎం సమీక్ష
ఈనాడు, హైదరాబాద్: డీఎస్సీ-2012 అనుసరించి తొలుత ఎంపిక చేసిన ఉపాధ్యాయుల జాబితాలో మార్పులు, చేర్పులు జరిగి నష్టపోయిన 987 మందికిపైగా అభ్యర్థులకు న్యాయం చేసే విషయమై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి డిసెంబరు 2న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ఆర్థిక, విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు. డీఎస్సీ-2012 తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సమయంలో స్థానిక, స్థానికేతర విధానం అమలుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తర్జనభర్జనల అనంతరం విద్యాశాఖ అధికారులు జాబితాలో మార్పులు చేసినందున ఎంపికైన వారిలో 987 మంది అభ్యర్థుల పేర్లు అదృశ్యమయ్యాయి. వీరికి న్యాయం చేసే విషయమై చాలాకాలంగా విద్యాశాఖలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించినప్పటికీ ఎలాంటి అధికారిక నిర్ణయం జరగలేదని తెలిసింది. ఈ నియామకాలు జరపాలంటే న్యాయపరంగా అనేక సమస్యలు ఉన్నందున ముందుకు వెళ్లలేమన్న విధంగా చర్చలు జరిగినట్లు సమాచారం. చివరికి వీరిని గురుకులాలు, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల్లో ఒప్పంద పద్ధతిలో అయినా చేర్చుకోగలమా అన్న దిశగానూ విద్యాశాఖలో చర్చలు జరుగుతున్నాయి. 2012 నియామకాల గురించి సీఎం స్థాయిలో సమీక్ష జరిగినందున 2013 డీఎస్సీ జారీ, టెట్ నిర్వహణపై స్పష్టత వస్తుందని భావించారు. కానీ, సమావేశంలో ఈ ప్రస్తావనే రాలేదు. టెట్‌కు ఇప్పటికీ తేదీ ఖరారవకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ వారంలో దీనిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

 
Comments Off on డీఎస్సీ-2012 నియామకాలపై వెలువడని నిర్ణయం

Posted by on December 2, 2013 in Uncategorized

 

తెలుగు వెలుగులు.. ఈ చదువు దివ్వెలు


* తెలుగులో పరిశోధనలు
* తెలుగు గొప్పతనాన్ని చాటిన బాసర ట్రిపుల్‌ ఐటీ అధ్యాపకులు

బాసర, న్యూస్‌టుడే: తెలుగును ప్రాధాన్య పాఠ్యాంశంగా ఎంచుకుంటే ఈ పోటీ ప్రపంచంలో వెనుకబడతాం అనుకునేవారికి ఈ యువ అధ్యాపకులే చక్కటి సమాధానం. ఆంగ్లం మోజులో చాలా మంది మాతృభాషను నిర్లక్ష్యం చేస్తున్న ఈ రోజుల్లో దాన్నే తమ ఉన్నతికి సోపానంగా మార్చుకుని ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలుగులో పరిశోధనలు చేసి దాని గొప్పతనాన్ని చాటుతున్న బాసర ట్రిపుల్‌ ఐటీ అధ్యాపకుల గురించి ప్రత్యేక క‌థ‌నం
.
సాహిత్యంలో ‘విజయం

బాసర ట్రిపుల్‌ఐటీలో ఐదేళ్లుగా పనిచేస్తున్న బుక్యా విజయ్‌కుమార్‌ది వరంగల్‌ జిల్లా కురవి మండలం చింతపల్లి. గిరిజన సామాజికవర్గానికి చెందిన ఆయన విద్యాభ్యాసం తెలుగు మాధ్యమంలోనే సాగింది. మహబూబాబాద్‌లో ఇంటర్‌ వరకు చదివిన ఆయన డిగ్రీని ఆంగ్ల మాధ్యమంలో హైదరాబాద్‌లో పూర్తి చేశా రు. అనంతరం రాజధానిలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పీజీ చదివారు. అది పూర్తయిన అనంతరం అక్కడే ఎం.ఫిల్‌ పూర్తి చేశారు. మాతృభాష కాకున్నా, పరిశోధనకు కష్టమైనా తెలుగుపై ఉన్న ఆసక్తితో దాన్ని పీహెచ్‌డీకి ఎంచుకున్నారు. ‘ఆధునిక తెలుగుకథ- మనోవిశ్లేషణ’ అనే అంశంపై చేసిన పరిశోధనకు విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ ప్రదానం చేసింది. ప్రాభవం కోల్పోతున్న తెలుగును కాపాడేందుకు తనవంతు కృషిచేస్తానని, సాహిత్యంలో మంచి పేరు సంపాదించుకుంటానని ఆయన తెలిపారు
.
‘సంగణకం’లో ‘పగడం
‘..
నల్గొండ జిల్లా నకిరెకల్‌కు చెందిన పగడాల గోపాలకృష్ణ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోనే ఎంఏలో మొదటిస్థానంలో నిలిచారు. విద్యాలయం నుంచి బంగారు పతకం సాధించిన ఆయనకు ఎన్నో ఉన్నత ఉద్యోగవకాశాలు వచ్చాయి. అయినా బాషాభిమానంతో ఎంఫిల్‌ పూర్తిచేసి అనంతరం పీహెచ్‌డీ చేశారు. చిన్ననాటి నుంచి తెలుగు మాధ్యమంలో చదివారు. గ్రామీణప్రాంత తెలుగు భాషపై ఉన్న మక్కువ పరిశోధనకు తోడ్పడింది. ‘పదబంధ క్రియలు-పరిశీలన(యంత్ర అనువాద సంబంధాలు)’ అనే అంశంపై గోపాలకృష్ణ చేసిన పరిశోధనకు విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ ప్రదానం చేసింది. ఆయన సంగణకానికి సైతం తెలుగు నేర్పించారు. ‘తెలుగు చందస్సు టూల్‌’ అనే అప్లికేషన్‌ను రూపొందించారు. దీనిని కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసుకుంటే పద్యాలశైలి, వ్యాకరణానికి సంబంధించిన వివరాలను దానంతట అదే తెలియజేస్తుంది. మాతృభాషపై ప్రతి ఒక్కరు మమకారం పెంచుకోవాలని ఆయన అన్నారు. తెలుగు భాషకు ఆజన్మాంతం సేవ చేయాలని ఉందని ఆయన తెలిపారు
.
మొక్కవోని ‘కిరణం

‘తెలుగుభాష నిఘంటువులు-ఆరోపాల అధ్యయనం’ అనే అంశంపై చేసిన పరిశోధనకు ఇటీవల కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ సాధించారు విజయభాను. స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం శివకోడు గ్రామం. చిన్ననాటి నుంచి తెలుగులో ఉన్న అభిమానం ఆమెకు అందులో పీహెచ్‌డీ దక్కేలా చేసింది. తెలుగు అధ్యాపకురాలు కావాలనే లక్ష్యంతో ముందుకుసాగి అనుకున్నది సాధించారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ, ఎం.ఫిల్‌లో ప్రతిభ సాధించిన విజయభాను పీహెచ్‌డీ చేయడానికి ముందు తెలుగు దినపత్రికలలో ‘ఆదానపదాలు-అధ్యయనం’ అనే అంశంపై పుస్తకం రచించారు. పీహెచ్‌డీ పూర్తయిన అనంతరం పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నిఘంటు నిర్మాణ శాఖలో ప్రాజెక్టు ఫెలోగా పనిచేశారు. అనంతరం ట్రిపుల్‌ఐటీలో 2008 నుంచి అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. పరభాష వ్యామోహంలో పడి తెలుగును నిర్లక్ష్యం చేయొద్దని.. ఇతర భాషలను నేర్చుకుంటూ మాతృభాషను కాపాడుకోవాలని ఆమె చెబుతున్నారు.

 
Comments Off on తెలుగు వెలుగులు.. ఈ చదువు దివ్వెలు

Posted by on December 2, 2013 in Uncategorized

 

ఉజ్వల భవితకు ‘కస్తూరిబా’


నిరుపేద చిన్నారుల జీవితాల్లో వెలుగులు
హిందూపురం, న్యూస్‌టుడే: వీరంతా పేద కుటుంబాల్లో పుట్టినవారు. తాము బాగా చదవాలని.. ఉన్నతస్థాయికి ఎదగాలని ఎన్నో ఆశలు.. పేదరికం శాపమై చదువు మధ్యలో మానేసిన పసిమొగ్గలు కూలీలుగా మారుతున్నారు. కొందరు కన్నవారితో కలిసి పనిబాట పడితే.. మరికొందరు తల్లిదండ్రుల సంరక్షణకు దూరమై.. వారి బంధువుల వద్దే ఉండి కాలం వెళ్లదీస్తున్నారు. అలాంటి చిన్నారులకు అండగా నిలుస్తున్నాయి కస్తూరిబా విద్యాలయాలు. చదువు, చక్కటి భోజనం, ఆటపాటలతో నవోదయ విద్యాలయాలకు దీటుగా ఇక్కడి విద్యార్థినులు రాణిస్తున్నారు. ఎంతోమంది పేద విద్యార్థినులకు ఆశ్రయం దొరకడమే కాదు. 6-10వ తరగతి వరకు చక్కటి బోధన సాగుతుండటంతో రెగ్యులర్‌ విద్యార్థులకు దీటుగా వీరు కూడా రాణిస్తున్నారు. ప్రతి మండలంలోనూ పేద విద్యార్థినులకు ఇదో వరంగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ విద్యాసంస్థ, రాజీవ్‌ విద్యామిషన్‌ సంయుక్త పర్యవేక్షణలో జిల్లాలో కస్తురీబా విద్యాలయాలను నెలకొల్పారు. బడి వదిలేసిన బాలికలను అక్కున చేర్చుకొని ఉజ్వలంగా తీర్చిదిద్దే ఆశయం కస్తురిబా విద్యాలయాలది. నియోజకవర్గంలో హిందూపురం, లేపాక్షిలో ప్రభుత్వ భవనాల్లో నడుపుతుండగా చిలమత్తూరులో అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. ఒక్కో పాఠశాలలో 200 మందికి అవకాశం ఉంటోంది. 2008-2009లో జిల్లాలో ఈ పాఠశాలలు ప్రారంభించారు. 6 నుంచి పదోతరగతి వరకు చదివిస్తూ పదోతరగతిలో శతశాతం ఫలితాలు సాధిస్తూ.. ముందుకు సాగుతున్నారు. కొన్ని లోపాలను సరిద్దిదితే నవోదయ తరహా ఫలితాలు ఇక్కడా సాధ్యమేనంటున్నారు గురువులు
.
చేరాలంటే కావాల్సిన అర్హతలు

వివిధ కారణాలతో మధ్యలో చదువు మానేసిన 6-10 తరగతి చదివే విద్యార్థినులు మాత్రమే ఇందులో చేరేందుకు అర్హులు. పిల్లల తల్లిదండ్రులకు తెల్లరంగు రేషన్‌కార్డు ఉoడాలి. పాఠశాల ప్రధానోపాధ్యాయులతో డ్రాపవుట్‌ ధ్రువపత్రం పొందాలి. జిల్లా అధికారులు ఇచ్చిన జాబితాతో గ్రామాల్లో, పట్టణ శివారుల్లో ఉన్న విద్యార్థులను చేరదీసి వారికి చదువు చెబుతారు. ఇక్కడ చేర్పించిన విద్యార్థులకు ఎలాంటి రిజర్వేషన్లు అవసరం లేదు. బడి బయట ఉన్న మధ్యలో చదువు మానిన పిల్లలను గుర్తించి చేర్చుకోవడమే కస్తూరీబా పాఠశాలల లక్ష్యం
.
ఇక్కడి సదుపాయాలివి

విద్యాబోధన, వసతుల కోసం ప్రతినెలా రూ.500లకు పైగా నిర్వాహకులకు చెల్లిస్తారు. ఇక బాలికలకు ఖర్చుల కింద నెలకు 6, 7 తరగతులకు రూ.50లు; 7 ,8, 9 తరగతులకు రూ.70కి పైగా చెల్లిస్తారు. ఏటా సమదుస్తులు, ఓ జత బూట్లు అందజేస్తారు. అక్కడే అన్ని వసతులు ఉండటంతో వారికిదో గురుకులంలా ఉంటోంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రికి భోజనం.. సాయంత్రం స్నాక్స్‌, వారంలో 4రోజులు గుడ్డు, అరటిపండు ఇస్తారు. రాత్రి చదువు తరువాత వసతి ఉంటుంది
.
చక్కటి విద్యాభోదన

రోజూ తెల్లవారగానే లేవడం. ఉదయం 7 గంటల నుంచి 1.30 వరకు, మధ్నాహ్న భోజన విరామం అనంతరం 2.30 నుంచి 4.30 వరకు పాఠశాల నడుస్తుంది. ఆ తరువాత చదవడం, ఉపాధ్యాయులు ఇచ్చిన హోంవర్క్‌ చేస్తారు. పదోతరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఇక్కడి ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు.
చదువు విలువ తెలిసొచ్చింది 
ఇంటిలో సమస్యల వల్ల చదువును మధ్యలో వదిలేయాల్సి వచ్చింది. అమ్మ బెంగళూరులో టైలర్‌ పనికి వెళుతోంది. నేను అమ్మకు తోడుగా ఉండేదాన్ని. ఐదోతరగతి మానేయడంతో అధికారులు గుర్తించి చదువు చెప్పిస్తామంటే అమ్మ చేర్పించింది. ఇక్కడ నాకు పునర్జన్మలా ఉంది
.  -వెన్నెల, సీపీఐ కాలనీ, హిందూపురం
అన్ని సౌకర్యాలు ఉన్నాయి

నాది రామగిరి మండలంలోని మాదాపురం. హిందూపురంలో తాత వాళ్ల దగ్గర ఉంటున్న ఉపాధ్యాయులు గుర్తించి ఆరోతరగతిలో పాఠశాలలో చేర్చుకొన్నారు. చదువుతో పాటు అన్ని సౌకర్యాలు ఉండటంతో ఈ పాఠశాల వదిలి వెళ్లలేకపోతున్నా. ఇక్కడే చక్కగా చదువుకొంటున్నా.- సలీమా, రామగిరి
నా జీవితంలో వెలుగులు తెచ్చారు
మాది నిరుపేద కుటుంబం. అమ్మానాన్నలు పనికి వెళితే గాని పూట గడవడం కష్టం. అందుకే చదువు మానేసి నేను వారికి తోడుగా వెళ్లేదాన్ని. అధికారులు వచ్చి మావాళ్లకు నచ్చజెప్పడంతో బడిలో చేర్పించారు. ఇక్కడ చదువుతో పాటు క్రమశిక్షణ అలవడుతోంది. – స్వాతి, శ్రీకంఠపురం
ప్రత్యేక శిక్షణతోనే మార్పు
చదువు మానేసి మధ్యలో చేరే విద్యార్థులకు మళ్లీ మొదటినుంచి వారికి అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయడం. చదువులో వెనుకబడిన వారికి ప్రత్యేక తరగతులు పెట్టుకొని చదివిస్తున్నాం. చక్కగా చదువుతున్నారు. 2012లో మా పాఠశాల వందశాతం ఫలితాలు సాధించింది.- ప్రవీణ, ఇన్‌ఛార్జి, కస్తూరీబా పాఠశాల

 
Comments Off on ఉజ్వల భవితకు ‘కస్తూరిబా’

Posted by on December 2, 2013 in Uncategorized

 

15-29 ఏళ్ల వయసువారిలో 13.3% మంది నిరుద్యోగులు


 

* కేంద్రకార్మికశాఖసర్వేలోవెల్లడి

 

న్యూఢిల్లీ: దేశంలో 15-29 ఏళ్ల మధ్య ఉన్నవారిలో నిరుద్యోగం 13.3శాతం మేర ఉంది. 2012-13కు సంబంధించి కేంద్ర కార్మిక శాఖ వెలువరించిన ఒక నివేదిక ఈ మేరకు తేల్చింది. ఏ భాష కూడా చదువలేని, రాయలేని వారి (నిరక్షరాస్యులు)లో ఇది చాలా తక్కువగా 3.7% మేర ఉంది. ఉద్యోగాల్లో ఉన్నవారిలోనూ కొందరికి సంబంధిత ఉద్యోగానికి మించిన అర్హతలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. దీనివల్ల వారికున్న విలువైన నైపుణ్యాలను సమాజం నష్టపోతోందని తెలిపింది. బలమైన ఉత్పాదక వృద్ధి రేటును సాధించే అవకాశాన్ని కూడా దేశం కోల్పోతోందని వివరించింది. చండీగఢ్‌లోని మంత్రిత్వశాఖకు చెందిన లేబర్ బ్యూరో.. 2012 అక్టోబర్ నుంచి 2013 మే మధ్య సర్వే నిర్వహించి, ఈ నివేదికను తయారుచేసింది.

 
Comments Off on 15-29 ఏళ్ల వయసువారిలో 13.3% మంది నిరుద్యోగులు

Posted by on December 2, 2013 in Uncategorized

 

AP SET 2013 KEY


apsetkey201302122013

 
Comments Off on AP SET 2013 KEY

Posted by on December 2, 2013 in Uncategorized

 
 
%d bloggers like this: