RSS

తెలుగు వెలుగులు.. ఈ చదువు దివ్వెలు

02 Dec

* తెలుగులో పరిశోధనలు
* తెలుగు గొప్పతనాన్ని చాటిన బాసర ట్రిపుల్‌ ఐటీ అధ్యాపకులు

బాసర, న్యూస్‌టుడే: తెలుగును ప్రాధాన్య పాఠ్యాంశంగా ఎంచుకుంటే ఈ పోటీ ప్రపంచంలో వెనుకబడతాం అనుకునేవారికి ఈ యువ అధ్యాపకులే చక్కటి సమాధానం. ఆంగ్లం మోజులో చాలా మంది మాతృభాషను నిర్లక్ష్యం చేస్తున్న ఈ రోజుల్లో దాన్నే తమ ఉన్నతికి సోపానంగా మార్చుకుని ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలుగులో పరిశోధనలు చేసి దాని గొప్పతనాన్ని చాటుతున్న బాసర ట్రిపుల్‌ ఐటీ అధ్యాపకుల గురించి ప్రత్యేక క‌థ‌నం
.
సాహిత్యంలో ‘విజయం

బాసర ట్రిపుల్‌ఐటీలో ఐదేళ్లుగా పనిచేస్తున్న బుక్యా విజయ్‌కుమార్‌ది వరంగల్‌ జిల్లా కురవి మండలం చింతపల్లి. గిరిజన సామాజికవర్గానికి చెందిన ఆయన విద్యాభ్యాసం తెలుగు మాధ్యమంలోనే సాగింది. మహబూబాబాద్‌లో ఇంటర్‌ వరకు చదివిన ఆయన డిగ్రీని ఆంగ్ల మాధ్యమంలో హైదరాబాద్‌లో పూర్తి చేశా రు. అనంతరం రాజధానిలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పీజీ చదివారు. అది పూర్తయిన అనంతరం అక్కడే ఎం.ఫిల్‌ పూర్తి చేశారు. మాతృభాష కాకున్నా, పరిశోధనకు కష్టమైనా తెలుగుపై ఉన్న ఆసక్తితో దాన్ని పీహెచ్‌డీకి ఎంచుకున్నారు. ‘ఆధునిక తెలుగుకథ- మనోవిశ్లేషణ’ అనే అంశంపై చేసిన పరిశోధనకు విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ ప్రదానం చేసింది. ప్రాభవం కోల్పోతున్న తెలుగును కాపాడేందుకు తనవంతు కృషిచేస్తానని, సాహిత్యంలో మంచి పేరు సంపాదించుకుంటానని ఆయన తెలిపారు
.
‘సంగణకం’లో ‘పగడం
‘..
నల్గొండ జిల్లా నకిరెకల్‌కు చెందిన పగడాల గోపాలకృష్ణ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోనే ఎంఏలో మొదటిస్థానంలో నిలిచారు. విద్యాలయం నుంచి బంగారు పతకం సాధించిన ఆయనకు ఎన్నో ఉన్నత ఉద్యోగవకాశాలు వచ్చాయి. అయినా బాషాభిమానంతో ఎంఫిల్‌ పూర్తిచేసి అనంతరం పీహెచ్‌డీ చేశారు. చిన్ననాటి నుంచి తెలుగు మాధ్యమంలో చదివారు. గ్రామీణప్రాంత తెలుగు భాషపై ఉన్న మక్కువ పరిశోధనకు తోడ్పడింది. ‘పదబంధ క్రియలు-పరిశీలన(యంత్ర అనువాద సంబంధాలు)’ అనే అంశంపై గోపాలకృష్ణ చేసిన పరిశోధనకు విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ ప్రదానం చేసింది. ఆయన సంగణకానికి సైతం తెలుగు నేర్పించారు. ‘తెలుగు చందస్సు టూల్‌’ అనే అప్లికేషన్‌ను రూపొందించారు. దీనిని కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసుకుంటే పద్యాలశైలి, వ్యాకరణానికి సంబంధించిన వివరాలను దానంతట అదే తెలియజేస్తుంది. మాతృభాషపై ప్రతి ఒక్కరు మమకారం పెంచుకోవాలని ఆయన అన్నారు. తెలుగు భాషకు ఆజన్మాంతం సేవ చేయాలని ఉందని ఆయన తెలిపారు
.
మొక్కవోని ‘కిరణం

‘తెలుగుభాష నిఘంటువులు-ఆరోపాల అధ్యయనం’ అనే అంశంపై చేసిన పరిశోధనకు ఇటీవల కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ సాధించారు విజయభాను. స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం శివకోడు గ్రామం. చిన్ననాటి నుంచి తెలుగులో ఉన్న అభిమానం ఆమెకు అందులో పీహెచ్‌డీ దక్కేలా చేసింది. తెలుగు అధ్యాపకురాలు కావాలనే లక్ష్యంతో ముందుకుసాగి అనుకున్నది సాధించారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ, ఎం.ఫిల్‌లో ప్రతిభ సాధించిన విజయభాను పీహెచ్‌డీ చేయడానికి ముందు తెలుగు దినపత్రికలలో ‘ఆదానపదాలు-అధ్యయనం’ అనే అంశంపై పుస్తకం రచించారు. పీహెచ్‌డీ పూర్తయిన అనంతరం పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నిఘంటు నిర్మాణ శాఖలో ప్రాజెక్టు ఫెలోగా పనిచేశారు. అనంతరం ట్రిపుల్‌ఐటీలో 2008 నుంచి అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. పరభాష వ్యామోహంలో పడి తెలుగును నిర్లక్ష్యం చేయొద్దని.. ఇతర భాషలను నేర్చుకుంటూ మాతృభాషను కాపాడుకోవాలని ఆమె చెబుతున్నారు.

Advertisements
 
Comments Off on తెలుగు వెలుగులు.. ఈ చదువు దివ్వెలు

Posted by on December 2, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: