ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం నిర్వహించే ఏడాది కాలపరిమితి గల పీజీ డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్ డిసెంబరు 3న విడుదలైంది. మొత్తం 14 కోర్సులను అందిస్తున్నామని, దరఖాస్తుల సమర్పణకు జనవరి 31 తుది గడువని సంచాలకుడు ఆచార్య షేక్ జిలానీ తెలిపారు. మరిన్ని వివరాలకు హెచ్సీయూ వెబ్సైట్ www.uohyd.ac.in ద్వారా లేదా 040-24600264కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు.
Advertisements