RSS

ప్రపంచ విద్యా సర్వేలో ఆసియాదే అగ్రస్థానం

04 Dec

పారిస్‌: విద్యపై నిర్వహించిన ప్రపంచ సర్వేలో ఆసియా దేశాల తమ స్థానాలను పదిలపరచుకున్నాయి. గణితం, సైన్స్‌, పఠనంలో పశ్చిమ దేశాల విద్యార్థులతో పోలిస్తే ఆసియా దేశాల విద్యార్థులు ముందంజలో ఉన్నారు. ఈ మూడు విభాగాల్లోనూ షాంఘై అగ్రస్థానంలో ఉంది. పారిస్‌కు చెందిన ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసీడీ).. 65 దేశాల్లోని దాదాపు 50 లక్షల మంది విద్యార్థులపై సర్వే నిర్వహించి ఈ నివేదికను తయారుచేసింది. ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలపై ఇదే అతిపెద్ద సర్వే. ఇందులో 15 ఏళ్ల విద్యార్థులను పరిశీలించారు.
గణిత నైపుణ్యం విషయంలో సింగపూర్‌, హాంకాంగ్‌, తైవాన్‌, దక్షిణ కొరియాలు ఆధిపత్యాన్ని చాటాయి. చివరిసారిగా 2009లో వచ్చిన నివేదికలోనే మంచి పనితీరును కనబరచిన షాంఘై, హాంకాంగ్‌, సింగపూర్‌లు ఈసారి తమ పనితీరును మరింత మెరుగుపరచుకున్నాయి. విద్య, ఉపాధ్యాయ శిక్షణకు సంబంధించి బలమైన సంస్కృతిని కలిగి ఉండటం వల్లే ఆసియా దేశాలు మెరుగైన స్థానాలను సంపాదించుకున్నాయని ఓఈసీడీ నిపుణులు చెప్పారు. గత సర్వేతో పోలిస్తే ఈసారి ఇటలీ, పోలాండ్‌, పోర్చుగల్‌లు తమ స్థితిని మెరుగుపరచుకున్నాయి. స్వీడన్‌, ఫిన్లాండ్‌, అమెరికాల స్థానాలు దిగజారాయి. మూడు విభాగాల్లోనూ పెరు చివరిస్థానంలో ఉంది.

Advertisements
 
Comments Off on ప్రపంచ విద్యా సర్వేలో ఆసియాదే అగ్రస్థానం

Posted by on December 4, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: