RSS

సంక్రాంతికి ఐయూసీ సేవలు..!

04 Dec

* జేఎన్‌టీయూకేలో ఏర్పాటుకు చురుగ్గా సన్నాహాలు
ఈనాడు, కాకినాడ: అధ్యాపకులు, ఉపాధ్యాయుల్లో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడానికి దేశంలో మొట్టమొదటిసారిగా మంజూరైన ఇంటర్‌ యూనివర్సిటీ సెంటర్‌ (ఐయూసీ)ను.. జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం కాకినాడ (జేఎన్‌టీయూకే)లో ఏర్పాటు చేయడానికి చురుగ్గా సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే సంక్రాంతి నుంచి దీని సేవలు అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నారు. ఈ ఇంటర్‌ యూనివర్సిటీ సెంటర్‌కు అయిదేళ్లకు గాను యూజీసీ రూ.300 కోట్ల నిధులను కేటాయించింది. దీనికి జేఎన్‌టీయూకేలోనే అయిదెకరాల స్థలాన్ని కేటాయించారు. మౌలిక సదుపాయాలు కల్పించేంత వరకు తాత్కాలికంగా దీనికి వర్సిటీలోనే ఒక భవనాన్ని సమకూర్చారు. సిబ్బందిని కూడా నియమించారు. ఇది పూర్తిగా జేఎన్‌టీయూకే ఆధ్వర్యంలోనే నడుస్తుంది. ఇలాంటి ఇంటర్‌ యూనివర్సిటీ సెంటర్లు దేశంలో ఏడు ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి ఒక్కో రంగానికి సంబంధించినవి. న్యూఢిల్లీలో న్యూక్లియర్‌ సైన్స్‌, పుణేలో ఆస్ట్రానమీ, ఆస్ట్రో ఫిజిక్స్‌, ఇండోర్‌లో కన్సార్టియర్‌ ఫర్‌ సైంటిఫిక్‌ రీసెర్చి, న్యూఢిల్లీలో కన్సార్టియమ్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ కంమ్యూనికేషన్‌, గుజరాత్‌లో ఇన్ఫర్మేషన్‌, లైబ్రరీ నెట్‌వర్క్‌ సెంటర్‌, హైదరాబాద్‌ ఉస్మానియా వర్సిటీలో ఇంటర్నేషనల్‌ స్టడీస్‌, బెంగళూర్‌లోనేక్‌ ఇంటర్‌ యూనివర్సిటీ సెంటర్లు ఉన్నాయి.

 
Comments Off on సంక్రాంతికి ఐయూసీ సేవలు..!

Posted by on December 4, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: