RSS

29న టెట్‌?

04 Dec

ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహించేందుకు ఎట్టకేలకు సన్నాహాలు మొదలయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం డిసెంబరు 29న టెట్‌ నిర్వహించేందుకు అనుమతి కోరుతూ విద్యాశాఖ సంచాలకుడు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు. 4.5 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకొన్నారు. 22న పరీక్ష జరపాలని తొలుత నిర్ణయించినా అభ్యర్థులకు సమయం సరిపోదనీ, అందుకు 29 అనుకూలమని భావించారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే అధికారికంగా ప్రకటిస్తారు. జనవరి 11న ఫలితాలు వెల్లడించే అవకాశాలున్నాయి. టెట్‌ అంశంపై డిసెంబరు 3న మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి అధికారులతో సమీక్షించారు. అనంతరం ఈ ప్రతిపాదనలు తయారు చేశారు. టెట్‌ నిర్వహించనున్నందున డీఎస్సీ 2013 కూడా జారీ చేయాల్సి ఉంది. కానీ, స్థానిక, స్థానికేతర విధానంలో నియామకాలు జరపాల్సి ఉన్నందున ప్రకటన విడుదల చేసేందుకు సంశయిస్తున్నారు.

 
Comments Off on 29న టెట్‌?

Posted by on December 4, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: