RSS

Daily Archives: December 7, 2013

ఆరు వారాల్లోగా ఆ ఖాళీలు భర్తీ చేయండి: టీచర్ పోస్టులపై హైకోర్టు ఆదేశం


ఆరు వారాల్లోగా ఆ ఖాళీలు భర్తీ చేయండి: టీచర్ పోస్టులపై హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను ఆరు వారాల్లో భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు అమలు చేయలేదని పేర్కొం టూ ఎయిడెడ్ సంస్కృత పాఠశాలల యాజమాన్యాల సంఘం కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. దీంతో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ రాజేశ్వర్ తివారీ కోర్టుకు హాజరై, నోటిఫికేషన్ వెలువరించామని, భర్తీ ప్రక్రియ ముగిసేందుకు 45 రోజులు పడుతుందని నివేదించారు.

Advertisements
 
Comments Off on ఆరు వారాల్లోగా ఆ ఖాళీలు భర్తీ చేయండి: టీచర్ పోస్టులపై హైకోర్టు ఆదేశం

Posted by on December 7, 2013 in Uncategorized

 

ఆరు లక్షల మంది అధ్యాపకుల కొరత: పల్లంరాజు


జంషెడ్‌పూర్: దేశంలో ఉపాధ్యాయుల కొరత ఉందని కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి ఎం.ఎం.పల్లం రాజు తెలిపారు. దేశవ్యాప్తంగా ఆరు లక్షల మంది అధ్యాపకులకు కొరత ఉందని డిసెంబరు 7న ఇక్కడ విలేకరులకు ఆయన వెల్లడించారు. నాణ్యమైన విద్యను అందించాలన్నదే లక్ష్యమనీ… అందుకే ఉపాధ్యాయుల కొరత సమస్యను పరిష్కరించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామని మంత్రి వివరించారు. విద్యాహక్కు చట్టం ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న వార్తలను గురించి ప్రస్తావించినప్పుడు… ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రాథమిక వసతుల కల్పన, బడిలో పిల్లల నమోదు, నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేవడం విషయంలో ప్రగతి సాధించినట్లు ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విద్యాహక్కు చట్టం అమలు మొదలైనప్పటి నుంచీ ఈ దిశగా ముందడుగు వేస్తున్నట్లు తెలిపారు.

 
Comments Off on ఆరు లక్షల మంది అధ్యాపకుల కొరత: పల్లంరాజు

Posted by on December 7, 2013 in Uncategorized

 

కేజీబీవీల్లో ఖాళీల భర్తీకి చర్యలు


విజ‌య‌న‌గ‌రం (తెర్లాం) : రాష్ట్రంలో ఉన్న 743 కస్తూర్భాగాంధీ విద్యాలయాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కె.జి.బి.వి. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీనివాసరావు చెప్పారు. డిసెంబ‌రు 6న‌ బొబ్బిలిలోని కె.జి.బి.వి. విద్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. 743 కె.జి.బి.వి.లలో 1.30 లక్షల మంది బాలికలు చదువుతున్నారని, 300లకుపైగా పాఠశాలలకు సొంత భవనాలు ఉన్నాయని, మిగిలిన పాఠశాలల్లో 13 మినహా మిగిలిన పాఠశాలలకు సొంత భవనాల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు తగు చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.

 
Comments Off on కేజీబీవీల్లో ఖాళీల భర్తీకి చర్యలు

Posted by on December 7, 2013 in Uncategorized

 

29న యూజీసీ నెట్‌ పరీక్ష


తిరుపతి (పశువైద్య విశ్వవిద్యాలయం), న్యూస్‌టుడే: యూజీసీ నెట్‌ పరీక్షను డిసెంబరు 29న తిరుపతి కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు కో-ఆర్డినేటర్‌ ఫ్రొ.బుద్ధుడు తెలిపారు. తిరుపతి కేంద్రంగా ఎంచుకొన్న అభ్యర్థులకు ఎస్వీయూ, తితిదే విద్యాసంస్థలకు చెందిన 8 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందని ఆయన వివరించారు. కేంద్రాల వివరాలను ఎస్వీయూ వెబ్‌సైట్‌ పొందుపరిచినట్లు ఆయన వివరించారు.

 
Comments Off on 29న యూజీసీ నెట్‌ పరీక్ష

Posted by on December 7, 2013 in Uncategorized

 

ఎయిడెడ్‌’లో సంస్కృత ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు


‘ఎయిడెడ్‌’లో సంస్కృత ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు

* హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వ నివేదన
ఈనాడు, హైదరాబాద్: ఎయిడెడ్ పాఠశాలల్లో సంస్కృత బోధకుల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం డిసెంబరు 6న హైకోర్టుకు విన్నవించింది. దీంతో పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వానికి తగిన వెసులుబాటు కల్పిస్తూ కోర్టు తదుపరి విచారణను ఆరువారాలకు వాయిదా వేసింది.
రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలల్లో సంస్కృత ఉపాధ్యాయ ఖాళీలను భర్తీచేయడానికి అనుమతిచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ప్రకాశం జిల్లాకు చెందిన ‘ఎయిడెడ్ సంస్కృత స్కూల్స్ మేనేజ్‌మెంట్ ఆసోసియేషన్’ ముఖ్య కార్యనిర్వాహక సమన్వయకర్త జె.వెంకటేశ్వర్లు, మరొకరు 2012లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి ఎయిడెడ్ సంస్థల్లో సగం వరకు సంస్కృత ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని.. లేదా ఆయా సంస్థలే ఖాళీలను భర్తీ చేసుకునేలా అనుమతివ్వాలని.. ఈ వ్యవహారం మొత్తం మూడు నెలల్లో పూర్తి చేయాలని పేర్కొంటూ గతేడాది డిసెంబర్ 4న మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులు అమలుకాకపోవడంతో పిటిషనర్లు ఈ ఏడాది మార్చిలో కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గత వారం విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి కోర్టు ఆదేశాల్ని అమలు చేయనందుకు మాధ్యమిక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిపై అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన విచారణకు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి హాజరై.. పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, 45 రోజుల గడువివ్వాలని అభ్యర్థించగా న్యాయస్థానం అనుమతించింది. మరోవైపు ఎయిడెడ్ పాఠశాలల్లో 65 సంస్కృత ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసింది.

 
Comments Off on ఎయిడెడ్‌’లో సంస్కృత ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు

Posted by on December 7, 2013 in Uncategorized

 

టెట్‌పై ప‌ట్టు సాధిస్తే.. డీఎస్సీ సులువే!


టెట్‌పై ప‌ట్టు సాధిస్తే.. డీఎస్సీ సులువే! * సామర్థ్యంపైనే ప్రతిభ
* మారిన టెట్‌ స్వరూపంతో ప్రత్యేక దృష్టి అవ‌సరం
విషయ అవగాహన.. లోతైన అధ్యయనం.. అనువర్తన విధానం టెట్‌లో(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) అభ్యర్థులకు విజయ సోపానాలు. పరీక్ష స్వరూపంలోనూ మార్పులు చోటు చేసుకోవడంతో పూర్తిగా విద్యార్థి అవగాహనపైనే రాతపరీక్ష ఉంటుంది. అభ్యర్థి సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలుంటున్నాయని గత ప్రశ్నపత్రాలను బట్టి తేటతెల్లమవుతోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు పరీక్షకు సిద్ధమయ్యే విధానంలో మార్పులు రావాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అర్హత లేకపోయినా అవగాహన కోసం కొందరైతే.. డీఎస్సీలో వెయిటేజీ మార్కుల కోసం ఇంకొందరు ఇలా టెట్‌ పరీక్షను రాస్తున్నారు. అందుకే అభ్యర్థుల మధ్య పోటీ అధికమవుతోంది. పరీక్షకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులకు తక్కువ వ్యవధి ఉన్న నేపథ్యంలో నిపుణుల సూచనలు, సలహాలు అందిస్తున్నాం..
పరీక్ష ఎదుర్కొనడమే తరువాయి..
పాత విధానంలోనే డీఎస్సీ నిర్వహణతో టెట్‌ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) తప్పనిసరైంది. ఇప్పటికి మూడుసార్లు టెట్‌ నిర్వహించారు. సెప్టెంబరు ఒకటిన నాలుగో విడతగా నిర్వహించేందుకు సిద్ధమైనా సమ్మె ప్రభావంతో నిలిచిపోయిన విషయం విదితమే. డిసెంబరు చివ‌రివారంలో లేదా జనవరి మొదటివారంలో నిర్వహిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు కథనాలు వస్తున్నాయి. అధికారికంగా తేదీలు ఖరారు కావాల్సి ఉంది.
బీఎడ్‌కు అర్హత లభించేనా..?
టెట్‌లో అర్హత సాధించ‌ని అభ్యర్థులు జిల్లాల‌వారీగా చాలామంది ఉన్నారు. ఇప్పటికే టెట్‌ ఉత్తీర్ణులైన వారు ఇంకా అధిక మార్కులు సాధించే ప్రయత్నంలో పోటీపడుతున్నారు. ఇలా ఫ్రెషర్స్‌ (కొత్త వారు), అధిక మార్కులు సాధించిన వారి మ‌ధ్య ఉత్తీర్ణత సాధించని వారు తక్కువ వ్యవధిలో విజయావకాశాలకు శ్రమించాల్సి ఉంది. ఈ ఏడాది అర్హతపరీక్షలు పూర్తయినందున డీఎడ్‌తో పాటు బీఎడ్‌ అభ్యర్థులు అర్హత పొందే అవకాశముంది. వీరికి అవకాశం కల్పించే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
అభ్యర్థుల ఇబ్బందులు
* సిలబస్‌ స్థాయిలో కాఠిన్యత అభ్యర్థులకు కొంత నష్టం తెచ్చిపెడుతోంది. నిర్ధేశించిన సిలబస్‌ ఇవ్వడం లేదు. 2012 జనవరిలో నిర్వహించిన టెట్‌లో అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వచ్చింది.
* భాషా పండితులు, పాఠశాల సహాయకుల్లో తెలుగు, బయాలజీ సబ్జెక్టులకు టెట్‌ అర్హత సాధించే విషయంలో నష్టపోతున్నారు. వారికి సంబంధంలేని సాంఘికశాస్త్రం సబ్జెక్టుల్లో పరీక్ష రాయాల్సి రావడమే కారణం.
* అర్హత పరీక్షలో కటాఫ్‌ మార్కులపై అభ్యర్థుల్లో అసంతృప్తి ఉంది. ఓసీ కేటగిరీకి 90 మార్కులు నిర్ధేశించడంతో ఎక్కువమంది తప్పుపడుతున్నారు.
* గత డీఎస్సీలో కూడా సమయాభావంతో కొత్త సిలబస్‌తోనే అభ్యర్థులు నష్టపోయిన పరిస్థితి ఉంది. 2012 డీఎస్సీ నాటికే 6, 7 తరగతుల పాఠ్య పుస్తకాలు మారిపోవడంతో ప్రస్తుత విద్యాసంవత్సరంలో 4, 5,8, 9 తరగతుల పాఠ్యపుస్తకాలు మారాయి. దీంతో సిలబస్‌పై స్పష్టత రావాల్సి ఉందని అభ్యర్థులు సూచిస్తున్నారు.
విషయ అవగాహనకు ప్రాధాన్యం
– టి.రమేష్‌, పేపరు-1 విజ‌య‌న‌గ‌రం జిల్లా అధిక మార్కుల విజేత
* పేపరు-1లో ఆంగ్లం, సైకాలజీల్లో అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు.
* గ్రామీణ వాతావరణం కావడంతో ఆంగ్లంపై పట్టు సాధించాలి. గ్రామర్‌ అంశాలపైనే ఎక్కువ మార్కులుంటాయి. పదో తరగతి స్థాయి వరకు చదవాలి.
* సైకాలజీకి సంబంధించి విషయ అవగాహనకు ప్రాధాన్యమిస్తున్నందున అకాడమీ పాఠ్య పుస్తకాలకు ప్రాధాన్యమివ్వాలి. పాఠ్యాంశాలపై లోతైన అధ్యయనం అవసరం. అభ్యసనం, ప్రజ్ఞ, మూర్తిమత్వం, అభిరుచులు-సామర్థ్యాలు, పెరుగుదల వికాసం అంశాలపై ప్రత్యేకదృష్టి అవసరం.
* తెలుగు సబ్జెక్టుకు పదోతరగతి వరకు కవిపరిచయాలుతో పాటు వ్యాకరణం, సాహిత్య అంశాలను బాగా చదవాలి. పాఠశాల స్థాయి పుస్తకాలతో పాటు అదనపు పుస్తకాలు చదవాల్సి ఉంది.
* గణితం, సాంఘికశాస్త్రం, సైన్స్‌ సబ్జెక్టులకు నిర్ధేశించినవిధంగా ఎనిమిదో తరగతి వరకు ఇస్తున్నారు. పదో తరగతి స్థాయి వరకు చదవడంతో మంచి మార్కులు సాధ్యమవుతాయి.
* గణితంలో క్షేత్ర, రేఖా, వ్యాపార గణితం సైన్స్‌ అంశాల్లో జీవశాస్త్రం, భౌతికశాస్త్ర అంశాలు, సాంఘికంలో చరిత్ర, భూగోళ శాస్త్ర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
విశ్లేషణ అవసరం
– మాడుగుల రమణ, పేపరు-2 (సాంఘికశాస్త్రం), 114 మార్కులు
పేపరు-2లో కంటెంట్‌ ఎక్కువ చదువుకోవాలి. కంటెంట్‌లోనే సాధించిన మార్కులు విజయావకాశాలను ప్రభావితం చేస్తాయి. సాంఘికశాస్త్రంలో ఏపీ భూగోళశాస్త్రం, ప్రపంచచరిత్ర అంశాలపై ప్రత్యేకసాధన అవసరం. ఆంగ్లం, తెలుగు సబ్జెక్టుల్లో వ్యాకరణానికి సంబంధించి కొత్త పదాలు, వాక్య నిర్మాణాలుంటున్నాయి. పాఠ్య పుస్తకాలను బాగా సాధన చేయాలి. మొత్తంగా పేపరులో ఆలోచించే విధానంపై ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. దీనివలన పాఠ్యాంశాలపై విశ్లేషణ అవసరం.
పాత సిలబస్‌లోనే..
-గోపి, కరస్పాండెంట్‌, జ్ఞానజ్యోతి శిక్షణ కేంద్రం
ప్రకటనలో పేర్కొన్నవిధంగా సిలబస్‌ ఉంటుంది. సెప్టెంబరులో జరగాల్సిన ప్రకటనకు పాత సిలబస్‌నే నిర్ధేశించారు. అభ్యర్థులు పాతసిలబస్‌ ప్రకారమే ప్రిపేరవ్వాలి. మారిన సబ్జెక్టులు చదవవలసిన అవసరం లేదు. కరెంట్‌ ఈవెంట్స్‌ అంశాలు ప్రకటన తేదీ నుంచి చదవాల్సి ఉంటుంది.
వర్తమాన అంశాలకు ప్రాధాన్యం
– శ్రీనివాసరావు, కరస్పాండెంట్‌, శ్రీశ్రీ శిక్షణ కేంద్రం
పాఠ్యాంశాలపై లోతైన అధ్యయనంతో అభ్యర్థులు ముందుకు సాగాలి. కాన్సెప్ట్‌ బేస్‌డ్‌గా చదువుకోవాలి. సబ్జెక్టు అంశాలకు వర్తమాన అంశాలను జోడించి చదవడం ద్వారా ఎక్కువ మార్కులు పొందవచ్చు. ప్రాథమికస్థాయిలోనే పుస్తకాలను చక్కగా అధ్యయనం చేయాలి. అడకమిక్‌ పుస్తకాలకే ప్రాధాన్యం ఇవ్వాలి.

 
Comments Off on టెట్‌పై ప‌ట్టు సాధిస్తే.. డీఎస్సీ సులువే!

Posted by on December 7, 2013 in Uncategorized

 
 
%d bloggers like this: