విజయనగరం (తెర్లాం) : రాష్ట్రంలో ఉన్న 743 కస్తూర్భాగాంధీ విద్యాలయాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కె.జి.బి.వి. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీనివాసరావు చెప్పారు. డిసెంబరు 6న బొబ్బిలిలోని కె.జి.బి.వి. విద్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. 743 కె.జి.బి.వి.లలో 1.30 లక్షల మంది బాలికలు చదువుతున్నారని, 300లకుపైగా పాఠశాలలకు సొంత భవనాలు ఉన్నాయని, మిగిలిన పాఠశాలల్లో 13 మినహా మిగిలిన పాఠశాలలకు సొంత భవనాల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు తగు చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.
Advertisements