RSS

ఆరు లక్షల మంది అధ్యాపకుల కొరత: పల్లంరాజు

07 Dec

జంషెడ్‌పూర్: దేశంలో ఉపాధ్యాయుల కొరత ఉందని కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి ఎం.ఎం.పల్లం రాజు తెలిపారు. దేశవ్యాప్తంగా ఆరు లక్షల మంది అధ్యాపకులకు కొరత ఉందని డిసెంబరు 7న ఇక్కడ విలేకరులకు ఆయన వెల్లడించారు. నాణ్యమైన విద్యను అందించాలన్నదే లక్ష్యమనీ… అందుకే ఉపాధ్యాయుల కొరత సమస్యను పరిష్కరించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామని మంత్రి వివరించారు. విద్యాహక్కు చట్టం ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న వార్తలను గురించి ప్రస్తావించినప్పుడు… ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రాథమిక వసతుల కల్పన, బడిలో పిల్లల నమోదు, నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేవడం విషయంలో ప్రగతి సాధించినట్లు ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విద్యాహక్కు చట్టం అమలు మొదలైనప్పటి నుంచీ ఈ దిశగా ముందడుగు వేస్తున్నట్లు తెలిపారు.

 
Comments Off on ఆరు లక్షల మంది అధ్యాపకుల కొరత: పల్లంరాజు

Posted by on December 7, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: