RSS

Daily Archives: December 8, 2013

సమాజ సంక్షేమానికి యువత కృషిచేయాలి: రాష్ట్రపతి


శాంతినికేతన్: మానవాళి సంక్షేమమే యువతకు అత్యంత ప్రాధాన్య లక్ష్యం కావాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. పశ్చిమబెంగాల్‌లోని విశ్వభారతి విశ్వవిద్యాలయ 48వ స్నాతకోత్సవంలో డిసెంబరు 7న ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ీదేశం నీకేం చేస్తుందని కాదు.. దేశానికి నువ్వేం చేయగలవో నిన్ను నీవు ప్రశ్నించుకో’ అన్న అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్.ఎఫ్.కెనడీ మాటలను గుర్తు చేశారు. అందరం సమాజం నుంచి ఎదిగినవారమే కాబట్టి సమాజం కోసం పాటుపడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అనంతరం రాష్ట్రపతి ముర్షీదాబాద్ జిల్లాలోని అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) విద్యార్థులతో ముచ్చటించారు. ఏఎంయూ కేవలం ఒక వర్గం వారికేనన్న భావన తొలగాలని, ఎవరైనా ఇక్కడ విద్యాభ్యాసం చేయొచ్చన్నారు. దేశంలో విద్యాప్రమాణాలు మరింత అభివృద్ధి చెందాలని… దీనికి ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించాలని పేర్కొన్నారు.

Advertisements
 
Comments Off on సమాజ సంక్షేమానికి యువత కృషిచేయాలి: రాష్ట్రపతి

Posted by on December 8, 2013 in Uncategorized

 

రెవెన్యూ ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటన: రఘువీరా


రెవెన్యూ ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటన: రఘువీరా

ఈనాడు, హైదరాబాద్: రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న వీఆర్వో, వీఆర్ఏ ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటన జారీ చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి తెలిపారు. వారం రోజుల్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి విధివిధానాలు ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. డిసెంబరు 7న సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. రెవెన్యూలో 5962 పోస్టుల భర్తీకి ప్రభుత్వం డిసెంబరు 4న అనుమతి ఇచ్చిందని… తక్షణం ప్రకటనలు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఐ.వై.ఆర్.కృష్ణారావును ఆదేశించారు. వీటిలో 1657 వీఆర్వో, 4305 వీఆర్ఏ పోస్టులు ఉన్నాయని తెలిపారు. గతంలోలాగే ఉద్యోగాల భర్తీ పూర్తి పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

 
Comments Off on రెవెన్యూ ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటన: రఘువీరా

Posted by on December 8, 2013 in Uncategorized

 
 
%d bloggers like this: