RSS

సమాజ సంక్షేమానికి యువత కృషిచేయాలి: రాష్ట్రపతి

08 Dec

శాంతినికేతన్: మానవాళి సంక్షేమమే యువతకు అత్యంత ప్రాధాన్య లక్ష్యం కావాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. పశ్చిమబెంగాల్‌లోని విశ్వభారతి విశ్వవిద్యాలయ 48వ స్నాతకోత్సవంలో డిసెంబరు 7న ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ీదేశం నీకేం చేస్తుందని కాదు.. దేశానికి నువ్వేం చేయగలవో నిన్ను నీవు ప్రశ్నించుకో’ అన్న అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్.ఎఫ్.కెనడీ మాటలను గుర్తు చేశారు. అందరం సమాజం నుంచి ఎదిగినవారమే కాబట్టి సమాజం కోసం పాటుపడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అనంతరం రాష్ట్రపతి ముర్షీదాబాద్ జిల్లాలోని అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) విద్యార్థులతో ముచ్చటించారు. ఏఎంయూ కేవలం ఒక వర్గం వారికేనన్న భావన తొలగాలని, ఎవరైనా ఇక్కడ విద్యాభ్యాసం చేయొచ్చన్నారు. దేశంలో విద్యాప్రమాణాలు మరింత అభివృద్ధి చెందాలని… దీనికి ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించాలని పేర్కొన్నారు.

 
Comments Off on సమాజ సంక్షేమానికి యువత కృషిచేయాలి: రాష్ట్రపతి

Posted by on December 8, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: