ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని వెనకబడిన వర్గాల వారికి ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ల అమలుకోసం సంపన్నశ్రేణి (క్రిమిలేయర్) నిబంధనలను ప్రభుత్వం మరోసారి తెరమీదకి తెచ్చింది. ఆరు లక్షల రూపాయల వార్షికాదాయపరిమితి గలవారికి మాత్రమే బీసీ రిజర్వేషన్లు వర్తిస్తాయంటూ డిసెంబరు 9న ఉత్తర్వులు (జీవో నెం. 26) జారీ చేసింది. కేంద్రంలో ఉద్యోగ నియామకాలలో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం వార్షిక ఆదాయ పరిమితిని రూ. 4.50 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచుతూ ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా రాష్ట్రంలోనూ వార్షిక ఆదాయ పరిమితి అమలు నిబంధనలను తెస్తున్నట్లు పేర్కొంది.
Advertisements