RSS

Daily Archives: December 10, 2013

పదిలోనూ ఇంటర్నల్స్- వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు


హైదరాబాద్: పదో తరగతి పరీక్షల్లోనూ ఇంటర్నల్స్ అమల్లోకి రానున్నాయి. ఏడాది పాటు విద్యార్థులు చేసిన అసైన్మెంట్స్, ప్రాజెక్టులు, ప్రయోగాలకు 20 శాతం మార్కులు కేటాయించనున్నారు. ప్రతి సబ్జెక్టులో రాత పరీక్షకు 80 శాతం మార్కులనే ఇవ్వనున్నారు. ప్రస్తుతం ద్వితీయ భాష మినహా మిగిలిన అన్ని సబ్జెక్టులకు రెండు చొప్పున పరీక్ష పేపర్లు ఉన్నాయి. వాటిని కూడా రెండు కాకుండా ఒకటిగానే చేసి ఆరు పేపర్లు అమల్లోకి తేవటంపై చర్చ జరుగుతోంది. నాలుగు సహపాఠ్య కార్యక్రమాలకు 50 మార్కుల చొప్పున 200 మార్కులను కేటాయించనున్నారు. మేరకు టెన్త్ మెమోల స్వరూపంలోనూ మార్పులు తేనున్నారు. దీనికి అనుగుణంగా పదో తరగతి పాఠ్య పుస్తకాలను రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి మార్చుతోంది. ప్రక్రియ నెలాఖరుతో పూర్తి కానుంది. వచ్చే విద్యా సంవత్సరం (2014-15) నుంచి కొత్త పాఠ్య పుస్తకాలతోపాటు కొత్త పరీక్షల విధానాన్ని అమల్లోకి తేనుంది.ప్రధానంగారానున్నమార్పులు

  • పరీక్షల్లోపాఠంచివరలోఉండేఅభ్యాసంప్రశ్నలివ్వరు. ఒకేసమాధానంఉండేప్రశ్నలుకాకుండారెండుమూడురకాలజవాబుఉండేప్రశ్నలనేఅడుగుతారు.
  • ప్రశ్ననుపాజిటివ్కోణంలోచూసినా, నెగిటివ్కోణంలోచూసినా.. విద్యార్థిరాసేజవాబుకుఆధారాలుచెబుతూతనవాదననుబలపరచుకోవాలి. గైడ్స్, టెస్టుపేపర్లు, క్వశ్చన్బ్యాంకుల్లోఇస్తున్నట్లుప్రశ్నజవాబులవిధానంఉండదు.
  • ప్రతిసబ్జెక్టులో 80 మార్కులకేరాతపరీక్ష. ప్రాజెక్టులు, ప్రయోగాలు, అసైన్మెంట్లకు 20 మార్కులుఇస్తారు.
  • ప్రస్తుతంఉన్నఆరుసబ్జెక్టులతోపాటువిలువలవిద్యజీవననైపుణ్యాలకు (50 మార్కులు), కళలుసాంస్కృతికవిద్యకు (50 మార్కులు), శారీరకవ్యాయామవిద్య (50 మార్కులు), పనివిద్యకంప్యూటర్ఎడ్యుకేషన్ (50 మార్కులు) పేపర్లుఉంటాయి. వీటినివార్షికపరీక్షల్లోకాకుండాస్కూల్లోనేపరిశీలించిమార్కులుఇస్తారు. వాటినిపరీక్షలవిభాగానికిపంపితేవిద్యార్థులమెమోల్లోచేర్చుతారు.
 
Comments Off on పదిలోనూ ఇంటర్నల్స్- వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు

Posted by on December 10, 2013 in Uncategorized

 

భారత విద్యార్థులకు బ్రిటన్‌ స్వాగతం


న్యూఢిల్లీ: బ్రిటన్‌లో భారత విద్యార్థులు చాలా తక్కువగా మంది ఉన్నారని బ్రిటన్‌ వాణిజ్య శాఖ సహాయమంత్రి విన్స్‌ కేబుల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపై వారిపై ఎటువంటి పరిమితులు విధించబోమని సంఖ్యా పరిమితి లేకుండా భారత విద్యార్థులను ఆహ్వానిస్తున్నామని బ్రిటన్‌ తీర్మానించిందని చెప్పారు. భారత పర్యటనలో ఉన్న విన్స్‌ ఇక్కడ జరగిన భారత్‌-బ్రిటన్‌ ఆర్థిక, వాణిజ్య సంయుక్త కమిటీ తొమ్మిదో సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం విన్స్‌ మాట్లాడుతూ.. బ్రిటన్‌లో భారత విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇటీవలి గణాంకాలు పరిశీలిస్తే.. బ్రిటన్‌లో భారత విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయిందన్నారు. బ్రిటన్‌లో అనువైన పరిస్థితులు లేవని వారు భావిస్తున్నారు. కానీ మేం వారిని స్వాగతిస్తున్నాం. వారి సంఖ్యపై ఎటువంటి పరిమితులు విధించబోమని తెలిపారు.

 
Comments Off on భారత విద్యార్థులకు బ్రిటన్‌ స్వాగతం

Posted by on December 10, 2013 in Uncategorized

 

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో సంస్కరణలు


* వచ్చే ఏడాది నుంచి అమలుకు విద్యాశాఖ కసరత్తు
ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే విద్యా సంవత్సరం(2014-15) నుంచి జరిగే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో సంస్కరణలు రాబోతున్నాయి. మారనున్న పాఠ్యప్రణాళికను అనుసరించి ప్రశ్నపత్రాల రూపకల్పన, విద్యార్థుల సామర్థ్యం గుర్తింపు వంటి అంశాల్లోనూ మార్పులు తీసుకురాబోతున్నారు. 1996 తరువాత తొలిసారిగా పదో తరగతి పాఠ్య పుస్తకాలు వచ్చే ఏడాది నుంచి మారుతున్నాయి. ఇదే సమయంలో పరీక్షల్లోనూ సంస్కరణల అవసరాన్ని విద్యాశాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో విద్యా శాఖ సంచాలకులు వాణీమోహన్‌ వచ్చే వారం దీనిపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేయబోతున్నారు. కొద్దికాలం కిందట ఓ సందర్భంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నపత్రాల తీరుపై చర్చ జరిగినప్పుడు కొన్ని లోపాలు గుర్తించారు. వాటిని ఆధారంగా చేసుకుని అలాంటివన్నీ అధిగమించే ప్రయత్నం ప్రారంభమవుతోంది.
గుర్తించిన లోపాలివీ..
* ప్రస్తుతం ప్రశ్నపత్రాలు బట్టీ విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు పరీక్షలపైనే దృష్టి సారిస్తున్నారు తప్ప పాఠాల ప్రాధాన్యాన్ని పట్టించుకోవడం లేదు.
* బ్లూప్రింట్‌ ఆధారంగా ఎక్కువ మార్కులు కేటాయించిన చాప్టర్లకు మాత్రమే విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో పాఠ్య పుస్తకంలోని అధ్యాయాలన్నీ చదవకున్నా ఉత్తీర్ణతకు అవకాశం ఉంది.
* గణితం, సైన్స్‌ల్లో 90 నుంచి నూరు శాతం మార్కులు సాధించిన వారినీ ప్రతిభావంతులుగా గుర్తించలేని పరిస్థితులున్నాయి. బట్టీ విధానమే దీనికి కారణం.
* అక్టోబరు, నవంబరు నాటికే బోధన పూర్తిచేసి… పదేపదే అంతర్గత పరీక్షలతో విద్యార్థుల మెదడును బట్టీకి అలవాటుపడేలా చేస్తున్నారు.
* వరుసగా నాలుగైదు పూర్వ ప్రశ్నపత్రాలను చదివితే చాలు. వాటిలో ప్రశ్నలే స్వల్పమార్పులతో వస్తున్నాయి.
* సమగ్రమైన పాఠ్యపుస్తకాలను గాలికొదిలి గైడ్లను చదివి పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందజేస్తున్నా కొందరు ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తుండడంతో గైడ్ల వినియోగం కనిపిస్తోంది.
* కొన్ని సంస్థలు తయారుచేసిన నమూనా ప్రశ్నపత్రాల నుంచి కూడా ప్రశ్నలు ఏదోఒక రూపంలో పబ్లిక్‌ పరీక్షల్లో దర్శనమిస్తున్నాయి. బట్టీ విధానంలో చదివి రాసే జవాబుల్లో మూడు, నాలుగు పాయింట్లున్నా మార్కులు ఇచ్చేస్తున్నారు.
ప్రక్షాళన తప్పనిసరి..
విద్యా శాఖలోనే వివిధ వర్గాలు పేర్కొంటున్న ప్రకారం.. ప్రశ్నపత్రాల రూపకల్పనలో పూర్తి స్థాయి మార్పులు అవసరం. విద్యార్థులు ఆలోచించి రాసేలా ప్రశ్నపత్రాలు ఉండాలి. అన్ని అధ్యాయాలకూ సమ ప్రాధాన్యమిస్తూ సంబంధిత సబ్జెక్టుపై ఉన్న విషయ పరిజ్ఞానాన్ని గుర్తించేలా ప్రశ్నలు రూపొందించాలి. పది మంది విద్యార్థులు జవాబులు రాస్తే.. అవి వేర్వేరుగా ఉండాలే తప్ప, ఒకేలా ఉండకూడదు.
సంస్కరణల విషయంలో రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్థ సంచాలకుడు గోపాలరెడ్డి ‘ఈనాడు’తో మాట్లాడుతూ ‘విద్యా హక్కు చట్టాన్ని అనుసరించి నిరంతర సమగ్ర మూల్యాంకనం వంటి ముఖ్యమైన మార్పులను ఇప్పటికే ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు అమలుచేస్తున్నాం. తొమ్మిదిలోనూ వర్తింపజేస్తున్నాం. వచ్చే ఏడాది పదో తరగతి పాఠ్యపుస్తకాలు మారుతున్నాయి.. దీంతో పబ్లిక్‌ పరీక్షల్లోనూ సంస్కరణల ఆవశ్యకత ఉంది. ఉపాధ్యాయులకు కొత్త పాఠ్య పుస్తకాలు, ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్షల తీరుపై తరగతులు నిర్వహించాలి. ప్రభుత్వంతో చర్చించి పదో తరగతి పరీక్షల్లో సంస్కరణలు అమలు చేస్తాం’ అని వెల్లడించారు.

 
Comments Off on పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో సంస్కరణలు

Posted by on December 10, 2013 in Uncategorized

 

ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం


శ్రీ‌కాకుళం (గ్రామీణ భామిని, సీతంపేట) : అంబేద్కర్‌ ఓవర్‌ సీస్‌ విద్యానిధి పథకంలో భాగంగా విదేశాల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సులు చదివేందుకు గిరిజన విద్యార్థులకు రూ. 10 లక్షల వరకు ఉపకార వేతనాలు అందజేస్తారని ఐటీడీఏ పీవో సునీల్‌రాజ్‌కుమార్‌, డీడీ కె.నాగోరావు తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. గిరిజన సంక్షేమశాఖ ప్రవేశపెట్టిన ఈ పథకంలో భాగంగా అమెరికా, ఇంగ్లాండ్‌, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్‌ తదితర దేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో చదువుకునే అవకాశం ఉందన్నారు. ఆన్‌లైన్‌లో రిజిష్ట్రేషన్‌ కోసం http://www.epass.cgg.gov.inలో ప్రవేశించాలన్నారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2.50 లక్షలు లోపు, విద్యార్థుల వయసు 35 ఏళ్లలోపు ఉండి, సంబంధిత అర్హత కోర్సులో 60 శాతం మార్కులు సాధించాలన్నారు. ఈ ఉపకారవేతనం కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశ అనుమతి పొంది ఉండాలన్నారు.

 
Comments Off on ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

Posted by on December 10, 2013 in Uncategorized

 

వీఆర్వో, వీఆర్ఏ ఉద్యోగాల భర్తీకి పది రోజుల్లో ప్రకటన


వీఆర్వో, వీఆర్ఏ ఉద్యోగాల భర్తీకి పది రోజుల్లో ప్రకటన

* 1658 వీఆర్వోలు…4305 వీఆర్ఏలు
* రాతపరీక్ష మార్కులే ఆధారం
ఈనాడు, హైదరాబాద్: వీఆర్వో, వీఆర్ఏ పోస్టుల భర్తీకి రెవెన్యూ శాఖ సిద్ధమవుతోంది. గతంలో మాదిరి శాఖాపరంగానే పోస్టులను భర్తీ చేయాలని డిసెంబరు 9న ప్రాథమికంగా నిర్ణయించారు. పది రోజుల్లో భర్తీ ప్రకటన వెలువడేలా రెవిన్యూ అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. 2011లో భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం ద్వారా వీఆర్వో, వీఆర్ఏ పోస్టులను భర్తీ చేశారు. వీఆర్వో పోస్టులకు గతంలో ఇంటర్మీడియట్ అర్హతను, వీఆర్ఏలకు పదో తరగతిని అర్హతగా, వయోపరిమితిని 18 ఏళ్ల నుంచి 34 ఏళ్లుగా నిర్ణయించి ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సారి కూడా ఇంటర్వ్యూలు లేకుండా కేవలం రాత పరీక్ష ప్రతిభ ఆధారంగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనున్నారు. రాష్ట్రంలో మొత్తం 2366 గ్రామ రెవిన్యూ అధికారుల ఖాళీలు ఉండగా 70 శాతం ఉద్యోగాల్ని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. ఫలితంగా 1658 పోస్టులు రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ కానుండగా 708 పోస్టుల్ని శాఖలో పదోన్నతి ద్వారా భర్తీ చేస్తారు. గ్రామ రెవెన్యూ సహాయకుల 4305 ఉద్యోగాల్ని రాతపరీక్ష ద్వారా భర్తీ చేస్తారు.

 
Comments Off on వీఆర్వో, వీఆర్ఏ ఉద్యోగాల భర్తీకి పది రోజుల్లో ప్రకటన

Posted by on December 10, 2013 in Uncategorized

 
 
%d bloggers like this: