RSS

Daily Archives: December 11, 2013

ఇంటర్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు


 

* మార్చి 17పరీక్షలు 18

 

ఈనాడు-హైదరాబాద్: ఇంటర్ పబ్లిక్ పరీక్షల తేదీల్లో స్వల్పమార్పు చోటుచేసుకుంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు డిసెంబరు 11న నిర్ణయాన్ని తీసుకుంది. మార్చి 12వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మార్చి 17వ తేదీన ఇంటర్ ప్రథమ సంవత్సరం గణితం, బోటనీ, ఇతర పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే..అదేరోజు ప్రభుత్వం జారీచేసిన సెలవుల పట్టిక ప్రకారం హోలీ పండుగ మార్చి 17వ తేదీన జరగనుంది. దీంతో.. ఆరోజున జరిగే పరీక్షలను మరుసటి వాయిదావేశారు. ఆ తరువాత పరీక్షలు ఇదే క్రమంలో ఒక్కొక్కరోజుకు వాయిదా పడతాయి. దీనివల్ల మార్చి 24వ తేదీతో ముగియాల్సిన ప్రధాన పరీక్షలు అదేనెల 26వ తేదీతో ముగుస్తాయి.

Advertisements
 
Comments Off on ఇంటర్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు

Posted by on December 11, 2013 in Uncategorized

 

రెండువేల అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు


* ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌మిశ్రా
ఈనాడు, విశాఖపట్నం: రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో రెండువేల అధ్యాపక పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తున్నట్లు ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌మిశ్రా తెలిపారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డిసెంబరు 10న జరిగిన పాలకమండలి సమావేశానికి హాజరైన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. దశలవారీగా ఈ భర్తీ ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని, ఈ మేరకు ఖాళీల వివరాలు తెప్పించుకుంటున్నట్లు చెప్పారు. బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని, నిబంధనల ఉల్లంఘన జరుగుతోందన్న ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొన్నారు. ఏయూ పాలకమండలి సమావేశంలో కళాశాల విద్య కమిషనర్‌ కె.సునీత, ఆర్థికశాఖ అదనపు కార్యదర్శి వై.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

 
Comments Off on రెండువేల అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు

Posted by on December 11, 2013 in Uncategorized

 

గురువులు జీవిత పాఠాలు నేర్పాలి


* ముంబయి జేసీపీ లక్ష్మినారాయణ
ఈనాడు, హన్మకొండ: విద్యార్థులకు పాఠాలతో పాటు జీవిత పాఠాలను కూడా గురువులు నేర్పాలని సీబీఐ మాజీ జేడీ, ముంబయి జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌(క్రైం)వి.వి.లక్ష్మినారాయణ పేర్కొన్నారు. పదో తరగతిలో ప్రతిభ చూపిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను వరంగల్‌ జిల్లా వంగపహాడ్‌లో భవినేచ యూత్‌ ఆర్గనైజేషన్‌ డిసెంబరు 10న బహుమతులతో సత్కరించింది. ఈ కార్యక్రమానికి లక్ష్మినారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తన దృష్టిలో పాఠ్య పుస్తకాల్లోని పాఠాలు చెప్పేవారు గురువులని, పాఠాలతో పాటు జీవిత పాఠాలు నేర్పేవాళ్లు సద్గురువులని పేర్కొన్నారు. అప్పుడే భారతదేశం ప్రపంచ దేశాల్లో వెలిగిపోతుందన్నారు. విద్యార్థులు ప్రతిభతో పాటు వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలని సూచించారు. గౌరవ అతిథిగా పాల్గొన్న విద్యావేత్త చుక్కారామయ్య మాట్లాడుతూ.. తాను విదేశాల్లో స్థిరపడిన ఇక్కడి పూర్వవిద్యార్థులతో మాట్లాడి.. ప్రతి పాఠశాలలో ల్యాబొరేటరీలు ఉండేలా వారి సహాయం కోరానని తెలిపారు.

 
Comments Off on గురువులు జీవిత పాఠాలు నేర్పాలి

Posted by on December 11, 2013 in Uncategorized

 

* విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి వినతి


ఈనాడు, హైదరాబాద్ : డీఎస్సీ 2012లో మొదటి జాబితాలో ఎంపికై, సాంకేతిక కారణాతో తొలగించిన అభ్యర్థులకు వెంటనే పోస్టింగులు ఇవ్వాలని ఐకాస నేతలు కోదండరామ్, శ్రీనివాస్‌గౌడ్‌లు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారిని కోరారు. డీఎస్సీ అభ్యర్థులతో కలిసి డిసెంబరు 10న సచివాలయంలో తివారితో భేటీ అయ్యారు. గతంలో సీఎం హామీ ఇచ్చిన విధంగా ప్రత్యేక పోస్టులను సృష్టించి, వారికి నియామకపు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రతిభగల అభ్యర్థులకు అన్యాయం చేయవద్దని సూచించారు.

 
Comments Off on * విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి వినతి

Posted by on December 11, 2013 in Uncategorized

 

ఉద్యోగ ప్రకటనలు జారీ చేద్దామా?


ఉద్యోగ ప్రకటనలు జారీ చేద్దామా?

* తేల్చుకోలేకపోతున్న ఏపీపీఎస్సీ
ఈనాడు-హైదరాబాద్: ఉద్యోగ ప్రకటనల జారీపై ఏపీపీఎస్సీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో ఉద్యోగ ప్రకటనల జారీపై స్పష్టత కోరుతూ ఇప్పటికి రెండు మార్లు లేఖలు రాసినా తిరుగు సమాధానం రాకపోగా…మమల్ని అడగాల్సిన అవసరం ఏమిటని ప్రభుత్వ వర్గాలు ఏపీపీఎస్సీని ప్రశ్నించాయి. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన విభజన ప్రతిపాదనల్లోనూ ఉద్యోగ నియామకాలపై స్పష్టతలేదు. ఈ పరిస్థితుల్లోనే రెవెన్యూ ఉద్యోగాల భర్తీకి సంబంధిత శాఖ అధికారులు సిద్ధం అవుతున్న విషయం ఏపీపీఎస్సీ దృష్టికి వచ్చింది. ఈ నెలాఖరులోగా ఉద్యోగాల భర్తీ ప్రకటనలు జారీచేయకుంటే అభ్యర్థులు నష్టపోయే అవకాశముందనే అభిప్రాయమూ కమిషన్ సభ్యుల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వం నుంచి సమాధానం రాకుండానే ఉద్యోగ ప్రకటనలు ఇస్తే పరిస్థితి ఏమిటన్న దానిపైనా ఏపీసీఎస్సీలో సంశయం నెలకొంది. ఏదిఏమైనా ఉద్యోగ ప్రకటనల జారీపై ఈ వారంలోనే ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. సుమారు 20వేల ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది.

 
Comments Off on ఉద్యోగ ప్రకటనలు జారీ చేద్దామా?

Posted by on December 11, 2013 in Uncategorized

 

11 CLs


Request to all the Principals and FACs regarding CLs.

Yesterday APMS JD Mr.Satyanarayana Reddy visited one of the schools in Nalgonda District.

There the Principal raised the issue regarding the CLs.JD has clarified that we can avail 11 CLs

and he also suggested that it is the responsibility of a principal to look after the CLs of a teacher

should not exceed more that eleven(11) and should make sure that no teachers salary falls under

Loss of Pay(LOP). so kindly pass on this information for smooth running of the school.

 
Comments Off on 11 CLs

Posted by on December 11, 2013 in Uncategorized

 
 
%d bloggers like this: