RSS

ఇంట‌ర్ ప్రయోగ ప‌రీక్షలపై అధ్యాపకుల సూచనలు

12 Dec

ఇంట‌ర్ ప్రయోగ ప‌రీక్షలపై అధ్యాపకుల సూచనలు అనంతపురం విద్య, న్యూస్‌టుడే: కేవలం మార్కుల కోసం కాకుండా విశ్లేషణ, అధ్యయనంతో చేసిన ప్రతి అంశం విద్యార్థి భవితకు పునాది వేస్తుంది. తరగతి గదిలో తెలుసుకున్న అంశాలు ప్రయోగాత్మకంగా చూపితే విద్యార్థుల్లో నైపుణ్యం బహిర్గతం కావడానికి దోహదం చేస్తాయి. హైస్కూలు విద్య తరువాత ఇంటర్, ఇంజినీరింగ్ ఆపై చదువుల్లో ఈ ప్రయోగాత్మక విధానమే వారి భవితకు సోపానంగా నిలుస్తుంది. ఇంటర్‌లో ప్రతి మార్కు భవిష్యత్తు విజయానికి కీలకమే. ప్రయోగ పరీక్షల్లో కాస్త ఏకాగ్రత పెడితే ముప్పైకి ముప్పై మార్కులు వచ్చి ఎంసెట్‌కు వెయిటేజి పెరుగుతంది. ఈ ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 12 నుంచే ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని 89 కేంద్రాల్లో వీటిని నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. జిల్లాలో మొత్తం 164 జూనియర్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరంలో 25 వేల మంది విద్యార్థులున్నారు. ఎక్కువ మంది ఎంపీసీ, బైపీసీ గ్రూపువారే. ఈ సారి థియరీ మారడంతో ప్రయోగాల్లో కొన్ని మార్పులు జరిగాయి. దీంతో ఏ తరహా ప్రయోగాలు చేయాల్సి ఉంటుందోనని విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ప్రయోగ పరీక్షలకు ఇంకా సమయం ఉన్నందువల్ల విద్యార్థులు ఏ విధమైన ఒత్తిడి, తికమక పడాల్సిన అవసరం లేదని అనుభవజ్ఞులైన అధ్యాపకులు ధైర్యం చెబుతున్నారు. ఎలాంటి సూచనలు పాటించాలో విద్యార్థులకు వివరించారు.
తికమకొద్దు
పరీక్షలో ఇచ్చిన ప్రయోగం ఎటువంటి పరిస్థితుల్లో మార్చరు. జనవరిలో కళాశాలలో అధ్యాపకులు నిర్వహించే మాదిరి ప్రయోగ పరీక్షలకు తప్పనిసరిగా హాజరు కావాలి. పూర్తిగా అంశం రాకున్నా కొన్ని మెలకువలు పాటిస్తే సులభంగా మార్కులు పొందొచ్చు. కాస్త అవగాహన ఉంటే ముప్పైకి ముఫ్పై, ఎంత వెనుబడిన వారికైనా పాసు మార్కులు 11 తెచ్చుకోవడం తేలికే.
రసాయనశాస్త్రం
* ఈ విద్యాసంవత్సరం నుంచి లవణ విశ్లేషణ విధానంలో కొత్తగా అమ్మోనియం అసిటేట్, బేరియం అసిటేట్, నికెల్ నైట్రేట్, స్ట్రాన్షియం క్లోరైడ్, ఘన పరిమాణాత్మక విశ్లేషణ విధానంలో సోడియం హైడ్రాక్సైడ్‌ను ఆగ్జాలిక్ ఆమ్ల ద్రావణంతో పాటు కొల్లాయిడ్ దావ్రణాల తయారీ, క్రొమటోగ్రఫీ, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్ల గుణాత్మక పరీక్షలు ప్రయోగాలు చేర్చారు.
* గుణాత్మక సామాన్య లవణ విశ్లేషణ : 10 మార్కులు
* ఘన పరిమాణాత్మక విశ్లేషణ : 8 మార్కులు
* (ఎ) కర్బన సమ్మేళనంలో ప్రమేయ సమూహం గుర్తింపు
లేదా (బి) కొల్లాయిడ్ ద్రావణాలను తయారీ లేదా (సి) క్రొమటోగ్రఫీ లేదా (డి) కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్ల గుణాత్మక పరీక్షలు: 6మార్కులు
మౌఖిక పరీక్ష (వైవా) : 2మార్కులు
వైవాకు సంబంధించి సామాన్య ప్రయోగశాల విధానాలు, ఘన పరిణామాణాత్మక విశ్లేషణ విధానం, లవణ విశ్లేషణ విధానం, కర్బన సమ్మేళనంలో ప్రమేయ సమూహాన్ని గుర్తించడం.
ప్రాజెక్టు వర్కు: 2 మార్కులు
ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రచురించిన ప్రయోగ దీపికలో మొదటి సంవత్సరం ఆరు, ద్వితీయంలో ఆరు ప్రాజెక్టులను పొందుపరిచారు. ఒక్కో సంవత్సరం నుంచి కనీసం ఒక ప్రాజెక్టును విద్యార్థులచే చేయించాలి.
రికార్డు: 2మార్కులు
ఇంటర్‌లో మొత్తం ప్రయోగాలన్నింటిని ఒక రికార్డు రూపంలో పరీక్షల్లో బోర్డుకు సమర్పించాల్సి ఉంటుంది.
– రమేష్, ఎస్ఏపీఎస్ జూనియర్ కళాశాల, గోరంట్ల
వృక్షశాస్త్రం
ప్రయోగ మార్కులు : 30
* వృక్షశాస్త్రంలో తెలుగు అకాడమీ ప్రచురించిన ప్రయోగ దీపిక సిలబస్ ఆధారంగా ప్రథమ సంవత్సరంలోని 21 ప్రయోగాలు, ద్వితీయ సంవత్సరంలోని 13 ప్రయోగాలు ఉన్నాయి. మూడు గంటల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది.
1వ ప్రశ్న: 6 మార్కులు
వ ప్రశ్న: 6 మార్కులు
3వప్రశ్న: 6 మార్కులు
4వప్రశ్న: 5 మార్కులు
ఐదో ప్రశ్న : 5 మార్కులు
హెర్బేరియం : 2 మార్కులు
* కొత్తగా చేర్చిన వాయు, అవాయు శ్వాస క్రియ, నిపానము, ద్రవోద్గమము, కాంతి అనువర్తనాలు, అగ్రాధిక్యత, క్వాడ్రటి పద్దతిలో మొక్కల జనాభా సాంద్రత, కృత్రిమ పరాగ సంపర్కానికి అవసరమైన విపులసీకరణ, బాగింగ్, టాగింగ్‌లు.
– టి.ధనలక్ష్మి, ఎస్ఎస్ఎస్ కళాశాల అనంతపురం
భౌతికశాస్త్రం
ప్రయోగ మార్కులు: 30
1. సూత్రం రాసినందుకు : 2మార్కులు
2.ప్రయోగ పద్ధతికి : 3 మార్కులు
3. పట్టికలు-పరిశీలనలు-గ్రాఫ్ : 8మార్కులు
4. జాగ్రత్తలు : 2 మార్కులు
5. గణన : 4 మార్కులు
6. ఫలితం ప్రమాణాలు : 2 మార్కులు
7. వైవా : 5 మార్కులు
8. రికార్డు : 4 మార్కులు
అనవసరంగా 4 మార్కులు కోల్పోతారు
ప్రయోగ పరీక్షలలో విద్యార్థికి ఒక ప్రయోగం మాత్రమే కేటాయిస్తారు. ఆ ప్రయోగానికి సంబంధించి అన్ని విషయాలు జోడిస్తేనే 30కి 30 మార్కులు వస్తాయి. ఎక్కువ మంది విద్యార్థులు గణన జవాబు పత్రంలో వేయకుండా రావడంతో నాలుగు మార్కులు కోల్పోతారు. పైన ఉన్న 8 అంశాలను జోడిస్తేనే గరిష్ట మార్కులు పొందే అవకాశం ఉంది.
కష్టానికి స్వస్తి
భౌతిక శాస్త్రంలో పాత సిలబస్‌లో కష్టతరంగా ఉన్న కొన్ని ప్రయోగాలు తొలగించి సులభమైన అంశాలు జోడించారు. వెర్నియర్ కాలిపర్స్, స్క్రూగేజి, కుంభాకార కటకం, పుటాకార దర్పణం, ట్రాన్సిస్టర్ అబి లక్షణాలు చేర్చారు. ఇవి సులభంగా చేయవచ్చు. – కె.చెన్నకేశవ చౌదరి, కేఎస్ఆర్ ప్రభుత్వ బాలికల కళాశాల
జంతుశాస్త్రం
ప్రయోగ మార్కులు : 30
* జంతుశాస్త్రంలో ఆరు మార్కులకు ఉండే పటం కీలకమే. ఇచ్చిన నమూనా, చార్టు, ప్రొజెక్షన్ గుర్తింపునకు సంబంధించి చక్కని పటం గీసి కనీసము నాలుగు భాగాలు గుర్తించాలి. గుర్తింపుకు 1 మార్కు, పటం మూడు మార్కులు, భాగాలు 2 మార్కులు ఇస్తారు.(ఉదా: వానపాము జీర్ణ వ్యవస్థ).
* ఎ, బి, సి, డి నమూనాల్లో ప్రశ్నపత్రంలో అడిగిన పదార్థపు ఉనికిని గుర్తించడం, ప్రయోగ సూత్రం, ప్రయోగ విధానం, ఫలిలాలు రాయడానికి సంబంధించి 5 మార్కులు కేటాయిస్తారు. (ఉదా: పిండిపదార్థపు ఉనికిని గుర్తించడం) సూత్రానికి 1 మార్కు, ప్రయోగ విధానానికి 3 మార్కులు, ఫలితానికి 1 మార్కు ఉంటుంది.
* ఎ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి స్పార్టర్స్‌ను గుర్తించడంలో పటం గీసి, భాగాలు గుర్తించాలి ఏడు అంశాలు ఇస్తారు. ఒక్కో అంశానికి 2 మార్కులు చొప్పున మొత్తం 14 ఉంటాయి. ఇందులో గుర్తింపునకు అర మార్కు, పటానికి అర మార్కు, గుర్తింపు లక్షణాలకు 1 మార్కు కేటాయిస్తారు.
రికార్డు: 5మార్కులు

 
Comments Off on ఇంట‌ర్ ప్రయోగ ప‌రీక్షలపై అధ్యాపకుల సూచనలు

Posted by on December 12, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: