RSS

ఆరు లక్షల కేంద్ర ప్రభుత్వోద్యోగాల ఖాళీ

12 Dec

* మంత్రి నారాయణస్వామి వెల్లడి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మొత్తం ఆరులక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వోద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వివిధ కేంద్రప్రభుత్వ విభాగాలు…మంత్రిత్వ శాఖల్లో ఈ ఖాళీలున్నట్లు కేంద్ర సిబ్బందిశాఖ సహాయమంత్రి వి. నారాయణస్వామి డిసెంబరు 12న తెలిపారు. 2012 మార్చి ఒకటో తేదీ నాటికి వివిధ కేంద్రప్రభుత్వ విభాగాలు… మంత్రిత్వశాఖలు, కేంద్రపాలిత ప్రాంతాల పాలనా యంత్రాంగాల్లో 36,84,543 పోస్టులను మంజూరు చేసినట్లు మంత్రి నారాయణస్వామి గురువారం రాజ్యసభలో వెల్లడించారు. ఇందులో ఇప్పుడు 6,00,013 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆయన వివరించారు. అయితే, సంబంధిత మార్గదర్శక సూత్రాలు, నిర్ణీత కాలవ్యవధి….నిబంధనల మేరకు కేంద్రప్రభుత్వ మంత్రిత్వశాఖలు, విభాగాలు ఈ ఖాళీలను భర్తీ చేయాల్సి ఉందని ఆయన వివరించారు.

 
Comments Off on ఆరు లక్షల కేంద్ర ప్రభుత్వోద్యోగాల ఖాళీ

Posted by on December 12, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: